మాలిమైన పావురాళ్ళు , నా అక్షర స్నేహితురాళ్ళు.
తిరణాలలో తప్పిపోయిన
పసిపిల్లలు,
దిక్కుతోచక అమ్మకొసం ఏడిచే..
పిల్లికూనలు.
నాకలం లోని సిరాచుక్కలో దాగిన,
మేలిమి ముత్యాలు.
సందించి వదిలేస్తే వాడిగా దూసుకెళ్ళే
అక్షర భాణాలు.
దుర్మార్గుల గుండెల్ని చీల్చి వచ్చే,
అక్షర కడ్గాలు.
అరాచకాలపై సమర భేరి మోగించిన,
అక్షర శంఖాలు.
నిదుర కాసి నేను అల్లుకున్న
జాబిలి వెలుగులు.
అలుపే ఎరుగని నిరంతర పోరు సలిపే,
అక్షర వీరులు.
ప్రతి సాహితీ ప్రియుని పలకరించే,
ప్రేమ మాలికలు.
విద్యావంతులైన మీ ఆశ్శీస్సులను నాకందించే,
శుభాషితాలు
తిలక్ వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు లాగ..
ReplyDeleteవర్మాజీ, తిలక్ గారి అక్షరాలు వెన్నెల్లో ఆడపిల్లలు.
Deleteనా పదాలు ఎర్రటి ఎండలో ఆకలితో అలమటించే బీద పిల్ల్లలు.
అప్పుడప్పుడూ మీ వంటి మిత్రులను పలకరించే పావురాళ్ళు.
మీ స్పందనకు ధన్యవాదాలు.
బాణాలు,ఖడ్గాలు,సుభాషితాలు బాగా సంధించారు :)
ReplyDeleteసర్, వందనాలూ, నమస్సులూ, ధన్యవాదాలూ, విన్నపాలూ, వి్శ్వాసాలూ కూడా సంధిస్తుంటాను కదా,
ReplyDeleteమీ స్పందన సంతోషాన్నిస్తుంది.
తిరణాలలో తప్పిపోయి, అమ్మకొసం ఏడిచే .... పిల్లికూనలు.
ReplyDeleteనా కలం లోని సిరాచుక్కలో దాగి, అరాచకాలపై సమర భేరై మోగిన, అక్షర శంఖాలు. వాడిగా దూసుకెళ్ళే అక్షర భాణాలు, దుర్మార్గం గుండెలు చీల్చే, అక్షర ఖడ్గాలు. నిరంతరం పోరే, అక్షర వీరులు.
వీరు వివేకం ఆశిస్సులు అందించే, శుభాషితాలు
"మాలిమి పావురాళ్ళు, నా అక్షర స్నేహితురాళ్ళు."
పావురాళ్ళు, స్నేహితురాళ్ళు లానే కాకుండా కవిత లో కవయిత్రి అక్షరాలకు, వీర తిలకం దిద్ది రణరంగానికి సాగనంపే వీరమాతలా .... సాగిస్తున్న అక్షర పోరాటం చూస్తున్నాను.
ధన్యాభివాదాలు ఫాతిమా గారు!
చంద్ర గారూ, అక్షరానికి పోరాటం చేసే శక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా..
Deleteకవి హ్రుదయాన భావాగ్ని చెలరేగినప్పుడు.
నా కవితల్లో నా వేదన కనిపిస్తుంది, నా కర్తవ్యం కనిపిస్తుంది.
నా అక్షరాన్ని గుర్తించిన బ్ల్లాగ్ మిత్రుల స్పందనలతో... నా కర్తవ్యానికి ఆయత్తమవుతుంటాను.
బాగుంది మేడం! మీరు కవితలు చాలా అద్భుతంగా వ్రాస్తారు.మీలో ఉన్న కవయిత్రికి జోహార్లు!
ReplyDeleteఅహ్మద్ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు,
Delete100 బ్లాగ్ లను వీక్షించే మీ మెప్పు పొందటం నా అక్షరాల అదృష్టం.
మీ కవితింట మేమూ కాలిడటం మరో సదవకాశం.
"మాలిమైన పావురాళ్ళు , నా అక్షర స్నేహితురాళ్ళు" ఇలా మొదట్లోనే కట్టిపడేసారు....బాగుంది కవిత!
ReplyDeleteపద్మా, ఆ స్నేహితురాళ్ళు మీకూ మచ్చికైన వాళ్ళే.
Deleteనిత్యం మీ వేళ్ళ మద్య జారే పట్టు దారాలు.
సంతోషం మీ స్పందనకు.
'ప్రతి సాహితీ ప్రియునికీ ప్రేమవీచికలు మీ కవితలు'...అవునూ ఇంతబాగా ఎలారాస్త్ట్టారబ్బా?
ReplyDeleteఅక్కా, ఎలా ఉన్నారు,
Deleteబాగా రాస్తావు అని మెచ్చుకొని నన్నింకా రాయగలిగేలా చేసే మీకు నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.