Pages

Tuesday, 15 October 2013

ఎదగ (నీయని) ని మొక్క.

     



   







   ఎదగ  (నీయని) ని మొక్క.

   పసి చేతులలో    పాతచిరుగులు 
   నీ ఇంటి గచ్హు మెరిపిస్తున్నాయి.

   కాలిన  కడుపుల  ఆకటి కేకలు 
   అంట్ల గిన్నెల  చప్పుడులో  అస్తమిస్తున్నాయి.

   వెచ్చటి రగ్గులో సుఖమెరిగిన నిద్రకు 
   చిట్టి చేతుల చీపురు సవ్వడి  చికాకు కలిగిస్తుంది.

   భాల్యం  కోల్పోయిన  దాస్యం,
   మెట్లు లేని దిగుడు బావి నుండి  పైకి  పాకలేకుంది.

   ఇనుప చట్రాలలో  ఇరుక్కుని,
   ఉక్కు పిడికిలికై  వెతుక్కుంటున్నట్లుంది.

   నువ్వు  కడుతున్న   సమాదుల కింద, 
   భవిత పునాదిని వెతుక్కుంటుంది.

   కొన్ని తరాల  అణిచి వేత  కలసి,
   తనను  కత్తి అంచున  కూర్చోబెట్టినట్లుంది.

.





9 comments:

  1. ఆకలి బాధ ఎన్నో బ్రతుకులను ఆవిరిచేస్తూనే ఉంది.చదువుకుని బాల్యం ఎంజాయ్ చేయాల్సిన పిల్లలు చిదిమిపోతూనే ఉన్నారు.ఇదంతా చోద్యంలా చూస్తున్న మనిషి మానవత్వం మరిచి ఎలా ఉంటున్నాడో తెలీదు.కవిత కదిలించింది మేడం!

    ReplyDelete
    Replies
    1. అహ్మద్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
      ఆ పసిపిల్లల భవితని అణచివేయటములో ఎందరో భాగస్వాములు.
      1. కనీస అవసరాలు కూడా తీరచలేని ప్రభుత్వం.
      2.స్వార్దంతో వెట్టి చాకిరీ చేయించుకొనే ధనవంతులు.
      3.బిడ్డలని కనటమే తప్ప వారి భాద్యత వహించకుండా వ్యసనాలకు అలవాటైన తల్లిదండ్రులు.
      4.వారికి విద్యాబుద్దులు నేర్పటం విస్మరించిన ఉపాద్యాయులూ, ఇలాఅ ఎందరో... ఇంకా ఎన్నో అసాంఘిక శక్తులు.
      కూడూ,గూడూ కూడా నోచుకోని ఇంకా ఎందరు అనాదలో. ఎన్నో స్వచ్చంధ సంస్థలు ఆదుకుంటున్నాయి
      నేను గర్వంగా చెప్పుకొనేది ఏమిటంటే ఇలాంటి కొందరు ఆడబిడ్డలకు నేను ఉచిత విద్యని ఇవ్వగలగటం నా అదృష్టంగా్ భావిస్తున్నాను.

      Delete
    2. " ....కొందరు ఆడబిడ్డలకు నేను ఉచిత విద్యని ఇవ్వగలగటం..." అభినందనలు.

      Delete
    3. కొందరి ఆడబిడ్డలకు ఉచితవిద్యను అందిస్తుందుకు సమాజంలోని బాధ్యత గల పౌరుడిగా అభినందనలు తెలియచేస్తున్నాను...మేడం! మీ కవితలమల్లే మీ మనసు కూడా గొప్పదే!

      Delete
    4. వర్మ గారూ, అహ్మద్ గారూ, ధన్యవాదాలు.
      ఓ ఉపాద్యాయనిగా నేను ఆ బిడ్డలను మంచి మార్గములో నడపగలిగితే వారు ఇంకొందరికి ఉపయోగపడతారు.
      కానీ వ్యవస్థలో మార్పు రావాలి. చట్టాలు ఎవరికీ చుట్టాలు కాకూడదు.
      అనాదలు కనీసం రెండు పూటలా తిండి తినగలిగితే చాలు.

      Delete
  2. పసి చేతులు, పాత చిరుగులు, ఆకటి కేకలు, అంట్ల గిన్నెల చప్పుడులు, చిట్టి చేతుల చీపురు సవ్వడులు .... వెచ్చటి రగ్గు సుఖమెరిగిన నిద్రకు చికాకులు.
    దాస్యం, .... ఇనుప చట్రాలలో ఇరుక్కుని, .... సమాదుల కింద, భవిత
    కొన్ని తరాల అణిచి వేత .... కత్తి అంచున కూర్చోబెట్టిన ఎదగని మొక్క.
    వెట్టి చాకిరి, సమాదుల క్రింద భూస్తాపితం అవుతున్న భవితవ్యం, వెనకబాటుతనం వస్తువులుగా .... సమాజాన్ని ప్రభావితం చేస్తూ రాసిన ఒక మంచి కవిత
    చాలా బాగుంది.
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నిజంగానే భాల్యం సమాది అవుతుంది,
      పుస్తకాల మూటలు మోయటములో,
      ఇరుకు చీకటి తరగతి గదులలో,
      అర్ధం పర్దం లేని సిలబస్ లో,
      ఆటస్తలాలు లేక టి.వి. ల ముందు కూర్చుని క్రైం సీరియళ్ళు చూడటములో..... అబ్బో చెప్పుకుంటూ పోతే బేతాళ కథ అవుతుంది. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  3. నువ్వు కడుతున్న సమాదుల కింద,
    భవిత పునాదిని వెతుక్కుంటుంది
    (భవితే పునాదిగా వెక్కిరిస్తింది)
    ....
    మీ హృదయాన్ని ఈ ఒక్క వాక్యముతో ఆవీష్కరించారు ...... మీ మనస్సుకు నా నమస్సులు...

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారూ, అభిమానానికి ధన్యవాదాలు.

      Delete