అశృ వేదన
ఒక్క అశృవు వర్షించటానికి
గుండె చేసుకున్న గాయపు మేఘాలెన్నో..
మనస్సు రోదన వినటానికి
వేదనతో తెగిపోతున్న నరాలెన్నో,
భ్రమల బతుకు సాగించటానికి
దేహపు పొరలకింద చలనాలెన్నో..
ఘనీభవించిన కాలాన్ని కరిగించటానికి
బ్రతుకు బందీఖానాలోని ఖైదు క్షణాలెన్నో.
యెదలో మెదిలే ఊసులను దాచటానికి,
పెదవులు పలకలేని పదాలెన్నో..
కళ్ళముందే కలల నావ సాగిపోతుంటే,
దీర్ఘ వియోగాన్ని మోసే క్షణాలెన్నో...
అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో ...
కడుపున దాచుకోని కడలి వెడలగోడుతుంటే ..
తీరం వెంబడి వేసే అడుగులెన్నో...
అశ్రువులు ఇంకిపోవుటకంటే జారిపోవుటే ఉత్తమం
ReplyDeleteమనస్సు రోదన వదలటానికి దేహం చేసే సహాయం
బ్రతుకు భ్రమలు విడచిపోవడానికి తప్పని చలనం
కాలముచే ఖైదు కాబడినటువంటిదే కదా జీవితం
ఎదకు పదాల అల్లిక ఉపశమనమే, కానీ కాలేదు దర్పణం
సంగమంలోని వియోగం కలల పై వాస్తవం తీర్చుకునే ప్రతీకారం
కలత ఆవహించిన నిద్రనుంచి మేలుకొలుపు విచక్షణే వివేకం
వెడలిగొట్టుటకు తనదిగా తలచిన కడలి తీరం తెలిపే కాల చక్రం .....
చాలా బాగుందండి .... మీ ప్రవాహం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ.... అభినందనలు ..
అచ్చు తప్పులు (ఘడియ , ఎద , )
సాగర్ గారూ, కవితకు మీరు స్పందించిన విదానం బాగుంది.
Deleteధన్యవాదాలు.
ReplyDeleteమంచి భావుకతతో కవితలు వ్రాస్తుంటారు.అభినందనలు.
సర్, ధన్యవాదాలు.
Deleteఅమ్మో అవేదన
ReplyDeleteసర్, అయ్యే...విసిగిస్తున్నానా..?
Deleteఒకే.. మారుస్తాను.
ఘనీభవించిన కాలాన్ని కరిగించటానికి
ReplyDeleteబ్రతుకు బందీఖానాలోని ఖైదు క్షణాలెన్నో.
హత్తుకున్నాయి ఈ లైన్లు.
సృజనా .., చాలాకాలానికి నా బ్లాగ్ కి విచ్చేశారు.
Deleteమీ స్పందనకు నా ధన్యవాదాలు.
chala baagaa rasarandi
ReplyDeleteశ్రీదేవి గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
గుండెను తొలిచే భావాలను
ReplyDeleteకవితలోకి అనువదించడానికి
కవులు పడే తపన ఎంతో.. మీరజ్ గారూ మీ ఈ కవిత చాలా బాగుంది..
సర్, చాలాకాలానికి నా బ్లాగ్ చూస్తున్నారు,
Deleteసదా మీ స్పందననూ, సవరణనూ కోరుకుంటూ...మెరాజ్.
"ఒక్క అశృవు వర్షించటానికి గుండె .... గాయపు మేఘాలెన్నో .... మనస్సు రోదన వినటానికి .... తెగిన నరాలెన్నో .... దేహపు పొరలకింద చలనాలెన్నో .... ఊసులను దాచటానికి, పెదవులు పలకని పదాలెన్నో .... దీర్ఘ వియోగాన్ని మోసే క్షణాలెన్నో .... అన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడక, కలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో .... కడలి వెడలగోడుతుంటే, తీరం వెంబడి సాగే అడుగులెన్నో...."
ReplyDeleteఅశృ వేదన కవిత లో .... సాగర ఘోష లా, ఎందరో సున్నిత మనస్కుల జీవితాల హృదయ సంఘర్షణ ల ధ్వని వినిపిస్తుంది. గొప్ప భావుకత నిండిన వచన కవిత. హృదయపూర్వక అభినందనలు ఫాతిమా గారు!
మీ స్పందనకు ధన్యవాదాలు చంద్ర గారు.
Deleteఅప్పుడప్పుడు నవ్విస్తూ ఉండండీ...
ReplyDeleteప్రసాద్ రావ్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
Deleteనవ్వించటానికి ప్రయత్నిస్తాను,(నేను మనసారా నవ్వగలిగిన రోజు.)
మాటలకందని భావాన్ని
ReplyDeleteపదాలలో పలికించిన తీరు అద్భుతం. అనితర సాధ్యం.
సర్, ధన్యవాదాలు.
Deleteఅన్వేషిస్తున్న అడుగుజాడలు కనబడకుంటే..
ReplyDeleteకలత నిద్రలో ఉలిక్కిపడిన గడియలెన్నో ...
chaala baavundandi...:-)
మీకు మనసారా నా బ్లాగ్ కి స్వాగతం పలుకుతున్నాను.
Deleteధన్యవాదాలు.