Pages

Thursday, 31 October 2013

జారుడు మెట్లు








      జారుడు మెట్లు 

      అధిక దరలు బీదల బుగ్గలు నొక్కి ,
      వలస ఉగ్గ్గుపాలు తాగిస్తున్నాయి. 
      బరువు బతుకులపై 
      కరువు కదం తొక్కుతుంది. 

      రెక్కలొచ్చిన  పిల్లలు 

      తలో దిక్కు తరలి వెళ్ళారు.
      పట్నవాసపు మోజుబతుకులకి 
      ముసలి బంధాలు అడ్డుగా అనిపించాయి. 

      ఓ అవిటి తల్లి ఆకటి పేగు 

      రేషన్ క్యూలో నిలబెట్టింది,
      నడివయస్సు నెట్టుడికి 
      ఉడిగిన వయస్సు  ఓడిపోయి సొమ్మసిల్లింది. 

      కడుపులో ఆకలి పేగులు అరుస్తూ 

      నీరసంతో నిలవలేమని కాళ్ళు మొరాయిస్తూ,
      అచ్చు  కళేబరంలా  అనిపించినా, 
      చేతిలో కార్డ్  ఆమె బతికే ఉందని చెప్తుంది 

      అన్నదాతలా  పోజులిస్తున్న దున్నపోతుకు,

      పొలిదండాలు పెట్టాయి ముసలి చేతులు,
      కనికరించని కలియుగ కర్ణుడు 
      మన్నుతిన్న పాములా ఉండిపోయాడు. 

      మునిమాపు వేళకు ముష్టిగా  వేసిన 

      ముక్కి బియ్యం చిల్లు సంచిలోకి చేరాయి. 
      నేలతాకాల్సిన పాదాలు తేలిపోతున్నాయి. 
      చమటలు పట్టిన శరీరం అదుపు తప్పుతుంది 

      కాలచక్రం నుండి  జారుతున్న ప్రాణాలు,

      కళ్ళముందు అలుముకున్న చీకట్లు,
      ఆకలి తీర్చాల్సిన గుప్పెడు బియ్యం,
      కాకుల ఆకలి తీరుస్తూ  పిండంగా మారింది. 
                   
                       
                            *** 

     


      
      ( ఈ  ముసలి ప్రాణాలే మనల్ని కన్నవి ,
      మనల్ని  దీవిస్తున్నాయి,
      మనకు  స్వేచ్చనిస్తున్నాయి,
      మన కోసం కొస ఊపిరితో  ఎదురుచూస్తున్నాయి,  
      పల్లెనింకా  ప్రాణం తో  ఉంచుతున్నాయి. )    




14 comments:

  1. అధిక దరలు .... వలస ఉగ్గ్గుపాలు తాగి.... బరువు బతుకు....
    .... పట్నవాసపు మోజుబతుకులకి ముసలి బంధాలు అడ్డుగా ....
    ఓ అవిటి తల్లి ఆకటి పేగు రేషన్ క్యూలో .... ముష్టిగా వేసిన ముక్కి బియ్యం చిల్లు సంచిలో.... కాకుల ఆకలి తీరుస్తూ
    ( ఈ ముసలి ప్రాణాలే .... మనల్ని దీవిస్తూ, మన స్వేచ్చకోసం, మన కోసం .... కొస ఊపిరితో ఎదురుచూస్తూ, పల్లెలింకా ప్రాణం తో ఉంది. )
    పరిచయాలు అక్కర్లేని వాస్తవ స్థితిగతులకు అద్దం పడుతూ .... "జారుడు మెట్లు" కవిత ఒక దృశ్య కావ్యం లా చాలా బాగుంది.
    అభినందనలు మెరాజ్ గారు! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. సర్, కవిత ఓ దృశ్య కావ్యం లా ఉందన్న మీ ప్రశంసకు నా హృదయపూర్వక వందనాలు.
      నేను రాసిన కవితకు అద్దం మీ వాఖ్య.

      Delete
  2. అనేకానేక దృశ్యాలు కనులముందు ఆవిష్కృతం.
    నిత్య జీవితాలని మీ కవితలో చూస్తూ .. హృదయం భారమైంది మెరాజ్.

    ReplyDelete
    Replies
    1. వనజా, నిత్య సమస్యలను వాటికి పరిష్కారాలనూ సూచించే అక్షర ప్రవాహం మీ బ్లాగ్,(మీ మనస్సు)
      అందుకే మీ హృదయం బారం అవుతుంది,
      థాంక్స్ డియర్.

      Delete
  3. ఫాతిమా జీ, మీ కవితల్లో రోజు రోజు కీ పరిణత కన్పిస్తోంది..ఈ కవిత చాలా బాగుంది.సెబాస్..

    ReplyDelete
    Replies
    1. సర్, నా కవితల్లో పరిణతకు మీరూ కారణమే,
      ఎన్నో సూచనలు , సవరణలూ మీ నుండి పొందాను, ఇంకా బాగారాయగలననే నమ్మకం మీ స్పందన తెలియజేస్తుంది.

      Delete
  4. మన చుట్టూ బాగానే ఉంది.
    ఆకలి కేకలు వింబడవు.
    రేషన్ కోసం ఎదురు చూపులు చూసే వాళ్ళు కనబడరు
    ఇలా అనుకునేది నిద్రించే సమాజం.
    మీ కవిత గట్టిగా కుదిపి లేపుతుంది ఇలాంటి సమాజాన్ని.

    ReplyDelete
    Replies
    1. సర్,
      మీ ప్రేరణ , ప్రోత్సాహమే నేను ఇలారాయగలగటానికి కారణం.
      సమాజాన్ని కుదిపి లేపగలనో లేదో కానీ,నాకేమీ పట్టనట్లు మాత్రం ఉండలేను,
      నా రాతలను ఎప్పటికప్పుడు చదివి, ముందుకు నడిపించే మీకు నా ధన్యవాదాలు.

      Delete
    2. happy deepavali to all blog friends

      Delete
    3. Happy deepaavali to You and your family sir.

      Delete
  5. Fathima gaaru... manchi message icchaaru... Idi andaroo telsukovaalsina vishayam... Thanq:-):-)
    mee kavitaku naa prasamsalu thakkuve avuthaayi:-):-)

    ReplyDelete
  6. మీరు మనస్పూర్తిగా స్పందించిన తీరు నాకు స్పూర్తిదాయకమే..
    ధన్యవాదాలు నా కవితలు చదువు తున్న మీకు.

    ReplyDelete
  7. గొప్పగా ఉంది

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు డాక్టర్ గారూ.

      Delete