Pages

Wednesday, 23 October 2013

హనీకి, హానీ.





    




   హనీకి,   హానీ. 


   కళ్ళు కాయలు  కాచేలా 
   తోటంతా తిరిగాను. 

   ప్రతి  పువ్వునీ  సున్నితంగా  తాకి 
   పలకరించాను. 

   ఆదరించిన కొన్ని విరులు 
   మధువును  విందుగా ఇచ్చాయి. 

   అడ్డుకున్న గండు చీమలు 
   నా కాళ్ళ కండ  పీకాయి. 

   మత్తెక్కిన శరీరంతో  గూడుచేరి 
   మధుపాత్రలన్నీ  మధువుతో  నింపేశాను 
   అలసిన  శరీరాన్ని శయ్యపై 
   చేరవేశాను. 

   ఇంతలో... కలకలం 

   పొగలో,సెగలో...  నా ఇంటిని చుట్టుముట్టాయి. 

   ఆందోళనగా  లేచాను, అన్యాయాన్ని సహించలేక 

   ప్రకృతిచ్చిన  ఆయుధాలతో..  పోరు సాగించాను. 

   శత్రువుపై  పోరు  కాదుగానీ, 
   కాలిన నా రెక్కలు  నన్ను వెక్కిరించాయి. 

   వహ్..,వా..దోచుకోవటములో  నీదే పైచేయి. 

   మదువు తాగి విషం కక్కే  మనిషివి  నీవు. 

   తీపి తప్ప చేదు ఎరుగని  చిన్ని ప్రాణిని  నేను.




22 comments:

  1. ;-) తేనె లాగుంది ....

    ReplyDelete
    Replies
    1. సంతొషం మీ స్పందంకు.

      Delete
  2. మానవుడే స్వార్ధపరుడు :) పరుల కష్టం దోచుకునేవాడు.

    ReplyDelete
    Replies
    1. సర్, నిజమే..అది చెప్పాలనే నా ప్రయత్నం.

      Delete
  3. హనీకి, హానీ...
    చక్కగా చెప్పారు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, ఎలా ఉన్నారు చాలాకాలం తర్వాత విచ్చేశారు.

      Delete
  4. దాచిన మధువంతా దోచుకుపోయాడు!

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, చదివినందుకు సంతోషం.

      Delete
  5. అయ్యో..నిజమే కదా అనిపించింది... చదువుతూంటే...
    చిన్ని పదాలతో ఎంత బాగా చెప్పారు....

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా అనూ, పాపం ఎంత కష్టపడి సేకరిస్తాయో..

      Delete
  6. బాగుందండీ ఫాతిమాజీ...

    ReplyDelete
    Replies
    1. వర్మాజీ, షుక్రియా..:-)

      Delete
  7. తేనెటీగను. నేనొక రోమియో ను. తోటంతా ఎగిరాను. ఎన్నో అందాలు. ఎందరో పూబాలలు అందించిన మధువును భద్రంగా తెచ్చి గూడులో దాచుకున్నాను.
    అంతలో కలకలం .... పొగ, సెగ .... దౌర్జన్యంగా నా ఇంటిని చుట్టుముట్టావు .... ప్రాణాలకు తెగించాను. బలహీనురాలినే అయినా కాళ్ళు విరిగి రెక్కలు కాలే వరకూ పోరాడాను.

    కానీ ఓడిపోయాను.

    వహ్..వా! .... మానవా దోచుకోవటములోనూ నీకు నీవే సాటివని ఒప్పుకుంటున్నాను. తేనె కోసం నీవు కక్కిన విషం చేదు జ్ఞాపకంగా మట్టిలో కలిసిపోతున్న చిన్ని ప్రాణిని నేను.

    ప్రేమ భావన, నీడల్ని అందంగా అక్షరాల్లో పొదిగారు ఒక సృష్టి సంఘటనను ఉదహరిస్తూ. అభినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ, మీ మాటల్లో నా కవిత బాగుంది.

      Delete
  8. మీ కవిత చదివితే తేనె రుచి చేదు అయిపోతుంది.
    కరుణశ్రీ గారి పుష్ప విలాపం వింటే పూల మాలలు ముట్ట బుద్ధి కాదు.

    ReplyDelete
    Replies
    1. నిజమా..., పోనీలే వాటి కష్టం అవే తాగుతాయి.:-))
      సర్, ధన్యవాదాలు .

      Delete
  9. కమీ కవిత బాగుందండీ.
    ఐతే నాకర్ధం కానిది ఏంటంటే
    కళ్ళు కాయలు కాచేలా
    తోటంతా తిరిగాను. ఈ పంక్తికి అర్ధం ఏంటీ?

    ReplyDelete
    Replies
    1. తిరుపాలు గారూ నమస్తే, నా బ్లాగ్ కి స్వాగతం.

      ఇకపోతే , మరి తేనె సేకరణకి తోటంతా తిరగాలి కదండీ...:-))

      Delete
  10. హనీకి హాని మనుషులనుండే అదీ మనసు లేని వారి నుండి.

    ReplyDelete