Pages

Saturday, 5 October 2013

నాకింకోజన్మ కావాలి.









   నాకింకోజన్మ కావాలి.


   బతుకు పుస్తకం లోని అతుకు అక్షరాలను 
   కూర్చి కావ్యం రాయాలి.

   అందుకోలేని  అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చే
   పథకాన్ని వెతకాలి.

   అన్నమే ఎరుగని ఆకటి పేగులను 
   గంజినీటితోనైనా తడిపి చూడాలి.

   దుర్నీతి రచనా దుశ్శాసనులు  విప్పిన వలువలను 
   నా అక్కచెళ్ళెళ్ళ  నగ్న దేహాలపై  కప్పాలి.

   ఆశల  అలలపై  నడిచే తమ్ముళ్లను వోటు(ఓటు)పడవ దించి    
   వేకువ దారిలో నడపాలి. 

   ముందు తరపు   ముదిమి అడుగుల తడబాటుకు
   ఊత కర్రనై ఊరటనివ్వాలి.

   నిషిద్ద్ద, నిర్హేతుక చర్యల నెదుర్కొని ఫినిక్స్  పక్షినై 
   ముసురుకున్న నివురునుండి  ఎగరాలి.



 




12 comments:

  1. మీ ఆశయాలతో, భలే సందేహం లో పెట్టారు,
    దేవుడు కనుక, మీకు మరో జన్మ ఇవ్వక పొతే ,
    మేమంతా , సమ్మె చేయడమే ప్రత్యామ్నాయం !

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా నాలాంటివారికి ఆశయసాదనకు ఒక్క జన్మ సరిపోదు.
      పది జన్మలకు సరిపడా సంపాదించిన వారికి ఆశయాలు ఉండవు.

      Delete
  2. భగవంతుడు మీ మొర తప్పక విని మరో జన్మ కూడా ఇస్తాడని నా నమ్మకం.

    ReplyDelete
    Replies
    1. మాస్టారూ, అక్షరాలు అన్నం పెట్టవు కానీ నా మానసిక సంఘర్షణ అలా రాయిస్తుంది.
      కానీ ఉడతాబత్తీ నేనూ ఎదోచేస్తున్నాలెండి,
      దానికోసం మరోజన్మ అడగటం అత్యాశ కదా.
      చూశారా సుధాకర్ గారు,మీరూ , రెకమండ్ చేస్తున్నారు దేవునితో...:-)

      Delete
  3. నాకింకోజన్మ కావాలి.
    బతుకు కావ్యం రాయాలి. అంతిమ లక్ష్యాన్ని వెతకాలి.
    ఒకవైపు అన్నమే ఎరుగని ఆకటి పేగుల అన్నార్థులు.
    ఒకవైపు దుర్నీతి రచనా దుశ్శాశనులు విప్పిన వలువలను నా అక్కచెళ్ళెళ్ళ నగ్న దేహాలు.
    ఒకవైపు ఆశల అలలపై నడిచే తమ్ముళ్ళు.
    ఇంకోవైపు ముందు తరపు ముదిమి అడుగుల తడబాటులు.
    మార్పును ఆశించే మనిషికి తప్పదు మనో సంఘర్షణ .... అన్ని లక్ష్యాలు గొప్పవే
    అభినందనలు ఫాతిమా గారు

    ReplyDelete
    Replies
    1. సర్, నా ఆశయ పూదోటలో విరిసిన పూబాలల (బాలికల) బాద్యత నేను మోయలేను అనుకున్న రోజు నాకు మిగిలేజీవితం శూన్యమే. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  4. Chala baga chepparu madam...Meeku ma krithagnathalu...

    ReplyDelete
  5. కవిత బాగుంది మాడం

    ReplyDelete