ఏమనీ..వ్రాయను
ఎన్నొరాత్రులు నిదురపోక
నక్షత్రాలను ఏరికూరి అక్షరాలగా మార్చాను.
అలవిగాని తలపుల జలపాతాన్నై
నేలపైకి జారి వలపుల కవితనైనాను.
కలల రేడుని కన్నంతనే కలవరపడి,
అలల కవనం లో ఆటు,పోటునై ఎగసిపడ్డాను.
ప్రతి పంక్తిలోనూ పూల పరాగమద్ది,
ప్రకృతంటే ఆతనే అని చాటిచెప్పాను.
అమావాస్య వస్తే, అదృశ్యం అవుతాడనీ,
ఆమని వస్తే, పూల వెంట పరుగెడుతాడనీ,
కలవరపడే మనస్సుకు నచ్చచెప్పాను.
వెన్నెల దారాలను పట్టుకొని చంద్రుని చేరాలనీ,
కలల కడలిలో వలపు నావ ఎక్కాలనీ,
మతిచెడి నా స్థానం మరచాను.
నువ్వనుకున్నట్లు నేను దివిటీని కాననీ,,
నువ్వు సూటిగా చూడలేని సూర్యుణ్ణనీ...
వెక్కిరించి పక్కున నవ్వావు.
సాగరమంత నా ప్రేమని నీటిచుక్క అనుకున్నావ్ ,
అమృతమైన నా ప్రేమ హాలాహాలం అనుకున్నావ్ ,
నీ మెప్పుకై ఎడారిదాహార్తినై ఎదురుచూశాను. .
చెట్టే కొమ్మని విరిచేస్తే, గూడె గువ్వని తోలేస్తే,
ఆరాదించే దైవమే కోవెలమెట్లెక్కొదంటే..,
తూట్లు పడ్డ గుండెకు కుట్లు వేసుకోవటమే శరణ్యం...
నక్షత్రాల అక్షరాలవి. అలవిగాని తలపుల జలపాతాలవి. నేలపైకి జారిన వలపు కవితలవి. అంతలోనే కలవరపడి, అంతలోనే ఆటు, పోటై ఎగసిపడే ప్రకృతి పరామర్శలవి .... చెట్టు విరిచిన కొమ్మ, గూడు తోలేసిన గువ్వ, కోవెలమెట్లెక్కొద్దన్న దైవం.., తూట్లు పడ్డ గుండె .... అక్షరాలు పద శరాలుగా మార్చడం కవయిత్రి కే చెల్లు.
ReplyDeleteకవిత లో కొంత అభద్రతా భావన, కొంత వేదాంత దోరణి వెరసి భావుకత్వ పరాకాష్ట కు అద్దం పట్టినట్లుంది.
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!
'బాట సారి' వై అన్వేషిస్తున్నావు !
ReplyDelete'ద్రోహీ' అని తిడుతున్నావు !
'అశ్రు వేదన' పడుతున్నా ,
'తెగిపోని నమ్మకం' తో
'జీవన పయనం' సాగిస్తున్నావు !
'నాకింకో జన్మ కావాలి' అని
'మన కర్తవ్యం' గుర్తు చేస్తున్నావు !
'నీ వాళ్ళను' చేరదీయ మంటున్నావు !
'అనుబంధాలు' ఎండుటాకు లంటున్నావు !
ఇపుడేమో ,' ఏమని రాయను ' అంటున్నావు !
ఇక ' ఎలా' ఉంటాయో ముందు ముందు,
నీ ' అక్షర రూపాలు ' ?
మనసులోని కలవరాన్నిలా మా ముందు ఉంచారు...
ReplyDeleteHeart touching lines....
ఏమని రాయను.
ReplyDeleteఏమి స్పందన ఇవ్వాలో తెలియడం లేదు.
కవిత బాగుంది.
నిగూఢమైన భావం మనసుని మెలిపెడుతున్నట్లుంది.
నా అక్షర రూపాలను ఆదరించిన ఆత్మీయులకు నా వందనాలు.
ReplyDelete