Pages

Monday, 7 October 2013

అనుబంధాలు

   
   

   అనుబంధాలు 

   ఒంటరితనం  మనిషిని శాసిస్తుంది.
   ఆత్మీయం అందనంత 
   దూరం వెళ్తుంది.

   జీవిత పాఠం "అనుభవాన్ని" 
   శీర్షిక చేసుకొని  
   చర్చిస్తుంది. 

   ఆస్తుల తగాదాల్లో,
   అస్తికలను విసిరేసిన రక్త సంబంధాలు  
   రంగుమార్చుకుంటున్నాయి.

   పెరిగిన దూరాల మద్య,
   అనుమానాల  అంపకాలు
   అన్నదమ్ములనే అంధులను చేస్తున్నాయి.

   కన్నపేగుల కలహాల మద్య,
   పండుటాకులు ఎండుటాకులై,
   ఎటుగాలివీస్తే అటు ఎగిరిపోతున్నాయి.

   జీవన మరణాల మద్య,
   కూడబెట్టిన  కన్నీళ్ళు 
   తలాకొంచం తాగుతున్నారు.

12 comments:

  1. ఒంటరితనమే ఒక జీవనానుభవాల సంఘర్షణ, ఆత్మీయతల్ని కోల్పోవాల్సిన ఒక శాసనం.
    ఆస్తుల తగాదాలు, అస్తికలను విసిరేసుకున్న రక్త సంబంధాలు. అంధత్వం .... అనుమానం నీడలో అన్నదమ్ములు.
    కన్నపేగుల కలహాల మద్య కూడబెట్టిన కన్నీళ్ళు కాస్తా మట్టిపాలౌతూ నిస్సహాయంగా చూస్తున్న కన్నవారు.
    అనుబంధాల్ని ఆత్మీయతల్ని పెట్టుబడిగా వ్యాపారాలు చేసే సమాజం లో ఉన్నామని గుర్తు చేస్తూ, వాస్తవికతని కళ్ళముందుంచారు కవయిత్రి.
    అభీనందనలు ఫాతిమా గారు.

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారూ, నా కవితకన్నా మీ వివరణ బాగుంది. నేను గుర్తించిన వాస్తవికతకు మీ విష్లేషణ బాగుంది.

      Delete
  2. నీలి నింగి కరిగి వర్షం కురిసింది వారాల వర్షం అని ఉప్పొంగిపొతారు
    తమ ఇంటిలో వెలుగు దీపం వెలిగిందని ఉబ్బి తబ్బిబవుతారు
    ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని హితము పలికి మన జీవితం లో మార్గ నిర్దేశ్ చేసే మార్గదర్శకులు

    అన్ని తెలిసి కూడా మనకోసం పాట్లు పడుతుంటారు
    కష్టమైన ఓర్పుతో సంసారమనే సాగరం ఈదుతారు
    తీరా రెక్కలు తొడిగిన పక్షి వాలే అంతులేని ఆకాశం వైపు పరుగిడుతారు

    ఆశలు ఆశయాలంటూ ఏవో చెప్పి పుడిమి పైకి తెచ్చి పెంచి పెద్ద చేసినవాళ్ళనే ఎందుకు మరిచిపోతారో వృద్దశ్రములో ఆకలి కేకలు జ్ఞాపకాల వీచికల నడుమ భావి జీవితాన్ని గడుపుతారు.

    ఒక్కో కన్నీటి బొట్టు తాము పెంచి పెద్ద చేసిన బిద్దలనే తలుచుకుంటాయె తప్ప ఏ కంటి నుండి జాలదారాల రాలుతున్నవని కాదు.

    ప్రేమించే గుణం అలవరచుకో .. ప్రేయసినే కాదు తలిదండ్రులను కూడా..
    వాళ్ళే గనుక లేకపోతే నువ్వు లేవు నీ అస్తిత్వము లేదు నీ ప్రేయసి లేదు నీ ఉనికే లేదు.

    ఫాతిమా గారికి, ఏదో మీ కవితను చదివినప్పుడు కలిగిన భావాలను అక్షరరూపం ఇస్తే ఇలా బయటకు వచ్చింది. ఇందులో ఎవ్వరిని దూసించాను లేదని మనవి చేసుకుంటున్నాను. ఇప్పటి కాలానుగుణంగా చక్కగా వ్రాసారు .
    శ్రీధర్ భుక్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధర్ గారూ, కవితకు మీరిచ్చిన అక్షరరూపం అద్భుతం. ముఖ్యంగా ప్రేమించాల్సింది ప్రేయసినే కాదు తల్లితండ్రులని అని చెప్పిన మీ మాట అక్షర ముత్యపు మూట.

      Delete
  3. 'కన్నపేగుల కలహాల మద్య,
    పండుటాకులు ఎండుటాకులై,
    ఎటుగాలివీస్తే అటు ఎగిరిపోతున్నాయి'
    చక్కగా రాశారు ఫాతిమా !

    ReplyDelete
    Replies
    1. సుధాకర్జీ..ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  4. Meeru manushula baadhanu kavithva roopamlo cheptunte...badallo saturate ayipoyina..maaku aa kavithvam anandaanni isthundi. ee katitha bagundi..

    ReplyDelete
    Replies
    1. దిలీప్ గారూ, ధన్యవాదాలు మీ అభిమానానికి.

      Delete
  5. ఆస్తుల తగాదాల్లో,
    అస్తికలను విసిరేసిన రక్త సంబంధాలు
    రంగుమార్చుకుంటున్నాయి.

    True

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  6. 'జీవన మరణాల మద్య,
    కూడబెట్టిన కన్నీళ్ళు
    తలాకొంచం తాగుతున్నారు.'
    తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు...

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete