మన కర్తవ్యం
పట్టుపావడాతో బుడ,బుడా తిరగాల్సిన
చిట్టిపాదాలు, అరిష్టమనే అంక్షలతో..
అమ్మకడుపులోనే అర్దాంతరంగా...,
కడతేరుతున్నాయి.
తండ్రి భుజమెక్కి
ఊరేగాల్సిన ముద్దుల తనయ,
వేటగాని వేటుకు నెత్తురుముద్దగా,
నేలకొరుగుతుంది,
కలలు కనే వయస్సులో..,
పసుపు రాసుకొవాల్సిన పాదాలు,
కష్టాల కడియాలతో...,
నడయాడుతున్నాయి.
మనతోడబుట్టిన పాపానికి,
మన పరువు నిలిపేందుకు,
రాక్షస క్రీడలో నలిగిన పావురాళ్ళై ,
కదిలే శవాల్లా కాలం ఈడుస్తున్నారు.
మన ఉదాత్తం చాటుకొవటానికి,
నిజాలగొంతు నులిమే ఇజాలతో,
వారిని మాలిమి చేసుకొని,
జాతిని పెంచే మరలను చేస్తున్నాం.
ఇప్పుడు మనం ఓదార్చాల్సింది ,
కసిగాయని రాల్చుకున్న బాలింతరాళ్ళని కాదు,
కన్నకడుపు తీపినెరిగి ,
వారిని కాపాడగలగటమే.
ఇప్పుడు మనం చేయాల్సింది,
మహత్తర మతాల అడుసుతొక్కటం కాదు,
మనకు జన్మనిచ్చిన జాతి,
కాళ్ళు కడగటమే.
'ఇప్పుడు మనం చేయాల్సింది,
ReplyDeleteమహత్తర మతాల అడుసుతొక్కటం కాదు,
మనకు జన్మనిచ్చిన జాతి,
కాళ్ళు కడగటమే'
కవిత ద్వారా కర్తవ్యం చక్కగా తెలిపారు !
సుధాకర్ గారూ,నిజమే కదా,
Deleteమనం చేయాల్సింది ఊకదంపుడు ఉపన్యాసాలు వినటం
మహిళాదినోత్సవాలు చేయటం కాదుకదా.
పట్టుపావడాతో బుడ,బుడా తిరగాల్సిన చిట్టిపాదాలు, అరిష్టం కాదు.
ReplyDeleteతోడబుట్టడం నేరం కాదు! పాపం అంతకన్నా కాదు! పరువు నిలిపేందుకు, రాక్షస క్రీడలో నలిగే పావురాళ్ళు, కదిలే శవాలు గా స్త్రీని మిగల్చడమే దారుణం, నేరం, పాపం!
స్వార్ధ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి, నిజాల గొంతు నులిమే ఇజాలతో, స్త్రీని మాలిమి చేసుకొని, జాతిని పెంచే మరలుగా మార్చడమే నిజమైన అకృత్యం, నేరం!
ఇప్పుడు, మనిషిగా మన కర్తవ్యం మహత్తర మతాల అడుసుతొక్కటం కాదు, జన్మనిచ్చిన జాతి, కాళ్ళు కడగటమే.
ఒకవైపు న్యాయాన్యాయాలను సంభోదిస్తూ, మరో వైపు మనస్సులో చెలరేగిన ఎన్నో సమాధానాలు వెదుక్కోవల్సిన ప్రశ్నల శరాలు సంధించడం తో పాటు కర్తవ్యాన్ని తెలియపరుస్తూ ఆవిష్కరించిన ఒక గొప్ప కవిత "మన కర్తవ్యం!"
అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు. సుప్రభాతం!
సర్, సమాజములో నేనూ భాగస్వామినే...
Deleteఅందుకే ముందుగా ఇక్కడ జరిగే తప్పులకు నేను భాద్యత వహిస్తాను.
అక్షరాలతో కాదు ఆచరణతో మార్పు తేగలగాలి ఆరోజు నేను స్త్రీగా విజయాన్ని సాదించాను అనుకుంటాను. ధన్యవాదాలు మీ స్పందనకు.
ఇది తెలుసుకోలేక అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు. తెలిసినా ఆత్మద్రోహం చేసుకుంటున్నారు, ఎందుకు? సొమ్ముకోసం.
ReplyDeleteమీరన్నట్లు తెలియక కాదు,
Deleteస్వార్దం రాజ్యమేలుతుంది.
అనాదిగా స్వార్దానికి బలయ్యేది ఆడదే,(ఏదో ఒక రూపమ్లో )
మీ స్పందకు ధన్యవాదాలు.
well said madam
ReplyDeleteయోహాంత్ గారూ, ధన్యవాదాలు.
Deleteఇంకా ఈ అమానుష చర్యలు జరుగుతూ నే ఉన్నాయా....ఎప్పటికి దీనికి అంతం.
ReplyDeleteనిజాల గొంతు నులిమే ఇజాలతో....నిజం.
అనూ, స్త్రీజాతి ఉన్నంతవరకూ జరుగుతూనే ఉంటాయి.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.