ద్రోహీ..
నీ చేతిలో చచ్చాకే తెలిసింది
బ్రతుకెంత విలువైనదో..
ఎంత కమ్మని కంఠం నీది,
నీ వెనుకే ఉరకాలనేలా చేస్తుంది.
ఎంత నమ్మిక తెచ్చే మచ్చిక నీది,
నీతోనే ఉండాలనిపిస్తుంది.
మచ్చికైన నెచ్చెలిని వెన్ను నిమిరి,
గొంతుకొరికే సైతానువి.
కసాయితో చేతులు కలిపి,
చెలిమిపై చురకత్తి దూసే నేర్పరివి.
తేనెల మాటలతో మాయచేసి,
మరణద్వారం వైపు లాక్కెళ్ళే మృగానివి.
నేరం చేయని వారిని సైతం ఘోరంగా,
శిక్షించాలని తపనపడే తలారివి.
కాటి కాపరినే ఏమార్చి కంపుకొట్టే శవాలను,
కడుపునిండా తినే జుగుప్సా జ్ఞాపకానివి.
నమ్మక ద్రోహానివి నమ్మిన వారిని ,
నడిరోడ్డుకు ఈడ్చే జిత్తులమారివి.
నోటి తో కాక , కలం తో తిట్టడం అంటే ఇదేనేమో ! మనసు లో ఇంత కలకలం రేపిన ఆ 'ద్రోహి' ఎవరు ?
ReplyDeleteసుధాకర్ గారూ, ఇలాంటి ద్రోహులు అడుగడుగునా ఉన్నారు అమాయకంగా నమ్మేవారున్నంతకాలమూ.
Deleteచూశారా కలానికి ఎంత కసి ఉందో...:-)
iMtakI evaru? very good
ReplyDeleteసర్, మీకెక్కడా తారసపడలేదా ...:-).
Deleteఎంతో కమ్మని కంఠం, అవి తేనె పూసిన చురకత్తి పలుకులు, అది కసాయి చేతుల తలారి తపన .... అతను జిత్తులమారి. నమ్మించి వంచించే నమ్మకద్రోహి.
ReplyDeleteనిజం! అలాంటి వారికి దొరికి, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నప్పుడు అనిపిస్తుంది బ్రతుకెంత విలువైనదో .... అని,
భావనల్లో కసి పదాల్లో కటినత్వము కనిపిస్తుంది. సుప్రభాతం మెరాజ్ ఫాతిమా గారు!
నిజమే.. విలువైన జీవితం లో ..విలుకానిలా తారసపడే సంఘటనలు ఎన్నో,
Deleteనమ్మే మంచి హృదయాలున్నంత కాలమూ సాగుతుంటాయి ఇలాంటి ద్రోహాలు.
కవితల నిండా నిప్పుల
ReplyDeleteనివురుల సెగ దగిలి పూలు నెనరులు దప్పెన్
కవితా సుమ హారములో
నవ సౌరుభ మెపుడు చిందు నని వీక్షింతున్
రాజారావ్ గారూ, బహుకాలదర్శనం.
Deleteనిజమే సుమహారములో నిప్పురవ్వలతో పూల సుగంధం పోయింది.
ఆహ్లాదముగా రాయటానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు మీ స్పందనకు.
మీ కవిత సంగతి అలా ఉంచితే,
ReplyDeleteఆ బొమ్మలు చూస్తే భయపడి చచ్చాను.
నిజంగానే రక్కసి మూకల ద్రోహి
రజనీకరుడు లేని అమవస నిసిలో మీకు తారసపడిందా, లేక మీ ప్రియ కల్పనా?
సర్, రక్కసి మూకలు కేవలం రక్తమే తాగుతాయి
Deleteఈ తేనెపూసిన కత్తులు గొంతుకోసుకొని ఎత్తుకెళ్తాయి.
నిసిలో కాదు తాపసినైన నన్ను తన్నుకెళ్ళింది.
ఇకపొతే అప్పుడప్పుడూ నేను అప్రియంగా అల్లుకొనే కల్పనా కావ్యాలివి.