Pages

Saturday, 26 October 2013

అన్వేషి

   


   అన్వేషి 

   రాతిలో ప్రాణాన్ని  వెతికినట్లు 

   నిరక్షరినైన  నాలో  అక్షరాన్ని  అన్వేషిస్తాడు. 

   విషాదాశ్రువునై  జారుతుంటానా...,

   ఓదార్పై  వెన్నుతడతాడు. 

   అన్నీ మరచి సంగడీలతో సరదాగా ఉంటే,

   కన్నెర్రజేసి కర్తవ్యం  బోధిస్తాడు. 

   నా  కలంపాళీ  దు:ఖాన్ని  కక్కుతుంటే..,

   దొసిలొడ్డిన తెల్లకాగితమే అవుతాడు. 

   అక్షర  కడలిలో   మునుగుతుంటే,
   కాగితం పడవై నన్ను తీరం చేరుస్తాడు.

  కమ్మని పాలధారనై  సాగిపోతుంటే,

  సుధామధురమై  అడుగు కలుపుతాడు. 

  తన భావాలతో విభేదించానా,

  అక్షర దోషాన్ని  అంటగడతాడు. 

  ఇంతకీ అతగాడెవరో తెలుసా?

  ఇంకెవరూ.. 
  నాలో అక్షరాగాయాన్ని రేపిన  అభినవ శ్రీనాదుడు. 

  అంతులేని  ఆటుపోట్ల  భావ ప్రకంపనలకు 

  వైద్యం  చేసిన   అక్షరవైద్యుడు  

  ఉజ్వల  ఉషస్సుకై  కాలాన్ని కదపమని 
  ఉసిగొల్పిన  ఉదయుడూ , నా ఉపాద్యాయుడూ .. 



  

24 comments:

  1. Replies
    1. సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  2. ఒక ఓదార్పు, ఒక కర్తవ్య బోధన చేస్తూ .... అక్షరాగాయాన్ని రేపిన అభినవ శ్రీనాదుడు ఆ అన్వేషి. అంతులేని ఆటుపోట్ల భావ ప్రకంపనలకు వైద్యం చేసిన అక్షరవైద్యుడు .... ఆ అన్వేషి.
    అక్షర శస్త్రాల తో ఉజ్వల ఉషస్సు కోసం భావయజ్ఞం చేస్తున్న (తపస్వి) భావావేశం వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ....
    అభినందనలు ఫాతిమా గారు. శుభసుప్రభాతం!

    ReplyDelete
  3. సర్, నా అక్షరం వెనుక మీ వంటి ఉన్నతమైన వారి ప్రేరణ ఉందని గర్వంగా చెప్పుకుంటాను.

    ReplyDelete
  4. చాల రోజుల తర్వాత, నీ కవిత చూసి ఆనందంగా వుంది. కొనసాగిస్తూవుండు!

    ReplyDelete
    Replies
    1. రాం సర్, ఎలాఉన్నారు?
      స్వాగతం నా బ్లాగ్ కి.

      Delete
    2. I am fine!
      whether your book released anywhere?

      Delete
  5. చాలా బావుంది...ఏమనుకోవద్దు...సంగడీలంటే అర్థం చెప్పగలరా...

    ReplyDelete
    Replies
    1. అనూ, సంగడీలు అంటే స్నేహితులు.

      Delete
  6. నాలో అక్షరాగాయాన్ని రేపిన అభినవ శ్రీనాదుడు;
    అంతులేని ఆటుపోట్ల భావ ప్రకంపనలకు
    వైద్యం చేసిన అక్షరవైద్యుడు..
    ఉజ్వల ఉషస్సుకై కాలాన్ని కదపమని
    ఉసిగొల్పిన ఉదయుడూ , నా ఉపాద్యాయుడూ ...

    చాలా బాగుంది. చాలా చక్కగా వ్రాసారు. అభినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ,
      సమయం వెచ్చించి చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  7. త్రికరణ శుద్ధి గా, కవితా నైవేద్యం చేస్తున్న కధానాయిక మొల్ల !
    మీ కవిత కు, అక్షర వైద్యం అవసరమవడం కల్ల !
    ఈ విశ్వమే, మీ భావావేశాలకు ఎల్ల !
    ప్రేరణ మీకు, ప్రతి అణగారిన జీవితమల్లా !
    ఇక ,' ఏక లవ్యునికి ' గురువులు ఏల ?

    ReplyDelete
    Replies
    1. వీక్షింతురు కదా నా కవితాసుమాన్ని భీష్మ పితామహులెల్లా.
      అనుకోరా ,"హనుమానుల వారి ముందు ఈ కుప్పిగంతులేలా".
      ధన్వంతరి వారసులచే.. అక్షర పథ్యం పెట్టించుకొనుట ఏల.
      మరోమారు తప్పులుంటే మన్నింతురుకదా నా గురువులెల్లా....:-))

      Delete
  8. నా కలంపాళీ దు:ఖాన్ని కక్కుతుంటే..,
    దొసిలొడ్డిన తెల్లకాగితమే అవుతాడు.

    అక్షర కడలిలో మునుగుతుంటే,
    కాగితం పడవై నన్ను తీరం చేరుస్తాడు.

    భలేరాసారు బాగుంది

    ReplyDelete
    Replies
    1. పద్మా, మీకునచ్చి మెచ్చినందుకు నా ధన్యవాదాలు.

      Delete
  9. మీ కవితలు చదివే వారు, భీష్మ పితా మహులు గానూ ,
    హనుమానుల వారి గానూ ,
    మీకు కనిపించు చున్నారా ?
    అయిన చో, పొరపాటు పడుతుంటివి తరుణీ !
    మేమెల్లరమూ , మీ కవితా
    నిపుణత నాస్వాదించు వారమే !
    మన్నించుటకు, మీ గురువులం కామే !

    ReplyDelete
    Replies
    1. ఏకలవ్యునికి గురువునని ఒప్పుకొనలేదెవ్వరూ...ఒప్పుకొనినిననాడు ఏమాయనో ఎరుగుదురు అందరూ..:-))
      సర్, ఏదో ఒక సమయాన నా అక్షరాన్ని సరిద్దిద్దిన వారందరూ గురువులే అనుకుంటాను.
      ఇకపొతే విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితను ఆస్వాదించే మీకు నా ధన్యవాదాలు.

      Delete
  10. మీకూ మీ అక్షరవైద్యునికీ అభినందనలు మెరాజ్ జీ...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వాసుదేవ్ గారు.

      Delete
  11. గురుర్‌బ్రహ్మ, గురుర్‌విష్ణు, గురుర్దేవో మహేశ్వర
    మీ గురుభక్తి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిల్పుతుంది.
    మే గాడ్ బ్లెస్ యు.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ దీవెన నిజం కావాలని కొరుకుంటున్నాను.

      Delete
  12. చాలా బాగుంది fathima గారు..-:)

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండీ,

      Delete