తెగిపోని నమ్మకం
తీరం చేరాలనే అశతో దొరికిన చిల్లు పడవలోనే ,
అనుభవాల అలలను తడుముతూ,
ఆశల శిఖరాలను వెతుక్కుంటా.
అప్పుడప్పుడూ పలకరింపుల పల్లకినెక్కుతూ... ,
మానసిక వేదనను మరచిపోతూ,
విధిని నమ్మిన వేదాంతిలా వేదనను ఉమ్మేస్తా..
అంతరపు కొంగుకు కట్టుకున్న నమ్మకమవుతూ,
అపభ్రంశపు చీకట్లను ఆశా దీపంతో తోలేస్తూ,
జనం గుండెల్లో నిలుపుకున్న దివ్వెనవుతా.
అట్టడుగు వర్గాలకు అన్నం ముద్దనవుతూ ...,
సగటు జీవితాలను సరిదిద్దాలని చూస్తూ..,
నెత్తుటి పేజీలో విత్తిన అక్షర అంకురాన్నవుతా ....
పరిపూర్ణతను ఆశించిన అనురాగంతో..,
ముసి,ముసి నవ్వుల మౌనినై ముందుకు సాగుతూ,
"తీరం చేరాలనే అశల చిల్లు పడవలో, అప్పుడప్పుడూ పలకరింపుల పల్లకినెక్కి, విధిని నమ్మిన వేదాంతినిలా వేదనను ఉమ్మేస్తా!
ReplyDeleteకొంగుకు కట్టుకున్న నమ్మకపు అపభ్రంశ చీకట్లను ఆశా దీపంతో తోలేస్తూ, అట్టడుగు వర్గాలకు అన్నం ముద్దనై, నెత్తుటి పేజీలో విత్తిన అక్షర అంకురాన్నవుతా!
ఆశించిన పరిపూర్ణత కోసం ముసి ముసి నవ్వుల మౌనినై, ముందుకు సాగి అమరత్వాన్ని పొందుతా!"
మనిషికి తనపై తనకు తెగని నమ్మకం, సామాజిక న్యాయం కోసం ఆరాటపడటం, పరిపూర్ణత కోసం జీవన పోరాటం అవసరం ను తెలియపరుస్తూ .... కవిత ఒక గొప్ప సందేశాత్మక భావనై మన ముందుంది.
అభినందనలు కవయిత్రి మెరాజ్ ఫాతిమా గారికి.
చంద్ర గారూ.నా సందేశాత్మక భావాన్ని అర్దం చేసుకున్న మీకు నా ధన్యవాదాలు.
Deletekavitha bagundi medam
ReplyDeleteAhmadji shukriyaa.
Deleteశిఖరాలు కి బదులుగా తీరాలు అన్న వాక్యం సరి అనిపించింది
ReplyDelete" అద్వితీయమైన అమరత్వాన్ని పొందుతా.. " --
"అట్టడుగు వర్గాలకు అన్నం ముద్దనవుతూ ...,
సగటు జీవితాలను సరిదిద్దాలని చూస్తూ..,
నెత్తుటి పేజీలో విత్తిన అక్షర అంకురాన్నవుతా .... "
ఈ వాక్యములోని కూర్పు చాలా చాలా బాగుంది .... కాకపోతే మిగతా కవిత మొత్తము స్వగతమై ఈ పై వాక్యములు బహు జన భరితమైనాయి.. (సామాజిక స్పృహ కోసమనుకుంటా)
కాకపోతే కవిత మొదలుకి చివరకి సమన్వయములో కొంచెం హెచ్చు తగ్గులు ఎక్కువయిందా ? అన్న సంశయం కలిగింది ....
"విధిని నమ్మిన వేదాంతిలా వేదనను ఉమ్మేస్తా.." -- మంచి ఫీల్ ఉన్న వాక్యము ...
క్షమించాలి కొంచం చనువు తీసుకొని ఎక్కువ వ్యాఖ్యానించాను....
మొత్తం మీద మంచి ఆశావాహం కలిగినటువంటి కవితగా అనిపించింది ......
మీ విష్లేషణ నచ్చుతుంది నాకు.
ReplyDeleteకవితను చదువుతూ.... అప్పటి కవి హృదయాన్ని అంచనా వేయటం ఓ గొప్ప విద్య, అది మీలో ఉంది.
"మానసిక వేదనను మరచిపోతూ...విధిని నమ్మిన వేదాంతినవుతా" ఈ వాఖ్యం లో కవి హృదయం అస్థవ్యస్తం గా ఉన్న భావన తెలిసిపోతుంది.
నా కవితను తిరిగి చదివినప్పుడు ఎన్నో లోపాలూ, సందేహాలూ కలుగుతాయి నాకు.
సాగర్ గారూ, స్పందనకు ధన్యవాదాలు
" నెత్తుటి పేజీలో విత్తిన అక్షర అంకురాన్నవుతా ....
ReplyDeleteపరిపూర్ణతను ఆశించిన అనురాగంతో..,
ముసి,ముసి నవ్వుల మౌనినై ముందుకు సాగుతూ,
అద్వితీయమైన అమరత్వాన్ని పొందుతా.. "
చాలా బాగా రాసారు.
సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteఆశా జనకం గానూ , స్ఫూర్తి దాయకం గానూ ఉంది కవిత !
ReplyDeleteసర్, మీ స్పందనకు ధన్యవాదాలు,
Deleteఇంకా బాగా రాయటానికి ప్రయత్నిస్తాను.