Pages

Wednesday, 24 December 2014నా  నగరం

నాకు  అందకుండా పెద్దద,పెద్ద
అంగలేసుకుంటూ  వెళ్తుంది నా నగరం .

ఎత్తైన  మేడలు ఎక్కుతూ ..,
కత్తి  మీద సాముచేస్తూ   కవ్విస్తుంది ,

రాత్రయితే   జిగేల్మనే  రాకెట్టులా..,
పబ్బుల్లో పైటజార్చి,  క్లబ్బుల్లో పేకజారుస్తుంది.

అర్దరాత్రి  దండాలకు అడ్డాగా  మారి ,
అక్రమాల శవాన్ని  భుజానమోసే విక్రమార్కుడవుతుంది.

కన్నబిడ్డలకు అన్నప్రాస  చేయటానికి ,
అన్నదాతను  అనాదను   చేస్తుంది .

అమ్మ,అయ్యా లేని  అనాథ నా నగరం ,
అన్నీ ఉన్నా  ఏమీ లేని   అభాగ్య నగరం.

తలారి పాలకులకు తల తాకట్టు పెట్టి,
ఏలుకొనే నాదునికి    తాళి   లేని   పెళ్ళాం   నా నగరం .