Pages

Friday 17 January 2014

మూగబోయిన పల్లె

   






    మూగబోయిన  పల్లె

     నిద్రబోయిన   నా పల్లె
     నిశ్సబ్దంగా ఉంది,

     పక్షులన్నీ  గింజలు లేక,

     చెట్టు కొమ్మకే అంటుకు పొయాయి.

     డొక్కలెండిన కుక్కలు

     మురికి నీళ్ళతో  కడుపు నింపుకున్నాయి.

     దారంతా గోతులు,

     మట్టి ఎగుమతి  అవుతున్న ఆనవాళ్ళూ,

     నరికిన చెట్లూ,

     పూలమ్మిన చోటే కట్టెలమ్మిన దౌర్భాగ్యాలూ,

     బోసిపోయిన వాకిళ్ళూ ,

     గుమ్మం లో ముసలీ,ముతకా కాపలాలూ,

     నులకతాళ్ళు  తింటున్న తువ్వాయిలూ,

     కళ్ళలో ప్రాణాలెట్టుకున్న బసవయ్యలూ, 

     బిలంలోకి   జారిపోయిన పల్లె తాళాలూ,

     వెతికి పట్టుకున్న నగరవాసులు , 

     పల్లెతల్లిని నిద్దురలేపి,
     పాతకబుర్లన్నీ  పలికించుకొనీ,
     అమ్మ కమ్మదనమంతా ఒలికించుకొనీ... ఆడీ,పాడీ,

     హటాత్తుగా అమ్మనలా వదిలేసి ,
     పట్టుకొమ్మని  దిగి,బతుకు బాటన పడతారు,
     మళ్ళా మకర సంక్రాంతికి  పలకరిస్తారు.

     {పల్లెలు దేశానికి  పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ... 
     అవినేడు  ఎండుకొమ్మలవుతున్నాయి.
     ఆ కొమ్మలను చిగురించేలా.. రైతుకు  చేయూతనిద్దాం }  





17 comments:

  1. కేవలం పండగకి మాత్రమే పల్లెటూరికి వెళ్ళి రెండురోజులుండి పెద్దలను పలుకరించి , పెదవి విరచి , ఊరి బాగోగులను మళ్ళీ వచ్చినప్పుడు చర్చిద్దాం ...ఇప్పుడు ఇంతకన్నా శెలవలు లేవు ....ఈసారి చూద్దామంటూ పోయే వాళ్ళే కానీ పట్టించుకునే వాళ్ళు కరువయిపోయారు మెరజ్ . మీ కవిత పల్లె దయనీయ స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించింది .

    ReplyDelete
    Replies
    1. పల్లెలు మరీ దయనీయ స్థితిలో ఉన్నాయి.
      మద్యతరగతికి కింది స్థాయిలో ఉన్న వారి స్థితి మరీ దిగజారిపొతుంది.

      Delete
  2. పల్లె చిగురించాలనే ఆశ ప్రగాఢంగా ఉంది, కాని ఈ పాలకుల సారధ్యంలో సాధ్యం కాదు.

    ReplyDelete
  3. నిజం దీదీ బీటలు వారి తల్లడిల్లుతున్న పల్లె తల్లి ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు.
    ఒకప్పుడు పండక్కి ఒక వారం ముందుగానే పెళ్లి కళ ఉట్టిపడే కన్నెపిల్లలా ఊరు తయారయేది.
    పచ్చటి రంగుల్లో ప్రతి వీధీ వాకిలీ పచ్చి కల్లాపీ ముగ్గుల లేత సువాసనలతో, ఎటు చూసినా అటు ఇటు తిరిగే ఎడ్ల బళ్ల ఘంటారావా లతో పిల్లల కేరింతలు పెద్దల హడావుడీ,
    చిలిపి చిలిపి గిల్లి కజ్జాలూ, సంతలో వింతలు అల్లుళ్ళ అలకలూ, మరదళ్ల సొయగాలూ పసందైన కమ్మటి నేతి వంటలూ ఇలా చెప్పు కుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి.
    నేడు ఇవన్నీ లేక మొక్కుబడిగా ముక్కుతూ మూల్గుతూ పట్నం నుండి ఒక్కరోజుకోసం ఊరొచ్చి కూడా ఫోన్లు పట్టుకుని బిజీ బిజీ గా ఉన్నోళ్ళని చూస్తూ, ఊరు నోరెళ్ళ బెడుతోంది.
    మారింది నేనా వీళ్ళా అని మరీ మరీ నొక్కు కుంటోంది, నెర్రలు పడ్డ తన బుగ్గల్ని.

    ReplyDelete
    Replies
    1. ఇక ముందు పల్లెలుండవు.
      థాంక్స్ జానీ మీ స్పందనకు.

      Delete
    2. maatalu ravatledu em cheppaalo teliyatledu kaani meeru cheppina prati maata ekkado guchu kundi naa balyam gurtukochindi...

      videshaalu tirugutu edo saadhicheshaamane garvam tappa nijamaina santrupti karuvavutundi rojurojuku..

      Delete
  4. నిద్రబోయిన పల్లె నిశ్సబ్దంగా ఉంది,
    గింజలు లేక పక్షులు, డొక్కలెండి మురికి నీళ్ళతో కడుపు నింపుకుంటూ కుక్కలు, పూలమ్మిన చోటే కట్టెలమ్మిన దౌర్భాగ్యులూ, బోసిపోయిన వాకిళ్ళూ, గుమ్మం లో ముసలీ,ముతకా కళ్ళలో ప్రాణాలెట్టుకున్న బసవయ్యలూ ....
    నగరవాసులు కొందరు, అలాంటి పల్లెతల్లిని నిద్దురలేపి, పాతకబుర్లు, అమ్మ కమ్మదనం కోసం వచ్చి .... ఆడీ, పాడీ, అమ్మను వదిలేసి .... మళ్ళీ మకర సంక్రాంతికి వస్తామని పట్టణం వైపు పరుగులుతీస్తారు.
    చిత్రం సుమా!
    {పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్నారు బాపూజీ. అవి నేడు ఎండుకొమ్మలవుతున్నాయి. ఆ కొమ్మలు చిగురించేలా రైతుకు చేయూతనిచ్చే నాధుళ్ళమవుదాం}
    యేడాది లో ప్రతి రోజూ ఒక సంక్రాంతి లా పల్లె అలరారాలనే ఆశావహమైన ఉన్నత భావనలు చాలా బాగున్నాయి. అభినందనలు మెరాజ్ గారు!

    ReplyDelete
  5. " బిలంలోకి జారిపోయిన పల్లె తాళాలూ,
    వెతికి పట్టుకున్న నగరవాసులు "

    -----------------ఇదేనా నాగరికత?

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Delete
  6. చాలా ఆలోచింప చేసే కవిత !

    ReplyDelete
  7. కాలం పల్లెపై పగబట్టిందేమో మెరాజ్ గారు. లేదా పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని దుర్ముహర్తంలో అన్నారేమో బాపూ గారు.
    స్వతంత్రానికి ముందున్న పల్లె... ప్రజాస్వామ్యంలో కనిపించలేదు. ఇకపై కనిపిస్తుందన్న ఆశ లేదు. పట్నాలు పల్లెల్ని మింగేశాయి. పల్లెవాసిని పట్టం పడుచు కొంగున కట్టేసుకుంది. చేతివృత్తులను మరలు తుక్కుతుక్కు చేశాయి. వ్యవసాయానికి సాయం లేకుండా పోయింది. శాసనసభలో కూర్చున్న నేతలకి వాళ్లలో వాళ్లు తన్నుకోడానికే సమయం సరిపోడం లేదు.
    పల్లె కన్నీరు పెడుతోందో... కనిపించని కుట్రల.... అని ఓ మంచి పాట. ఆదోసారి విని మనం కన్నీరు పెట్టడం మినహా... ఏం
    చేసినా ఆ శిథిలాయాలకు పూర్వశోభ తేలేమేమో అనిపిస్తోంది ( కోస్తాలో ఉభయ గోదావరి నుంచి విజయనగరం జిల్లా వరకు చాలా పల్లెలు ఇప్పటికీ బంగారంలా ఉన్నాయి. వాటి బాగుకి ఆ ఊరి ప్రజలే కారణం. వాటిని మోడల్స్ గా తీసుకుంటే.. కొంత వరకు పల్లెలను బాగుచెయ్యొచ్చు. మెరాజ్ గారు. నాకెందుకో కొంత ఆశ ఉంది)

    ReplyDelete
  8. వాస్తవంగా పల్లెల స్థితి గతులు 'ఎలా ఉన్నాయని' కళ్ళకు కట్టినట్లుగా ఏంతో బాగా చుపించారు ఫాతిమా గారు

    శ్రీపాద

    ReplyDelete
  9. సతీష్,శ్రీపాద గార్లకు ధన్యవాదాలు.

    ReplyDelete
  10. Manasunu kadilinchese kavithaa

    chaala rojula taruvaata gunde baruvekkindi paata rojulu gurtuku vachay

    ReplyDelete