Pages

Thursday, 23 January 2014

అతివ అంతరంగం

అతివ అంతరంగం

నీ  రాకకై  ఎదురు  చూసిన  "ఊర్మిళను"
నీ  తలపుతో  తపించిన  " శకుంతలను"
నీ  ఆనతో  కానలకేగిన  "అయోనిజను" 
నీ  పాద  స్పర్శతో  నాతియైన  "అహల్యను"
నీ  ప్రేమ  నాకే  చెందాలని  సాధించిన  "సత్యను"
నిను  తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ  పదాలనే  పలవరించిన  "మీరాని"
నీ  సత్యపథంలో  నడిచిన  "చంద్రమతిని"
నీకు  పరస్త్రీ  వ్యామోహం  వలదని  పలికిన  "మండోదరిని"
మూర్చిల్లిన  నిను  ముప్పునుండి  తప్పించిన  "నరకాసుర మర్దినిని"
నీ  ప్రేమకై  రేపల్లెను  పొదరిల్లు  చేసిన  "రాధని"
నీవాడిన  జూదంలో  పావునైన  "పాంచాలిని"
యుగాలు  మారినా  నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా  నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.

19 comments:

 1. ఇన్ని రూపాలనూ, స్వరూపాలనూ సమర్ధంగా పోషిస్తూ తనువూ మనువూ మనసూ మగాడికే అర్పిస్తూ కూడా అబల గానే బలయ్యెదీ ఆడదే.
  సకల శక్తి రూపిణీ సర్వ కాల సదుపాజ్ఞ్యి,
  మగాడికి బలాన్నిచ్చెదీ ఆడదే,
  ఆడదే లేకుంటే మగాడు నిర్బలుడే దీదీ..

  ReplyDelete
  Replies
  1. తమ్ముడూ, స్త్రీ మీద మీకున్న మంచి అభిప్రాయానికి నా ధన్యవాదాలు.

   Delete
 2. కేవలం పదహారు వరుసలలో యుగయుగాల పదహారణాల
  ఆడపడచు ఔన్నత్యాన్ని,పురుషుల అవకాశవాదాన్నీ
  అలవోకగా వివరించారు,అద్భుతంగా ఉంది మీరజ్ .

  ReplyDelete
  Replies
  1. దేవీ..., మీ ప్రశంసా,స్పూర్తీ నా కవితలకి బలాన్నిస్తాయి.

   Delete
 3. తరతరాలుగా యుగయుగాలుగా ఆడది ఆక్రోషాలకు, అవమానాలకు, ఉన్మాదాలకు బలవుతున్న అబలే. కానీ..
  మార్పు ఎక్కడి నుంచి రావాలి అన్నదాని గురించి లోతైన చర్చ ఆచరణ జరగడం లేదు ఫాతిమా గారు. మీరు ఆవేదనతో రాశారు
  . నేను మగువ మనసు తెలుసుకునే ప్రయత్నంలో లోగడ ఒక పోస్ట్ రాశాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి.
  http://kotturikatalu.blogspot.in/2013/11/blog-post_20.html

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదాలు సతీష్ గారు,
   మీ బ్లాగ్ తప్పకుండా చూస్తాను,

   Delete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. మీరు ఆవేదనతో రాసిన కవిత... మమ్మల్ని ఆలోచింపచేసేలా ఉంది.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందన నా చేత ఇంకా ఎన్నో కవితలు రాయిస్తుంది నాగేంద్ర గారు.

   Delete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
 7. నేను ఆదిశక్తిని అనుకోవడం లేదు
  నాడు ఒక "ఊర్మిళను" " శకుంతలను" "అయోనిజను" "అహల్యను" "సత్యను" "రుక్మిణిని" "మీరాని" "చంద్రమతిని" "మండోదరిని" "రాధని" "పాంచాలిని"
  యుగాలు మారినా, తరాలు మారినా నేడు నీ "తలోదరినే" నీ "కలికినే".నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలనే". రాక్షసంగా నీవు మారి నన్ను విగతను చేస్తున్న ....

  ReplyDelete
  Replies
  1. సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 8. అనుకరణలు లేని కవిత, భావం బాగున్నాయి . రాతకు అబినందనలు.స్వరం మనుషుల ఎదవాకిల్లనుస్పృశించి ఒక ప్రశ్నగా పలకరిస్తుండానే ఆశ.

  ReplyDelete
  Replies
  1. సందీప్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం,
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 9. నేను అందుకే అమ్మ అంటాను. స్త్రీలేని పురుషుడు వ్యర్ధం. పురుషుడు లేని స్త్రీ కూడా అంతే. ఒకరి కొకరు సంపూరకాలూ, పరిపూరకాలూ. అర్ధనారీశ్వరతత్వం. తెలుసుకుంటే బతుకు సుఖం లేకపోతే నిప్పుల గుండం.

  ReplyDelete
  Replies
  1. సర్, నిజమే మీరన్నది.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete

 10. "అతివ అంతరంగం" ... అమోఘం
  ఫాతిమా గారు ...... పదాలు చాలవు మిమ్ము అభినందించడానికి .
  ఓ మంచి కవిత అనే కంటే ... కనువిప్పు కలిగించే ఓ గొప్ప అక్షర మాల అని అంటాను నీను - శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసను సంతోషంగా తీసుకొని ఇంకా మంచి కవితను రాయటానికి ప్రయత్నిస్తాను.
   ధన్యవాదాలు శ్రీపాద గారూ,

   Delete