నీ రాకకై ఎదురు చూసిన "ఊర్మిళను"
నీ తలపుతో తపించిన " శకుంతలను"
నీ ఆనతో కానలకేగిన "అయోనిజను"
నీ పాద స్పర్శతో నాతియైన "అహల్యను"
నీ ప్రేమ నాకే చెందాలని సాధించిన "సత్యను"
నిను తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ పదాలనే పలవరించిన "మీరాని"
నీ సత్యపథంలో నడిచిన "చంద్రమతిని"
నీకు పరస్త్రీ వ్యామోహం వలదని పలికిన "మండోదరిని"
మూర్చిల్లిన నిను ముప్పునుండి తప్పించిన "నరకాసుర మర్దినిని"
నీ ప్రేమకై రేపల్లెను పొదరిల్లు చేసిన "రాధని"
నీవాడిన జూదంలో పావునైన "పాంచాలిని"
యుగాలు మారినా నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.
ఇన్ని రూపాలనూ, స్వరూపాలనూ సమర్ధంగా పోషిస్తూ తనువూ మనువూ మనసూ మగాడికే అర్పిస్తూ కూడా అబల గానే బలయ్యెదీ ఆడదే.
ReplyDeleteసకల శక్తి రూపిణీ సర్వ కాల సదుపాజ్ఞ్యి,
మగాడికి బలాన్నిచ్చెదీ ఆడదే,
ఆడదే లేకుంటే మగాడు నిర్బలుడే దీదీ..
తమ్ముడూ, స్త్రీ మీద మీకున్న మంచి అభిప్రాయానికి నా ధన్యవాదాలు.
Deleteకేవలం పదహారు వరుసలలో యుగయుగాల పదహారణాల
ReplyDeleteఆడపడచు ఔన్నత్యాన్ని,పురుషుల అవకాశవాదాన్నీ
అలవోకగా వివరించారు,అద్భుతంగా ఉంది మీరజ్ .
దేవీ..., మీ ప్రశంసా,స్పూర్తీ నా కవితలకి బలాన్నిస్తాయి.
Deleteతరతరాలుగా యుగయుగాలుగా ఆడది ఆక్రోషాలకు, అవమానాలకు, ఉన్మాదాలకు బలవుతున్న అబలే. కానీ..
ReplyDeleteమార్పు ఎక్కడి నుంచి రావాలి అన్నదాని గురించి లోతైన చర్చ ఆచరణ జరగడం లేదు ఫాతిమా గారు. మీరు ఆవేదనతో రాశారు
. నేను మగువ మనసు తెలుసుకునే ప్రయత్నంలో లోగడ ఒక పోస్ట్ రాశాను. చూసి మీ అభిప్రాయం చెప్పండి.
http://kotturikatalu.blogspot.in/2013/11/blog-post_20.html
మీ స్పందనకు ధన్యవాదాలు సతీష్ గారు,
Deleteమీ బ్లాగ్ తప్పకుండా చూస్తాను,
This comment has been removed by the author.
ReplyDeleteమీరు ఆవేదనతో రాసిన కవిత... మమ్మల్ని ఆలోచింపచేసేలా ఉంది.
ReplyDeleteమీ స్పందన నా చేత ఇంకా ఎన్నో కవితలు రాయిస్తుంది నాగేంద్ర గారు.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteనేను ఆదిశక్తిని అనుకోవడం లేదు
ReplyDeleteనాడు ఒక "ఊర్మిళను" " శకుంతలను" "అయోనిజను" "అహల్యను" "సత్యను" "రుక్మిణిని" "మీరాని" "చంద్రమతిని" "మండోదరిని" "రాధని" "పాంచాలిని"
యుగాలు మారినా, తరాలు మారినా నేడు నీ "తలోదరినే" నీ "కలికినే".నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలనే". రాక్షసంగా నీవు మారి నన్ను విగతను చేస్తున్న ....
సర్, ధన్యవాదాలు మీ స్పందనకు.
Deleteఅనుకరణలు లేని కవిత, భావం బాగున్నాయి . రాతకు అబినందనలు.స్వరం మనుషుల ఎదవాకిల్లనుస్పృశించి ఒక ప్రశ్నగా పలకరిస్తుండానే ఆశ.
ReplyDeleteసందీప్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం,
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
నేను అందుకే అమ్మ అంటాను. స్త్రీలేని పురుషుడు వ్యర్ధం. పురుషుడు లేని స్త్రీ కూడా అంతే. ఒకరి కొకరు సంపూరకాలూ, పరిపూరకాలూ. అర్ధనారీశ్వరతత్వం. తెలుసుకుంటే బతుకు సుఖం లేకపోతే నిప్పుల గుండం.
ReplyDeleteసర్, నిజమే మీరన్నది.
Deleteధన్యవాదాలు మీ స్పందనకు.
ReplyDelete"అతివ అంతరంగం" ... అమోఘం
ఫాతిమా గారు ...... పదాలు చాలవు మిమ్ము అభినందించడానికి .
ఓ మంచి కవిత అనే కంటే ... కనువిప్పు కలిగించే ఓ గొప్ప అక్షర మాల అని అంటాను నీను - శ్రీపాద
మీ ప్రశంసను సంతోషంగా తీసుకొని ఇంకా మంచి కవితను రాయటానికి ప్రయత్నిస్తాను.
Deleteధన్యవాదాలు శ్రీపాద గారూ,