Pages

Sunday, 27 May 2012

అందని ప్రేమ


అందని  ప్రేమ

కళ్ళు  తెరిచే  కలలు   కన్నావు , వాస్తవమై  కాటేశాడు.

నెచ్చెలివై  చెంత  చేరావు , నొప్పి తెలీని  కత్తితో   కుత్తుక  కోశాడు 
కాలనాగు  చుట్టుకున్నా  మల్లితీగ  అని  మురిసి పోయావు.

నమ్మకం  అనుకుంటూ  వమ్ముకు  కొమ్ము కాశావు.

గుండెలమీద  నడచి వెళ్తున్నా  నోచ్చుకుంటాడని   ఓర్చుకున్నావు. 

ఒక్కసారి  నా గూర్చి  యోచన     చేయమని దీనంగా   యాచించావు. 

కన్నీటితో   కట్టి పడేయలేక    కాళ్ళు  పట్టుకుని  వేడుకున్నావు. 
మరుగున  పడుతున్న  ఊసులన్నీ   మళ్ళి  మళ్ళీ   గుర్తుచేసావు. 

ఏమిస్తే  మచ్చికవుతాడో, ఏం  చేస్తే మనువాడుతాడో  అడిగి చూసావు. 

కొత్తపిట్టతో  కువ కువలాడితే  దైన్యంగా  విలపించావు.

అంధకారంలో  ఆశల  దివిటీతో  నీ చండురున్ని  వెతికావు.

తలపులలో  తలారికి  చోటిచ్చావు,   ఉరికొయ్యకు   చిక్కుకున్నావు . 
గుండె రాయి చేసుకున్నావు, కసాయికి  పట్టం  కట్టావు.

నీ ఆశల  కొమ్మ   ఎండిపోతుంటే  అశ్రువుల  ఎరువు  వేసావు. 

కాలుతున్న   గుండెకు  కాటి  కాపరినే  కాపలా  ఉంచావు.

కరకు పాళీని  తెచ్చి ,  వలపు సిరాలో  ముంచి  కొత్త   కావ్యం  రాసాడు.
నిను  విడిచి  పోతున్న  నీ  కలల  రేడు , కల్లల   కాటిన్యుడు.   

వలపు వాకిలి  మూత   పడినదనా ..  వల్ల  కాటికి  పయనమయ్యావు?  

నీ వెనుక  నడిచే  చెల్లెళ్ళకు  ఏమి చెప్పి   వెళ్లావు? 
నీ  నిష్క్రమణ  వెనుక  ఓ  సత్యాన్ని  ఆవిష్కరించావనా? 

          పేద  గుండె  ప్రేమకు  పనికి రాదనా ?  ఇదేనా  నువ్వు  చెప్పింది ? 

20 comments:

 1. ప్రతి అమ్మాయి ఆలోచింపచేసే విధంగా రాసారు. మగవాడిచేతిలో మోసపోతున్న అమ్మాయిలకి మీ కవిత ఓ హెచ్చరిక!

  ReplyDelete
 2. అమ్మాయిల ఆలోచనలలో పరిపక్వత ఉండాలి , ప్రేమ విపలమైనా తట్టుకొనే మనోనిబ్బరం అలవరచుకోవాలి ,తమను తాము తక్కువ చేసుకుని , నిరాశకు లోనై ప్రాణాలు వదిలేస్తున్నారు , మీ స్పందనకు ధన్యవాదాలు నాగేంద్ర గారూ

  ReplyDelete
 3. ప్రేమ వలలో చిక్కున్న అమ్మాయిల అనాలోచన, పిరికితనం ని ..ఆవేదనతో..ఆవిష్కరించారు.
  చావడం ఒక్కటే పరిష్కారమని తలంచ బట్టే కాళ నాగుల కాటు కి అడుకట్ట వేయలేకపోవడం జరుగుతుంది.
  చాలా బాగా వ్యక్తీకరించారు.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ , నా కవితలు సునిశితంగా పరిశీలించి చక్కని సలహాలతో నేను ఇంకా రాయటానికి స్పూర్తినిచ్చిన నెచ్చలి మీరు . మీ వ్యాఖ్య సంతోషాన్ని ఇస్తుంది , ధన్యవాదాలు.

   Delete
 4. చాలా ఆర్థ్రతతో హృద్యంగా చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్పారు ఫాతిమాజీ...అభినందనలు...

  ReplyDelete
 5. వర్మాజీ , చాలా సంతోషం మీ ప్రసంశకు, నేను మీ వెన్నెల దారి ప్రతిరోజూ చూస్తాను , నా కవితల పై మీ విశ్లేషణ కోరుతున్నాను , నా" దీన దీపికలు " కవిత చదివి మీ అభిప్రాయం చెప్పగలరు , మరోసారి ధన్యవాదాలు

  ReplyDelete
 6. కలలకు, వాస్తవానికి తేడాను బాగా చూపించారు కవితలో.
  బాధ పడేది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు.
  ఒకరి దృష్టి కల పైనా మరొకరి దృష్టి వాస్తవం పైనా అయితే?
  కలలోనుంచి వాస్తవంలోకి రావడం మరణమా?
  ఆలోచించవలసిందే!
  కాని ఒకటి మాత్రం నిజం!
  మీ మాటలు తూటాలలా పేలుతాయి. వెనక ఎవరున్నారో మరి?!

  ReplyDelete
 7. సార్, కవిత మీ సమయం వెచ్చించి కవిత చదివినందుకు ధన్యవాదాలు . ఇక పోతే ప్రేమ విపలం కావడానికి కారణం ఒకరి కళను ఒకరు కాళ్ళ చేయటమే , కాని దానికి పరిష్కారం మరణం కాదు ఈ కవితలో కవయిత్రి అడిగింది కూడా అదే , చావును ఎందుకు ఎంచుకున్నావు ? పేద గుండె ప్రేమకు పనికిరాదనా ? అని. కాని తన ప్రేమ ఓడిపోతున్నప్పుడు , నిస్సహాయత ఆడ మనస్సు చలిస్తుంది . అలాంటప్పుడే మనూ నిబ్బరం కావాలి . నా మాటలు తూటాలు గా పేలటానికి నేను ఇలా రాయటానికి ప్రోత్శాహాన్నిచ్చిన తమరు , నా కవితలకి భాలాన్నిచ్చిన మా శ్రీవారు . మీ అమూల్యమైన సమయం వెచ్చించినందుకు మరోసారి ధన్యవాదాలు . పెద్ద కవిగా మీ సలహాలు నేను ఎప్పుడూ పాటిస్తాను

  ReplyDelete
  Replies
  1. సార్ చిన్న సవరణ ఒకరి కలను ఇంకొకరు కల్ల చేయటం అని నా భావన

   Delete
 8. కవితకు వేసిన చిత్రం ఆబ్ స్ట్రాక్ట్ గా ఉంది, మీ కవితలాగానే!
  మీ కవితలో ఉన్న ఆశావాదం యువతకు అర్థం అయితే ఎంత బాగుంటుంది.
  ప్రేమ విఫలం అయితే మరణం ఒక్కటే శరణం అనే భావన ఒక కాన్సర్ లాంటిది.
  అది ఆ అమ్మాయిని విడిచి వెళ్తున్న ' ఎండ్రకాయ ' లో ప్రతీకాత్మకంగా చూపించారు.
  నాకు బాగా నచ్చింది.
  బ్లాగు కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి క్వాలిటీ తెస్తున్న శ్రీ ఇస్మాయిల్ గారికి అభినందనలు + ధన్యవాదాలు.
  మరో చిన్న విషయం. ' తూటాలు ' అన్న మాట డిపార్ట్ మెంట్ ని సూచించడానికి కూడా వాడాను.
  ALL THE VERY BEST.

  ReplyDelete
 9. Sir, Good Morning. We are indebted to you for your support and encouragement. Thank you very much. Good Day. "ISMAIL"

  ReplyDelete
  Replies
  1. సార్, ప్రముక పత్రికలైన " నవ్య " . స్వాతి " లో వస్తున్న మీ ధారావాహికలు క్రమం తప్పకుండా చదువుతున్నాను . మెయింటేన్ లో యువతకు మీరిచ్చే సందేశాలు ప్రయోజనకారిగా ఉన్నాయి .

   Delete
 10. చాలా బాగుంది ఫాతిమా గారూ!
  మోసగించబడిన స్త్రీ దీన గాధ..
  చాలా ఆర్ద్రత ఉంది మీ కవితలో...
  మీ ఆవేదనా కలం నుంచి వచ్చిన మరో ఎర్రటి చేవ్రాలు...
  @శ్రీ

  ReplyDelete
 11. శ్రీ గారూ , మీ ప్రశంసకు ధన్యవాదాలు . ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రమె వర్తించదు. ఎందరో అబ్బాయిలు కూడా ప్రేమ విపలమై తమ చదువును , భవిషత్తు ను, వదులుకుని విరాగులై ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .

  ReplyDelete
 12. పట్టు భిగించిన భావము
  చుట్టూ పదునైన ఖడ్గ ఛురికలు పదముల్
  పుట్టి మునుగు యువత గతుల
  గట్టుకు చేర్చంగ గల్గు కవిత యిది గదా !

  ReplyDelete
 13. గురువు చెప్పిన పాఠము వినుము .
  తరువు ఇచ్చిన ఫలము తినుము .
  ముళ్ళ బాటన నడవకుము ఇదే
  యువతరానికి నేనిచ్చు సందేశము.
  సార్, నా కవితకు మీరిచ్చిన ప్రశంసకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు . ప్రతిచోటా మీ వ్యాఖలు చదువుతుంటాను పద్య పాదాలతో మావంటి వారు నేర్చుకొనే విదంగా ఉంటాయి . ఇక ముందు కుడా నా కవితలు చదివి నన్ను ప్రోత్స హించ గలరని ఆశిస్తున్నాను

  ReplyDelete
 14. మీ ప్రతి కవిత కదిలిస్తుందండి ఫాతిమ గారు.

  ReplyDelete
 15. వెన్నెల గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు

  ReplyDelete
 16. ముందుగా, చిన్న చిన్న సవరణలు.
  >నమ్మకం అనుకుంటూ వమ్ముకు కొమ్ము కాశావు.
  వమ్ము అనేది ఇక్కడ సరైన పదం కాదండీ.
  >కొత్తపిట్టతో కువ కువలాడితే దైన్యంగా విలపించావు.
  దీనంగా అనాలండీ. దైన్యంతో అన్నా బాగుంటుంది.
  >నీ ఆశల కొమ్మ ఎండిపోతుంటే అశ్రువుల ఎరువు వేసావు.
  అశృవుల అంటే గుణింతం సరిగా ఉంటుంది. (మీ software లో ఇబ్బంది ఉండవచ్చును.)
  >నిను విడిచి పోతున్న నీ కలల రేడు , కల్లల కాటిన్యుడు.
  కఠినుడు అనాలండి. అప్పటికీ కల్లల అనే విశేషణం అతకట్లేదు సరిగా. కల్లలాడు కఠినుడు సరిగా ఉంటుంది.

  ఈ సవరణలకేమి గాని, మీ కవిత చాలా బాగుంది. ఆలోచింప జేసింది.

  మోసగించటానికీ, మోసపోవటానికీ స్త్రీపురుషబేధం లేదు. అయితే ప్రకృతిసిధ్ధమైన కొన్ని పరిమితుల కారణంగా మోసపోతున్న స్త్రీలు యెక్కువగా నష్టపోతున్నారు. అయితే స్త్రీలు మరింత విధ్యావంతులూ, ఆర్థికంగా మరింత స్వతంత్రులూ అయితే హెచ్చుగా ప్రయోజనం ఉండవచ్చు. దగాపడ్డ స్త్రీలకు సమాజం అండదండలు దక్కక పోవటం పెను విషాదం. దీనితో సామాజికంగా, మానసికంగా ఒంటరితనం పిడించి ప్రపంచం నుంచి తొలగిపోయేందుకు సిధ్ధపడుతున్నారు. వాళ్ళని తప్పు పట్టే ముందు సమాజం తన బాధ్యతను గుర్తిస్తే పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది.

  మంచి కవిత వ్రాసినందుకు అభినందనలు.

  ReplyDelete
 17. సార్, మీ సలహాకు, సవరణలకు ధన్యవాదాలు . నా కవిత ఆలోచింప చేసినందుకు సంతోషం.

  ReplyDelete