Pages

Wednesday, 30 May 2012

నీ ..నా


నీ ..నా

నువ్వూ  నేనూ  నడిచే   బాటలో   ఎవరు ముందు వెళ్ళాలి అనే  వాదనెందుకు?

నీకూ నాకూ తెలిసిన  గతంలో ఎవరిదిఎంత  తప్పో అనే   ప్రస్తావనెందుకు?

నీలో నాలో కలిగిన అసహనాల సెగలో  ఎవరు కాలిపొతారో  అనే  కలత ఎందుకు?

నీకై  నాకై  నిర్మించుకున్న  కుటీరంలో   ఎవరి వాటా ఎంత అనే  వాదనెందుకు?

నీది, నాది  అనుకున్న ఈ జీవనంలో  ఎవరి  స్థానం  ఎంతో   అనే  సందేహం ఎందుకు?

నువ్వూ నేనూ విడిపొవాలి  అనుకున్నప్పుడు  ఎవరి సలహాలూ  వినపడవెందుకు?

నీ, నా  అనుకున్న ఓ  ప్రాణి  మనకున్నప్పుడు  ఎవరికి చెందుతుందో  అనే  అనుమానమెందుకు?

నీవీ, నావీ నుదుటి  రాతలు  సరిగా లేనప్పుడు  ఎవరినో  నిందించే  ప్రయత్నమెందుకు?

నీవీ, నావీ  నడకలు  సరిగా ఉన్నప్పుడు  ఎవరి అడుగుల ఆసరానో  మనకెందుకు?

నీ, నా  సొంతమైన  ఓ  బుల్లి  దీపం  మన ఇంట  ఉండగా  ఎవరి కంటి  వెలుగో  మనకెందుకు?  

నీలో, నాలో  సంస్కారం  మెండుగా  ఉన్నప్పుడు  ఒకరినొకరు మన్నించుకొనేందుకు ఆలస్యమెందుకు?  
14 comments:

 1. లెస్స పలికితిరి...
  అలా ప్రతి జంటా ప్రశ్నించుకుంటే
  ఏ పొరపొచ్చాలు ఉండవేమో కదా!

  ReplyDelete
  Replies
  1. పద్మార్పిత గారూ , మీ ప్రసంశకు ధన్యవాదాలు , చాలా కాలం తర్వాత నా బ్లాగ్ దర్శించారు కృతజ్ఞతలు

   Delete
 2. అభిప్రాయభేదాలు ఉన్న భార్యా భర్తలను మంచి ప్రశ్నలే అడిగారు! Nice.

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ , మీ ప్రశంసకు ధన్యవాదాలు

   Delete
 3. అంతరాత్మ పై వేయి శతఘ్నిలు సందించికున్నట్లు ఉంది.
  బావుంది.

  ReplyDelete
  Replies
  1. వనజ గారూ , మీ పరిశీలనా శక్తి అమోఘం , మొదట మనం ప్రశ్నించుకో వలసినది మన అంతరాత్మనే . మీ ప్రశంసకు ధన్యవాదాలు

   Delete
 4. మీ కవితా హారంలో కూర్చిన మరో మంచి ముత్యం...
  ఇలాంటి ప్రశ్నలు వేసుకునే కాలం దాటాక...
  'గత జల సేతు బంధనం' లా
  ఎవరికి వారే (వారిలో వారే) ప్రశ్నించుకుంటూ ఉండిపోతున్నారేమో చాలా మంది...
  సున్నితమైన విషయాన్ని స్పృశించారు ఎప్పటి లాగే...
  @శ్రీ

  ReplyDelete
 5. శ్రీ గారూ, ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు , ఇక పోతే ఇది సున్నిత సమస్యనే కాదు లోతైనది కూడా బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎవరికివారు ఆత్మవిమర్శ చేసులోవాలి , ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి , బిడ్డల గూర్చి ఆలోచించాలి . కలసి ఆలోచించాలి , ఇలాంటి వారందరికీ ఆత్మస్తైర్యాన్ని ఇవ్వమని దేవుని ప్రార్దిద్దాం

  ReplyDelete
 6. నీది, నాది అనుకున్న ఈ జీవనంలో ఎవరి స్థానం ఎంతో అనే సందేహం ఎందుకు?

  ముందుగా నీ నా అన్న అస్తిత్వ పోరుతోనే మొదలవుతుంది కదా కయ్యం..అది లేకుండా చేసే జీవనయానం ప్రశ్నలకు తావులేకుండా వుంటుంది. అయినా నేటి ఆధునిక జీవన సరళిలో ఈ నీ నా అన్న అస్తిత్వాల గురుతులు ఎవరివి వారికి వుంటూనే కొనసాగాల్సిన సహజీవనానికి ఈ ప్రశ్నలు తోడ్పడాలి. ఒకరంటే ఒకరికి ప్రేమతో పాటు గౌరవం కూడా కలిగి వుండాలికదా ఫాతిమాజీ..బాగుంది మీ నీ..నా.. ప్రశ్నల శరపరంపర..

  ReplyDelete
 7. వర్మ గారూ , మీరన్నది ముమ్మాటికీ నిజం . ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి . మీ స్పందనకు ధన్యవాదాలు

  ReplyDelete
 8. నువ్వు, నేను ; నీది, నాది పోయి మనము, మనది
  అనే మాటలు వస్తే ఎంత బాగుంటుంది.
  భార్యాభర్తలు విడిపోవచ్చు గాని
  తల్లిదండ్రులు మాత్రం విడిపోకూడదు కదా!
  చాలా బాగుంది.

  ReplyDelete
 9. గంగాశ్రీనివాస్ గారికి , మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, సార్ అస్సలు విడిపోయే ఆలోచనే మంచిదికాదు , అయితే మీరన్నట్లు అమ్మ, నాన్నలు అస్సలు విడిపోరాడు. క్రమం తప్పకుండా సమయం వెచ్చించి నా బ్లాగ్ చూస్తున్నందుకు కృతజ్ఞతలు

  ReplyDelete
 10. one should not get a situation in life where such questions raise

  ReplyDelete
 11. Sir, let us hope that no one should get such a situation.

  ReplyDelete