మూటలు మోసి మూర మల్లెలు తెచ్చేవోడివి, ముద్దబంతిలా ఉన్నావంటూ ముద్దు చేసేవోడివి.
కట్టెలు కొట్టి, కడుపు కట్టుకొని కమ్మలు తెచ్చావు, కడుపుతో ఉన్న నను చూసి మురిసిపోయావు.
నీ కళ్ళు నేనైతే నా కలవి నువ్వూ, నీ ప్రాణం నేనైతే నా ప్రణయం నీవూ,
వెన్నెల కురుస్తున్న మన జీవన బృందావనంలోకి వేదన వేటగాడిలా వచ్చింది.
.
అమ్మనవుతున్న నేను ఆసుపత్రిని ఆశ్రయించాను, అయ్యవవుతున్న నీవూ ఆదుర్దా పడ్డావు.
నాకోసం నీవు యంత్రంలా, క్షణ క్షణం అనుక్షణం పరుగులెత్తావు పాటుపడినావు.
పందికొక్కుల, రాబందుల సంతానమైన ఆసుపత్రి బృందాల చిల్లు జేబు నింపాలని చూశావు
వైద్య పరిశోధనలకోసం ఈ జలగలకి చిక్కావు, కాయాన్ని వీరి ధనాకలికి దానం చేసావు.
బొంగరంలా .. నా చుట్టూ తిరిగే నా బంగారు మావా ... నా కోసం అనాద శవం అయ్యావా?
నా కోసం ప్రాకులాడే నిన్ను ముందుగా పంపేసారు ఈ దయ లేని దూర్తులు.
మావా .. నా కళ్ళు కలువ పూలు అనేవోడివి కదా , వాటికి విలువ కడుతున్నారు.
ఈ మానవ మాంసపు కబేళాలో
వేలం వెయ్యబడుతున్నాయి నా కళ్ళు.
ఈ కసాయి వైద్యుల కత్తులు నా కుత్తుక మీద సవారీ చేస్తున్నాయి.
రోగం (?) ముదిరినాక వచ్చామనీ ఏది ఏమైనా మేమే భాద్యులమనీ ఏలు ముద్రతో వీలునామా ఇచ్చామట.
అదే ముద్దర ఏస్తున్నారు మన ఆనాద శవాలకు మూకుమ్మడి రాబందుల్లా,ఈ ధన్వంతరి వారసులు .
ఆర్డరు పాసయి పోయింది ఆనాద అందురాలైన నా సమక్షంలో, అక్షరాలా లక్షల సాక్షిగా.
ఆసుపత్రులోద్దని అరద్దామంటే.. అయిసులో పెట్టి చల్లగా నా ముక్కుమూసారే ఈ కర్కోటకులూ ..
plese pai photoni maarchandi,
ReplyDeleteemanukokandi ila adiginanduku.
సార్, మీరన్నట్లే చిత్రాన్ని మార్చాను
Deletethank you madem,
DeleteSir, you are welcome
Delete"అమ్మనవుతున్న నేను ఆసుపత్రి ని ఆశ్రయించాను, అయ్యవవుతున్న నీవూ ఆదుర్దా పడ్డావు." అంటే బిడ్డను కనటానికి ఆసుపత్రికి వెళితే వారికి ఆఖరికి చావు తప్పలేదని కదండి మీరు చెప్పింది ఫాతిమా గారు? ఎంత భయంకరమైన అనుభవమో అది. కళ్ళకు కట్టినట్టు కవితా రూపం ఇచ్చిన మీకు అభినందనలు.
ReplyDeleteవెన్నెల గారూ , మీ ప్రశంసకు ధన్యవాదాలు . సహజంగా సున్నిత హృదయం కనుక కలత చందుతారు మీరు , కాని చాలావరకు జరుగుతున్న ఘోరాలే ఇవి
Delete"ఆసుపత్రులోద్దని అరద్దామంటే..
ReplyDeleteఅయిసులోపెట్టి చల్లగా నాముక్కుమూసారే ఈ కర్కోటకులూ"
ఆర్ద్రతగా ఉందండి..so sad to hear these..
పద్మార్పిత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు , మీ విశ్లేషణ బాగుంటుంది . నా బ్లాగ్ చూసి నన్ను ముందుకు నడిపిస్తున్న మీకు కృతజ్ఞతలు
Deleteఏమిటిది హఠాత్తుగా భయ పెడుతున్నారు?
ReplyDeleteహాస్పిటల్స్ బాగాలేవని తెలుసు గాని 'కబేళా ' లతో
సరిపోలుతున్నాయా?
అన్ని రసాలను పలికించాలని ప్రయత్నమా!
ఇప్పుడు
భీభత్స రసమా?
మీ కలం సున్నిత భావాలను పలికిస్తే
బాగుంటుందండీ! ప్లీజ్...
శ్రీనివాస్ సార్ కి నమస్తే , మీ స్పందనకు ధన్యవాదాలు . ఇకపోతే ఈ భాట తమ వంటి పెద్ద కవులు నడిచినదే మీ " బ్రెయిన్ డేడ్ " కదానిక ఇచ్చిన ప్రేరణ ఈ కవితకు ఆధారం. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు చూస్తున్నప్పుడు కలం సున్నితంగా స్పందించలేక పోతుంది . నా బ్లాగ్ దర్శించి మీ అమూల్యమైన అబిప్రాయాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు
ReplyDeletenice
ReplyDeleteprince garu ,thank you very much
Deleteఅమ్మో నిజంగానే కొన్ని ఆసుపత్రులు మీరనట్లే ఉన్నాయండి
ReplyDeleteసృజన గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు , నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు
Deleteకళ్ళముందు జరిగే ఘోరాల్ని కంటి ముందు కవితా చిత్రంగా ఆవిష్కరించారు...
ReplyDeleteధర్మాసుపత్రిలో జరిగే అధర్మాలు ఇంత..అంత...అని చెప్పలేనంతగా ఉంటాయి....
మీరు వ్రాసినదాంట్లో సత్యం ఉంది...
@శ్రీ
శ్రీ గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు . కంటి ముందు జరిగే ఘోరాలకు మూగ సాక్షులుగా నిలిచిపోయే అభాగ్యులు ఎందరో , అలాగని అందరు వైద్యులు కిరాతకులు కారు , మానవత్యం కలిగిన వైద్యులు మన్నించాలి నా కవిత వారిని ఉద్దేశించి మాత్రం కాదు సుమా ,
ReplyDeleteపేదవాడి వీలునామాను చాలా బాగా ఆవిష్కరించారు.
ReplyDeleteకారణాలు ఏవైనా, ప్రతి చోటా 'అధికం గా' దోచుకోబడుతున్నది పేదవాడు మాత్రమే.
హర్షా , మీ స్పందనకు ధన్యవాదాలు . పేదరికం , చదువు లేకపోవటం వల్లా దోపిడీకి గురవతున్నారు ఎంతోమంది దీనులు .
ReplyDeleteఫాతిమ గారు... చదువుతున్నంత సేపు కన్నులనిండా కన్నీరే ఉంది.... So sad....
ReplyDeleteకానీ కళ్ళకు కట్టినట్టు నిజాన్ని చూపినందుకు ధన్యవాదాలు...
-సాయి
సాయి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, కవిత మిమ్మల్ని ఆలోచింప చేసినందుకు ఆనందంగా ఉంది, నా బ్లాగ్ సందర్శించిన మీకు కృతజ్ఞతలు .సార్ వీలుంటే వెనుకటి కవిత చదివి మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను.
ReplyDeleteనిరుపేదల నిస్సహాయతను ఆవిష్కరించారు ఫాతిమాజీ..అభినందనలు..
ReplyDeleteధన్యవాదాలు, నా కవిత నచ్చినందుకు వర్మాసర్ .
ReplyDelete