రాత్రి 9 గంటల "నిఖా" ( పెళ్లి) కి మధ్యాహ్నం ఒంటిగంట నుండే హడావిడి మొదలైంది. తొమ్మిది గంటలకల్లా బారాతు "షాది ఖానా" (function hall) చేరాలి. పిల్లా మేకా అందరూ సాయంత్రానికల్లా తయారై బారాతు గుర్రం కోసం ఎదురు చూస్తున్నారు.
అందంగా అలంకరించిన గుర్రం రానే వచ్చింది. ముఖం మీది "సేహేరా" (ముఖం పై వేలాడే పూల సరాలు) లోనించి సలీమూ, కళ్ళకున్న గంతల్లోంచి గుర్రమూ ఒకర్నొకరు పరిచయం చేసుకున్నారు. చెప్పోద్దూ, సలీంకి గుర్రాన్ని చూసి పిసరంత కంగారు వేసింది. పిప్పళ్ళ బస్తాలా ఉన్న సలీం ని చూసి బక్క చిక్కిన గుర్రానికీ కాస్త భయం వేసినట్టుంది. ఇక సలీం దోస్తులంతా కలసి సలీం ముఖానికి "సేహెరా" కట్టి, ముస్తాబు పూర్తి చేసి గుర్రంపైకి కుదేశారు. గల్లీ అంతా అత్తరు ఘుమ ఘుమలతో నిండిపోయింది. పెళ్ళి పెద్దలంతా షేర్వానీలు ధరించి గుర్రం వెనక, కుర్రకారంతా గుర్రం ముందు నిలబడి అసహనంగా "తాషా మార్ఫా" (డప్పు వాయిద్యాలు) ల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు మొదలైంది అసలుకథ. ఒక్కసారిగా దడ దడ మంటూ "తాషా మార్ఫా" శబ్ధాలు వినిపించాయి. అంతే ...... అసలే మొదటి సారిగా బారాతుకు తెచ్చిన గుర్రం, ముందు కాళ్ల మీద లేవడం, వెనక్కి పడిపోతున్న సలీం ని వెనక కాళ్ళతో తన్నడం రెప్ప పాటులో జరిగిపోయింది. "దుల్హన్" ను ఉహించుకుంటున్న సలీంకు కళ్ళ ముందు పట్టపగలే నక్షత్ర్రాలు మెరిశాయి. షెర్వానీలన్నీ పరేషానయ్యి, సలీం ని లేపి, మట్టి దులిపి, ధైర్యం చెప్పి, చేతికి నిమ్మకాయ గుచ్చిన కత్తి ఇచ్చి తిరిగి గుర్రం మీదికి నెట్టి చేతులకంటిన మట్టి దులుపుకున్నాయి.
బారాతు కదిలింది. గుర్రం ముందు పిల్లా పెద్దా అంతా డాన్సులేస్తున్నారు. ముఖానికి "సేహరా" అడ్డం ఉండటం వల్ల బారాతు ఎటు పోతుందో తెలియటం లేదు. ఎవర్ని అడిగినా వినిపించుకోవటం లేదు. చుట్టుపక్కల జరిగే శబ్దాల వల్ల ఏ ప్రాంతంలో వెళ్తున్నారో అంచనా వేసుకుంటున్నాడు సలీం. ఒక్కసారిగా గుర్రం ఆగిపోయింది. జనాల డాన్సులూ ఆగిపోయాయి. ఎదురుగా పెద్ద గుంపు పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా బస్సులు తగలబెడుతున్నారు. కేకలూ అరుపులూ, పోలీసు ఫైరింగూ. ఈ హడావిడిలో గుర్రం పక్క గల్లీలోకి పరుగుతీసింది. ఏమీ కనిపించని సలీం అందరూ తన వెనకే వస్తున్నారనుకుంటున్నాడు.
సలీమ్ కి ఏమీ అర్థం కావటం లేదు. ఎటు వెళ్ళినా ట్రాఫిక్ పోలీసులు VVIP program అంటూ ఇంకోవైపుకు తరుముతున్నారు. మెహిదీపట్నం నుండి ఆసిఫ్ నగర్ వెళ్ళాల్సిన తను "లకడికా పుల్" ఎలా చేరాడో అర్థమై చావట్లేదు. ఇంతలో "రవీంద్ర భారతి" ఎదురుగా ఓ పేద్ద గుంపు కనిపించింది. రెండు రాజకీయ పార్టీల వాళ్లు ఒకరి పై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్నారు. ఫలితంగా కర్ఫ్యూ. ఓ పోలీసు లాఠీతో గుర్రం నడ్డి మీద ఒక్కటిచ్చుకున్నాడు. అంతే.... గుర్రంగారు "Deccan Derby Cup" లెవెల్లో గాలితో పోటీ పడి సికిందరాబాదు వైపుగా పరుగు లంకించుకున్నారు.
పరిగెత్తి పరిగెత్తి గుర్రం చివరికి అర్ధ రాత్రి సమయంలో "రైలు నిలయం" వెనక ఆగింది. సలీం గుర్రంతో పాటు అర్ధరాత్రి చలిలో అక్కడే పడి నిద్రపోయాడు. తలమీద ఎవరో ప్రేమగా నిమురుతున్న ఫీలింగ్, ముఖానికి చల్లగాలి తగిలింది. ఏదో స్పర్శ. మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇంకేముంది, ఆకలికి ముఖం మీది పూలు, మెడలో పూల హారం తింటూ గుర్రం కనిపించింది. సలీం కి పిచ్చి కోపం వచ్చింది. కానీ ఏం చేయగలడు.
రెండు సార్లు కింద పడడంతో వాచీ రెండు ముక్కలు సెల్లు రెండు చెక్కలయ్యింది. టైం ఎంతయ్యిందో తెలియట్లేదు. మెల్లగా గుర్రమెక్కి బయల్దేరాడు.. మసక వెలుతురులో దూరంగా ఇంకో గుర్రం కనిపించింది. ఏమిటీ వింత, పెట్రోలు ధరలు పెరగటంవల్ల అందరూ గుర్రాలే వాడుతున్నారా? అనుకున్నాడు. మెల్లగా ఆ గుర్రం దగ్గరయ్యింది. దానిమీద చిరిగిన షేర్వానీతో, నలిగి వాడిపోయిన పూలహారంతో ఓ ఆకారం. అర్థమయ్యింది, ఆ ఆకారం కూడా తనలాగే ఓ పెళ్లి కొడుకే. సలీం తానె పలకరించాడు. "భాయ్ సాబ్, కల్ సే పరేషాన్ హూ. ఆసిఫ్ నగర్ కా రాస్తా బతాయియే మేరీ నిఖా హై. ఆయ్ రే. మియాన్, ఖాలి ఎక్ దిన్ కూ ఇత్నా పరేషాన్ హోరై. మై తో చార్ దిన్ సే భటక్ రహా హూ. బారాత్ భీ గయీ, దుల్హన్ భీ గయీ.
"ఏ హైదరాబాద్ కీ ట్రాఫిక్ హై భాయి, జరా సంభల్కే చలో"
June 2012 "ఆశ" మాస పత్రికలో ప్రచురితం..
June 2012 "ఆశ" మాస పత్రికలో ప్రచురితం..
హైదరాబాదీ షాదీ హై యా మజాక్? బహుత్ ఖూబ్ కహా......
ReplyDeleteఆప్ కో యహీ బాత్ పే తాలియా ఫాతీమాజీ:-):-)
షుక్రియా పద్మాజీ, ఆప్ కో పతా హోగా హైదరాబాదీ కా షాదీ కైసా హోతా.
Delete:) :)
ReplyDeleteట్రాఫిక్ భూతం పై కొరడా ఝుళిపించారు.
"సేహేరా" ఇబ్బందులని.. ఎందుకు వస్తాయో తెలియని నగర జీవనం లోని ఇబ్బందులని చక్కగా ఇమిడ్చి చెప్పారు.
చాలా బాగుంది. అభినందనలు.
వనజ గారూ, ధన్యవాదాలు. నా కథ చదివిన మీకు.
Deleteవనజ గారూ నగరం లోని ట్రాఫిక్ ఇబ్బందులు, ఎంత భయకరమైనవో.. ఎంత చెప్పినా తక్కువే. అది భాగ్యనగర ద్విచక్రరధసారదులకే ఎరుక.
Deleteఅబ్బ! నవ్వలేక చచ్చానండి. :) :) :) :) :)
ReplyDeleteసర్ థాంక్స్. కథ నచ్చినందుకు,. బ్లాగ్ ధర్శించిననదుకు.
Delete:):):)
ReplyDeleteహహ... భలే నవ్వు వచ్చింది అండీ..
తలమీద ఎవరో ప్రేమగా నిమురుతున్న ఫీలింగ్ అనగానే వాళ్ళ వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుకున్నా...కానీ .. అది గుర్రం అని తెలియగానే నవ్వాగలేదు...
సాయిగారూ, ధన్యవాదాలు, కథ నచ్చిందుకు. ఇప్పుడున్న బిజీ జీవితంలో సమయం వెచ్చించి కథ చదివిన మీకు ధన్యవాదాలు.
Deleteఏం బిజీ లేండి.. ఎంత బిజీ గా ఉన్నా ఇలాంటి మంచి పోస్టులు పోగొట్టుకుంటే ఎలా ?
Deletemee abimaanaaniki thanks saayigaaroo.
Deleteనగర ట్రాఫిక్ ఇబ్బందులను పన్నీగా చెప్పారు. ఫోటో కూడా బాగుంది. అభినందనలు పాతిమా గారు!
ReplyDeleteనాగేంద్ర గారూ, కథ చదివిన మీకు ధన్యవాదాలు. పెద్ద కథ అయితే సమయం వెచ్చించ లేరని చిన్నగా రాసాను, నా ప్రతి పోస్ట్ ఓపిగ్గా చూస్తున్న మీకు కృతజ్ఞతలు.
Deletesuper andi, manch kathanam, keep writing.
ReplyDeletethank you.
భాస్కర్ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు. బ్లాగ్ చూస్తున్న మీకు కృతజ్ఞతలు.
Deleteआपके हैदराबाद में ऐसा भी होता है क्या?...:-))
ReplyDeleteహైదరాబాద్ ట్రాఫిక్ గురించి కళ్ళకి కట్టినట్లు చూపించేసి పొద్దున్నే
కడుపుబ్బా నవ్వించేసారు...:-))
హాస్యం తొణికిసలాడింది మీ రచనలో...
ఇలాంటివి వ్రాస్తూ ఉండండి ఫాతిమా గారూ!
@శ్రీ
సర్, నా ప్రతి పోస్ట్ చదివి నన్ను ప్రోత్శాహించే మీకు ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా రాయటానికి ప్రయత్నిస్తాను.
Deleteచాల బాగుంది. చక్కనైన హాస్యం.
ReplyDeleteరమేష్ బాబు, గారూ కథ నచ్చినదుకు, థాంక్స్, బ్లాగ్ దర్శించిన మీకు మరోమారు కృతజ్ఞతలు.
Delete:) :)
ReplyDeleteఫాతిమా గారు, భలే ఉంది. భలే రాసారు ..నావ్వు ఆగడం లేదు...
ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరాయన్నమాట..భలే ఉంది :)
Deleteసీత గారూ, మీకు హాస్య కథ నచ్చినందుకు ధన్యవాదాలు. ఇద్దరి పెళ్లికుమారుల భాదలు చూసారు కదా, కనుక ఎవరైనా హైదరాబాద్ లో పెళ్లి అంటే ఆలోచించాలి ఏమంటారు ?
Deleteఏమంటాను ఫాతిమా గారు, ఇంత చెప్పాక..నిజమే అంటాను.
Delete:)
చతుర హాస్యపు తొలకరి జల్లు కురిసి
ReplyDeleteతడిసి ముద్దైతి మమ్మ,సంతసము గల్గె -
ఫాతిమా గారిలో హాస్య పార్శ్య మొకటి
కడు సమర్థ మంత మగుచు గాను పించె .
----- సుజన-సృజన
మాస్టారూ, మీకు నా హాస్య కథ నచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
Deleteహాస్యం బాగా కుదిరింది.
ReplyDeleteఆకలేసిన గుర్రం తినడానికి పనికొచ్చాయి పెళ్ళికొడుకుకి
అలంకరించిన పూలు!
బారాత్ కి ట్రాఫిక్ జాం కి భలే
ముడిపెట్టారు!
ఇంకా ఇంకా రాయండి.
సర్, హాస్య కథ నచ్చినందుకు ధన్యవాదాలు. సమయం వెచ్చించి చదివినందుకు కృతజ్ఞతలు.
Deleteమీ భావాల ఇంద్రధనస్సులో మరో వర్ణం..అభినందనలు ఫాతిమాజీ...
ReplyDeleteవర్మగారూ, ధన్యవాదాలు నా హాస్య కథ చదివిన మీకు.
Deleteసమస్యను సున్నిత హాస్యంలో దాచి చెప్పారు. బాగుంది.
ReplyDeleteసర్, నా బ్లాగ్ దర్శించిన మీకు నా ధన్యవాదాలు. సమస్యను ఎలాగో తెలియజేయాలనే నా ప్రయత్నాన్ని గుర్తించారు. థాంక్స్.
Deletemast mast hai saleem ki shaadi:)
ReplyDeleteshukriyaa aniketjee aap ko saleem kaa shaadee pasand aayaa
ReplyDeleteబాగా రాశారు ఫాతిమ గారూ...హైదరాబాద్ ట్రాఫిక్ మీద.
ReplyDeleteఇదివరకూ కామెంట్ పెట్టామే, చేరలేదా?
చిన్ని ఆశ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు. ఇదివరకు మీరు ఇచ్చిన కామెంట్ చేరలేదు. మీ కామెంట్ లేని పోస్ట్ అసంపూర్ణమే.
ReplyDeleteఇదెలా మిస్స్ అయ్యాను నేను అసలు? భలే రాసారండి..
ReplyDeleteచాలా బాగుంది.
నేనూ ఎదురుచుసాను మీ కామెంట్ కోసం, నెచ్చలికి నచ్చలేదేమో అనుకున్నాను. వెన్నెల గారూ కథ ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదాలు.
ReplyDelete