Pages

Friday, 29 November 2013

బాల్యం     బాల్యం  

        అందమైన  ముంగిట్లో   తిరుగాడాల్సిన  తువ్వాయి,
      సౌధాల సోపానాల నెక్కే  సిమెంటు  తట్టవుతుంది. 

      పున్నమి పుప్పొడిలాంటి  జాబిలికూన,
      శ్రమజీవై  మసిచేతులతో  మురికితేలుతుంది. 

      చిట్టి రెక్కలతో  ఎగరాల్సిన చిన్ని పావురం,
      రాబందుల ముక్కులకు రక్తపు ముద్దవుతుంది. 

      బాలకార్మిక  జీవనం భారంగా మారుతుంది,
      బతుకు బరువై  భవితలేకుండా  పోతుంది. 

     రూకల  మూటలుంటేనే  బడి తలుపు తెరిచేది.
     నూకలు కూడాలేని  ఈ బడుగులకిక  చదువేది?  

     "అ,ఆ" లు కాదు ఆకటిరాతలు  రాస్తున్నారు.
     మద్యాహ్న బువ్వుంటేనే  బడి వంక  చూస్తున్నారు. 

     అందుకే ..... 

     బుడతలకు  బువ్వతోపాటు  నవ్వుల  ఎరవేద్దాం,
     బుజ్జగించి,  బులిపించి  అక్షరాల  వలవేద్దాం.  

     వారిచేతనే  బంగరు  భవితకు   బాటవేయిద్దాం,
     బాటకడ్డుగా  ఉన్న  ఆకటి  కూకటివేళ్ళను తోలిగిద్దాం.   

Thursday, 28 November 2013

(ప) రాయిగా మారిన నా ప్రేయసి


(ప) రాయిగా  మారిన  నా ప్రేయసి

నన్ను చూస్తూనే  
వెలిగిపోయే.. ఆ కళ్ళు,
నా ప్రేమ వాకిళ్ళు ..


వాలిపోయే పొద్దులో,
నాకోసం ఎదురుచూస్తూ,
నా అరికాలి గుర్తులు ముద్దాడే... నా ప్రేయసి.


గాయాల పూదోటలో,
సోమ్మసిల్లిపోతూ, నాకోసం,
విరహ గీతం పాడే...నా ప్రేయసి.


శిశిరఋతువులో,
వసంతాన్ని ఆహ్వానిస్తూ,
కలల పచ్చిక తివాచీ పరచిన..నా ప్రేయసి.


పెను తుఫానులో,
చిగురుటాకులా లేలేత ప్రాయాన్ని,
విరహ వేదనలో త్యజించిన....నా ప్రేయసి.


దూరాన ఉన్నా,
తన తేనెల మాటలతో,
నా గుండెలో వలపు ఊయలలూగే..నా ప్రేయసి.


ఊసుల, ఊహల మద్య,
నా కోసం ఊపిరి నిలుపుకొని,
నన్ను చూడాలనుకొనే నా ప్రేయసి.


నిత్య సమస్యల నడుమ,
సతమత మయ్యె,
రెక్కలు తెగిన విహంగం..నా ప్రేయసి.


నా శ్వాసను శాసించి ,
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసి,
నన్ను పిచ్చివాణ్ణి చేసిన నా ప్రేయసి.

Wednesday, 27 November 2013

ఆతని రాకకై...

           ఆతని రాకకై... 

      ప్రతిరాత్రీ  కన్నీటి జ్ఞాపకాలతో, 
      కన్నీటి కడలిని  దాటే యత్నం  చేస్తుంది. 

      కలువభామ  సాక్షిగా ఆతని వీక్షణాలకై..,
      నీటిబిందువై   ఎదురుచూస్తుంది.

      దిగంతాల ఆవలున్న  ఆతని  కరచాలనానికై..,
      ఆర్తిగా తన  చేయి చాస్తుంది. 

      నీడ  సైతం   వెన్నంటిరాని  ఏకాకితనంలో..,
      పలకరింపుకై   పలవరిస్తుంది. 

      అందుకోలేని  ఆ అపురూప   పెన్నిదితో  సన్నిదిని..,
      సశేషంగానే   సరిపెట్టుకుంటుంది. 

      ఆకాశమే అవనికి  దిగివచ్చి  అభయమిస్తుంటే..,
      తనకు తోడుండమని  వేడుకుంది. 

      చీకటి హృదయాన వెలుగు నింపిన దినకరుని..,
      ఆగిపోమ్మని  ఆశగా  అర్ధించింది.

      కానీ..,

      జగత్సంచారిని   బంధించటం  సాద్యం కాదని...,
      బాదగానే  వీడ్కోలు పలికింది. 

      ప్రతి ఉదయం  పలకరించే  ఉదయుని  స్పూర్తితో,
      పరుల  సేవకై   శ్రీకారం  చుట్టింది.

      చీకటి చిట్టిచేతుల్లో  చిరుదివ్వెనైనా  కావాలని..,
      అక్షరకిరణమై  అంకితమయ్యింది.      

 


Tuesday, 26 November 2013

చూపు


     చూపు 


    నీ వాలు  చూపుల  గాలం 
    నా  గుండె  కవాటానికి,
    చిక్కుకుంది. 

    నీ  ఓరచూపుల  సోయగం,
    నా  మన:మందిరం,
    చేరుకుంది,

    నీ  చిలిపి చూపుల  చక్కదనం,
    నా  వలపు వాకిట,
    విరిసింది. 

    నీ  సోగచూపుల  సౌందర్యం,
    నా  ఎదముంగిట,
    పరచుకుంది. 

    నీ  ఆర్తి చూపుల  కోమలం 
    నా  ఆశల  దోసిట,
    నిలిచింది 

    నీ  కాటుక  చూపుల  కలికితనం,
    నా  మది  భావాలను,
    మీటింది. 

    నీ  మాలిమి  చూపుల  మంచితనం,
    నా  తీపి పలుకులను,
    మాల కడుతుంది. 

    నీ  దొంగ  చూపుల దోపిడితనం
    నా మనసు  మర్మాలను 
    వెతుకుతుంది. 

    నీ  అలక  చూపుల అల్లరితనం,
    నా  దాహార్తిని,
    దాచేస్తుంది. 

    నీ  కరుణ చూపుల కమ్మదనం 
    నా  ఆశయాలకు,
    బాట వేస్తుంది . 

    నీ  స్నేహ  చూపుల  చల్లదనం,
    నా  జీవితాన్ని,
    నీకంకితం  చేస్తుంది
Monday, 25 November 2013

మాట తప్పను.
      మాట తప్పను. 

       రెక్కలు తెగిన  పావురం చీకటి గూటిలో,
       శిక్ష కోసం సిద్దపడుతూ..,  
 
       తగలబడ్డ   ఎన్నో స్వప్నాల  నివురులో,
       తనని  తానే వెతుక్కుంటూ..,

       అక్షరాల  అగాధాల  మద్య  ఇరుక్కున్న, 
       భావజలధిలో  స్నానిస్తూ..,

       చిరుజల్లులో  చీరకుచ్చిళ్ళ  జీరాడు ఆటలో..,
       ఆత్మీయ   స్పర్శకై   ఎదురుచూస్తూ ..,

       ఆకాశము నుండి  నేరుగా తన ఒడిలో  
       జారిపడిన మేఘాన్ని ముద్దాడుతూంటే.., 

       ఉరకలెత్తి,ఉద్రేకించే  తడికళ్ళపై  వెచ్చటి ముద్రలా..,
       వెలుగునిచ్చిన   ఇనబింభమై ..,

       మూగ కంఠాన్ని నిమిరి మదుర గానాన్నినేర్పిన,
       కోకిల రాజమై .., 

       మోడువారిన  హృదయాన్ని  చిగురింప జేసే,
       ప్రేమ మంత్రమై .., 

       మనసున్న మంచి  నేస్తమా,నీ పలకరింపుతో,
       నాలో బ్రతాలనే  ఆశను  రానీకు, 
                      
                             ***
       సజీవ జ్ఞాపకాల మీదుగా పయనించే  ప్రాణమా..,
       నిర్దయగా..నిష్క్రమించకు.  

       సహచరునితో   ఓ  చిన్నిమాట  చెప్పివస్తాను,
       అంతరకూ ఆగి చూడు,
       మాట తప్పితే... వేటాడు.     

 

Saturday, 23 November 2013

హితుడా....

      

      హితుడా.... 

       జీవితంలో కోతకు  గురవుతుంటే... 
       అరుదెంచిన స్నేహితుడా.. 

       రెక్కల  గుర్రాన్నెక్కి  గగనాన  ఊరేగుతుంటే..
       వాస్తవ కళ్ళాన్ని  అందించిన  మిత్రుడా.. .... 

       దు:ఖపు  సంద్రాన   దిక్కుతోచక  వెక్కుతుంటే.... 
       చుక్కానిలా  దారిచూపిన  నావికుడా..

       అహింసా వాదాన్ని   తలకెత్తుకుంటే.... 
       సరయినదే అని  సమర్ధించిన  అభినవ బుద్దుడా... 

       ఆత్మీయుల  కోసం  అలమటిస్తుంటే..,
       ఆత్మబంధువు  నేనే అని పలికిన శ్రీకరుడా.. 

       పరిత్యజించిన  అనుభవ జ్ఞాపకాలన్నీ  వెన్నాడుతుంటే.. 
       అమ్మలా  అక్కున చేర్చుకున్న ఆత్మీయుడా... 

       గువ్వగానో.., గులాబి పువ్వుగానో..,నవ్వుగానో..,నడిచే దివ్వెగానో..,
       నా అక్షరాన్ని మలచి  నీకు  అంకితమిస్తాను. Friday, 22 November 2013

రాయికన్నా రాయివి నీవు కసాయివి నీవు.

రాయికన్నారాయివి నీవూ....కసాయివి నీవు.           నిదురలేని  కన్నులను  కలవర పరచే
       కలవు నీవు. 

       చేయని నేరానికి దోషిని  చేసి సంజాయిషీ అడిగే 
       సహవాసివి నీవు. 

       సలపని పోరులో, తెలియని  వైరంలో గెలిచిన,
       భీరువు నీవు. 

       తొణికిన మనస్సునీ,వణికే హృదయాన్నీ అపార్దం చేసుకున్న,
       అసురుడవు నీవు. 

       ప్రేమ సందేశాన్ని  అందించే కపోతాన్ని  కాళ్ళు నరికిన 
       వ్యాధుడివి(బోయవాడు)  నీవు. 
       కల్మషమెరుగని  కన్నీటికి   కూడా  కరగని రాయివి ,
       కసాయివి నీవు. 
Thursday, 21 November 2013

పేగు బంధాలు      పేగు బంధాలు 


        కనురెప్పలు   విప్పక ముందే..,
                   పొత్తిళ్ళను వీడక ముందే..,

       ఉమ్మనీరు  ఆరక  ముందే...,
                   అమ్మ స్పర్శ  తమీ తీరక ముందే..,

       చనుబాలు  రుచి చూడక ముందే...,
                   చిట్టి  పిడికిలి  వీడక ముందే...,

       ఉదయపు  వెలుగు  అవనిని  చేరక ముందే..,
                   వినిపిస్తుంది  మనకి  ఓ  రోదన.  

       తొమ్మిది   నెలల  కలలపంట   నేలపాలై...,
                    ఒంటి నిండా మట్టి పులుముకొని మలినమై.., 

       వీధి శునకాలకు   ఆకటి  ఎరలై..,
                     నెత్తుటి  ముద్దలైన అనాథ  వార్తలై..,

       మరుగున పడుతున్న మానవీయతను  ప్రశ్నిస్తూ..,
                      చెత్త కుప్పలనే  చరిత్ర  పుఠల్లా  నిర్మిస్తూ..,

       గుప్పెడు  మాతృ ప్రేమకై   గుండెలు మండేలా..,
                       అల్లాడుతున్న  మరో కర్ణుని  కన్నీటి  కేక.  

Wednesday, 20 November 2013

Smt Meraj Fathima At Kavisangamam series 4

కవిసంగమం సదస్సులో నా ప్రసంగం.... 

Monday, 18 November 2013

నీకు తెలుసా..?
    నీకు తెలుసా..?

       రేయి గడుస్తుంది నిశ్సబ్దంగా ... 
     తెల్లవారుతుంది అంటే సహజంగా .. 

     ఇహానికీ, పరానికీ మద్య  సాగుతున్న,
     తరాల, (అంతరాల)  వాదనలలో...

     అహాల, అంతస్థుల నడుమ నలిగే జీవితంలో..,
     అస్థిమిత, అంధకార ఆలోచనా తరంగాలలో,

     నేర్పుగా తనను  నడిపించే చెలికాని,
     చేయి అందుకోవాలని చూస్తూ... 

     అగాధాల  అంచుల్లోకి, అంధకార పాయల్లోకి,
     గమ్యమెరుగని  నావలా  అలలపై జారుతూ, 

     మరోమారు గమ్యం కోసం, 
     అతుకు వేసుకున్న  బతుకులో.... 

     ఆమె  మిగిలిపోయింది, ఒంటరిగా  మిగిలిపోయింది.  
Saturday, 16 November 2013

షరా... 2

షరా... 2 


  ఈ రోజెందుకో   పొద్దుటి   బెడ్ కాఫీలూ  లేవు, శ్రీమతి గారి   గాజుల గలగలలూ  వినిపించటమూ  లేదు.

వాకింగ్ నుండి వస్తూనే...  వంటింటి ఘుమ,ఘుమలను  ఓ సారి ఆస్వాదించి, స్నానానికి వెళ్ళటం  శేఖర్ కి అలవాటు కానీ, ఇల్లంతా  నిశ్శబ్దం గా  ఉంది. 

కూతురు  చిట్టి తల్లి  మాత్రం, జుట్టు విరబోసుకొని  రిబ్బన్లు  చేత బట్టుకొని ఈ భవసాగరం ఈదటం ఎలాగా  అన్నట్లు దిగాలుగా కోర్చునిఉంది. 

"ఎరా చిట్టితల్లీ, అమ్మ  జడలు వెయ్యలేదా?"  అనునయంగా అడిగాడు శేఖర్.  కోతుర్ని. 

" లేదు నాన్నా అమ్మ లేవలేదు  ". దిగులుగా జవాబిచ్చింది పాప. 
అరె,రే  అనుకొంటూ బెడ్ రూం దగ్గరికెళ్ళాడు. 

" సరూ .."  ముసుగు తన్ని పడుకున్న ఆమెని మెల్లగా లేపాడు. 

" ఊ.. ఏంటో చెప్పండీ, పొద్దున్నే బాత్ రూం  పడి  నడుం కాస్తా విరిగినట్లుంది   నేను లేవలేను, ఆ కాఫీ ఏదో మీరే పెట్టుకోండి "  
అనేసి మరికొంచం బిగుసుకు పడుకొన్నది  సరోజ.  

" అయ్యో కాఫీ కోసం కాదురా , పాప కి జడా అదీ, ఎలా.." మాట పూర్తీ కాక ముందే  దుప్పటి విసిరేసి లేచి కూర్చుని,

" ఇదిగో చూడండీ, అలవాటు లేకపోతే ఎలాగో తిప్పలు పడుతుంది,"  "నేనూ  మనిషినేగా ఎంత చాకిరీ అని చేయాలి" 
అంటూ శివాలెత్తి పోయిన్ది. 

ఏమైంది  తనకి, ఎప్పుడూ  ఇలా పడుకున్నది లేదు.  అనుకుంటూ  మెల్లగా బ్రష్  చేసుకొనేందుకు వెళ్ళాడు. 

పాపని దగ్గరికి పిలిచి  జడ వెయ్యటం మొదలు పెట్టింది. 

"ఏమి బతుకో పాపిష్టి బతుకు, ఒక అచ్చటా లేదూ  ముచ్చటా లేదూ"  ఎప్పుడూ  ఇంటి చాకిరీతోనే సరిపోయింది,"

"ఇప్పుడేమయిందే , ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా చెప్పూ  తీసుకెళ్తాను" చాలా కూల్ గా  అన్నాడు  శేఖర్,

" ఆ అదొక్కటే తక్కువ నా బతుక్కి," విసుగ్గా అంటూ పిల్ల తలలో రిబ్బను  గట్టిగా ముడిపెట్టి  పిల్లని ఒక్క తోపు తోసింది  ముందుకి. 

"ఇంతకీ ఏమంటావ్  సరూ "

" ఏమంటే  ఏముందీ, ఆరుస్తారా, తీరుస్తారా?"

"అడగవోయ్ ", నవ్వుతూ అన్నాడు  శేఖర్. 

"ఆ  మా అమ్మ అడిగి, అడిగి అలసి పోయింది, ఇక నా వంతు  కాబోలు ... " వెటకారం ధ్వనించింది  ఆమె గొంతులో. 

" ఏంటిరా అది , నాకు గుర్తు లేదు మళ్ళీ  అడుగు  తీర్చకుంటే చూడు."   అభయం  ఇచ్చే వానిలా అనేశాడు. 

" ఇదిగో కాదన కూడదు"  కొంటెగా అడిగింది. 

" అబ్బే మాట తప్పేదే లేదు. "  గొప్పగా అనేశాడు. 

"ఏమీ లేదండీ...  అమ్మా , చెల్లీ దాని పిల్లలూ, మన పిల్లలూ  కలసి  మహా బలిపురం   వెళ్దాం  అనుకున్నాం కదా.. " (ఎప్పుడబ్బా అనుకున్నాడు మనస్సులో )

" ఆ.అ.. గుర్తొచ్చింది,"    తల ఆడించాడు శేఖర్ . 

" రేపటి నుండి చిట్టి తల్లికి హాలిడేస్, నేనూ  అదీ వెళ్తాము, మీరు లీవ్ వగైరా చూసుకొని రండి, సరేనా " ఒప్పించే పద్దతిలో అడిగింది. ( అడగటం ఏమిటీ ఒప్పించేసింది  కూడా )

                                                                 ***

పొద్దున్నే  శ్రీమతినీ, పాపనీ  ట్రైన్   ఎక్కించే హడావిడిలో  ఉండగా, తన తల్లి నుండి  ఫోన్  వచ్చింది శేఖర్ కి. 

" ఒరే నానా , నిద్ర లేచావా ? "

"ఆ...   అమ్మా చెప్పు", 

" ఏమి లేదురా, అన్నయ్యా వాళ్ళు, టూర్  వెళ్తున్నారు కదా,"

" ఆ  చెప్పినట్టున్నావ్  అయితే ఏంటి?"  కాస్త చిరాకేసింది  ఈ టైంలో  పోన్  చేసి ఇంత  తాపీగా  మాట్లాడుతుంటే. 

" ఏమి లేదురా కన్నా, మరి నేనిక్కడ ఒంటరిగా  ఉండలేను కదా, 
నన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తానన్నావు కదరా.. వెర్రి సన్నాసీ..  మరచి పోయావా.. , వదిన నీవు వచ్చే వరకూ వీధి గదిలో ఉండి నీవు వచ్చిన తర్వాత  గదికి తాళం వేసి పక్కింట్లో ఇవ్వమన్నది. "   ఇంకా ఆమె సంభాషణ సాగుతూనే ఉంది, శేఖర్ కి మాత్రం  ఏమీ వినిపించటం లేదు. 

వహ,  వా..  సరోజా  అమ్మ వస్తుంది అనే విషయం  నీకెంత బాగా గుర్తుందీ...., వెర్రి నాగన్నా  అని అమ్మ ఎందుకు అంటుందా  అనుకునే వాడిని.... 

(కోడళ్ళూ ....  మీ తెలివితేటలకు  జోహార్లు.  ఇదే మాట మీ కోడళ్ళ మీ చేత అనిపిస్తారేమో..)   


 Friday, 15 November 2013

షరా....


షరా..
అది పదహారోసారి  మంగమ్మకూర రుచి  చూడటం. సాయంత్రం  నుంచీ  కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బైటకీ  తిరుగుతూనే ఉందామె  సాయంకాలం 5 గంటలవుతుంది.  

ఆమె భర్త చంద్రం వీధి చివర మలుపులో సైకిల్ మీద స్తూ కనిపించాడు. అంతే గబ,గబా ఇంట్లోకి వచ్చి మట్టిగోడకి తగిలించిన చిన్ని అద్దం పెంకులో ముఖం చూసుకొని బొట్టు సరిచేసుకుంది,

ఆయనకి తొందరగా అన్నం పెట్టేసి,సినిమాకుతీసుకెళ్తానని నిన్నరాత్రి తనతో చెప్పిన విషయం గుర్తుచెయ్యాలి అనుకుంది మంగమ్మ (ఆతగాణ్ణి ఏమాత్రం విసిగించకూడదూ అనుకుంది కూడా) 

చిరునవ్వుతో గుమ్మం లో నిల్చుంది.

" ఏంటే అడ్డంగానిల్చున్నావ్? కాస్తా చిరాకు ద్వనించింది చంద్రం గొంతులో. 

 "హి,హీ ఏమీ లేదు ఈరో గారేంటోఉషారుగా వస్తుంటే."నవ్వుతూ అడ్డుతొలిగింది.

"ఏడిసినట్ట్టుంది,ట్రాపిక్కులో సైకిలు తొక్కుకొని ఒచ్చేసరికి పాణం పోతుంది"విసుగ్గా అన్నాడు. 

" ఏడినీళ్ళు పెట్టాను తానం చేసిరా అన్నం వడ్డిత్త్తా, కూరేంటో తెలుసా.నీకిట్టమైన కోడిగుడ్ల పులుసే, "                     నవ్వుతూ హడావిడి పెట్టింది మంగ. 

                                           *** 
చంద్రం అన్నం కూరా కలుపుతూ ఉన్నాడు. మంగమ్మ  పైట కొంగుతో విసురుతుంది.... 

" అబ్బా.. కూర ఎంత బాగుందే,"  ఒసే...  మంగీ నీ చేతి వంట అమృతమే.. "

" ఇదిగో..  ఒక్క ముద్ద తిను, "  ముద్ద కలిపి గోముగా తినిపించబోయాడు  చంద్రం. 

" అయ్యో నువ్వు తిను బావా.."మొకమాటంగా  తిరస్కరించింది. 

 " ఒక్క ముద్దే  నా చేత్తో  తిను ".  బుజ్జగించాడు. 

"నీకు బాగుందంటే అదే  పదేలు, కడుపునిండా తిను బావా.. " సంబరపడిపోయింది మంగమ్మ. 

 " ఏదీ  ఆ..అను.."   ముద్ద నోటిదగ్గర పెట్టాడు చంద్రం.
 " ఆ... " నోరు తెరిచింది మంగమ్మ. 

 " ఒసేవ్, నీళ్ళేయే..ఆ పరద్దేనమేందే...   నొరుతెరుచుకొని చూస్తున్నావేంటే ? గా..ట్టిగా                                   అరుస్తూ చిందులేస్తూ పీటని ఒక్క తన్ను తన్నాడు  చంద్రం.
తుండు విదిలించి  భుజం మీద వేసుకుంటూ.. 
    
" ఆ కూరలో ఏందో తక్కువైందీ, ఇంకేందో ఎక్కువైందీ..  అయ్యేందో  కలుపుకు తిని  ఎర్రి మొఖమా.. "                   అంటూ వీధి వాకిలి దాటాడు సదరు పతి దేవుడు.

కూర చట్టి   ముందు  మంగమ్మ ఎంత సేపు కూర్చుందో...    

  

  
                            '

Tuesday, 12 November 2013

అల్లరి

        
      అల్లరి 

          అలసిపోయి ఇంటికొస్తానా.. 
        అలిగి  ఏ మూలో నక్కి ఉంటావ్. 

       అన్నం   తినననే నీ మంకుపట్టూ,

       అందరూ  తిట్టారనే   నీ  కంప్లైంటూ..,

       హడావిడిగా  ఉండే    నా  పని  వేళలూ.., 

       నా గది ముందు తచ్చాడే   నీ అడుగులూ..,

       స్నానం   చేయననీ, మంచం  దిగననీ..  నీ మొరాయింపూ,

       వీది, వీధంతా   నీమాట   వినలేదనే   నీ  దబాయింపూ, 

       జేబులోని   చిల్లరంతా   నీదేననే  గద్దింపూ ..,

       వీధి  చివరి  దుకాణం  వరకూ  తీసుకెళ్ళమనే  అర్దింపూ..,

       నిన్నుతప్ప  ఇంకెవరినీ  దగ్గర  తీయరాదనే మొండితనం,

       నన్ను   ఒక్కఅంగుళం   కూడా  కదలనివ్వని   నీ పంతం. 

       నీ చుట్టూ  ఇందరున్నా..ఎవ్వరూ లేరనుకొనే  ఒంటరితనం, 

       సంతానాన్ని మాత్రమే  గుర్తించే అమ్మతనం. 

      

       ( వయస్సు  మీదపడి  మతిలేని  ఎందరో  తల్లులు  చేసే  అల్లరే ఇది,
      మన  అల్లరిని  ముద్దుగా  భరించిన వారి అల్లరిని బాధ్యతగా  భరిద్దాం)  

Monday, 11 November 2013

ఆమె వెళ్ళిపోయింది

     ఆమె వెళ్ళిపోయింది 


            ఏనాటి బంధమో  పూవుకీ,తావికీ,
      స్వాగతం పలికినట్లు ఆమెనూ స్వాగతించింది  వనం. 

      శిశిరాన్ని రుచి చూసిన ఆమెకు,

      ప్రేమగా  వసంతాన్ని వడ్డించిది. 

      చిగురులు మేస్తూ ఆమె   కూనిరాగం తీసింది,

      కరకు చెరలు వీడి  ఊయలలూగింది. 

      గంతులేసే  మనస్సు  ఒక్కసారిగా,

      ఉత్సాహంతో  హొయలు పోయింది. 

      పూల  పలుకులకు  పరవసించే  వసంతుడు,

      మారిన  ఋతువులకు  పారిపోయాడు,

     అందుకే ఆమె వెళ్ళిపోయింది. 


     ఆలోచనా  తరంగాలపై  అవదుల్లేని లోకాలకు 

     ఆమె వెళ్ళిపోయింది. 

     ఆప్యాయతల, అనుబంధాల  కోసం ఎదురుచూస్తూ  చెకోరమై ,

     ఆమె ఎగిరిపోయింది. 

     ప్రియరాగానికై   తపిస్తూ... వలస పక్షిలా,

     ఆమె  వెళ్ళిపోయింది. 

     ఓ  సుందర స్వప్నమై.. , మధుర గానమై.. , 

     అదృశ్య కవనమై..,అద్భుత శిల్పమై.., అనురాగ ప్రతిమై..,
     అందని లోకాలకు  ఆమె  వెళ్ళిపోయింది  
Friday, 8 November 2013

కొత్తొక వింతే....

     

     


      కొత్తొక  వింతే.... 

     విలువలు  వలువలూడదీసుకొని,
     విశృంఖలంగా  నాట్యం చేస్తున్నాయి. 

     ఏమి తినాలో, ఎలాతినాలో  చెప్తూ... ,
     నట్టింట్లో  తిష్ట  వేసిందో  బొమ్మల భూతం. 

     అప్పుడప్పుడూ  అలవోకగా,   
     నంజుకు తింటుంది  కంప్యూటరు  ప్రేతం. 

     స్వచ్చమైన  మైత్రినని  నమ్మిస్తూ... , 
     కొత్త పరిచయాలు కుప్పలు  తెప్పలవుతున్నాయి   

     గుండె గాయాలకు  ఊరట నిస్తామంటూ... ,
     నెత్తుటి వాసన మరిగి కుత్తుక కోస్తున్నాయి. 

     చిన్న పరద్యానం కూడా  నీ ఊపిరిని ఆపేస్తుంది,
     విజ్ఞానమేమోగానీ...విషపుకోయ్యకు  వేలాడదీస్తుంది. 

     చనుబాలను  సైతం  కల్తీ చేయగల  విషవైక్రుతీ... ,
     హైటెక్ ఆలోచనా ,వంచనాలతో... వైరస్ లై ... 
     కంటికిందే   అంటుకుపోతున్నాయి. 

     మతం మత్తూ...,కులం రోచ్చూ.. కలిసి 
     మనుషులను  మాంసపు  ముద్దలను చేసి,
     నంజుకు  తింటున్నాయి. 

     సంపన్న దేశాల  సంకరజాతికి  మొలకెత్తిన మీడియా ,
     ఆ దేశాల  భోగాలను,లాభాలనూ   పెంచుతూ... ,   
     మన మేధస్సుకు   ముష్టి వేస్తుంది. 

     తిరుగుబాటు  సమయమొచ్చింది,
     మనస్సునూ, మనుగడనూ..  మార్చుకుందాం,
     అస్థిరబంధాల  నుండి  అప్రమత్తంగా  ఉందాం.  
  

  


Wednesday, 6 November 2013

ఇది ఆవేశమా?

     
    ఇది ఆవేశమా?

        

    ఎముకలు  నమిలే  ఎలుగులై .... 
     రక్తం  తాగే  జలగలై ... 
     అధిక  దరలు కబళిస్తుంటే,

     నిర్లిప్తతను  దులుపుకొనీ.. నిరాశను వదిలించుకొనీ,
     పనిలో నిమగ్నమైన రోజుకూలీ..,
     శ్రమ ఫలితానికై   చేయిచాపితే,
      
     ప్రలోభాలే లాభాలుగా నమ్మించి,
     వారానికోక్కసారి  వేతనం  ఇచ్చే  గాడిదకొడుకులు,
     వారానికొక్కసారే  తింటున్నారా....? 

     రెక్కాడితేగానీ  డొక్కాడని  దీనులను ,
     మురికి వాడలు   తమ  ముద్దుబిడ్డలను  చేసుకొని,
     రోగాల  రగ్గులు  కప్పుతున్నాయి. 

     ఆనందం  వెతుక్కొనే  నెపమో, 
     సమస్యల నుండి   జారుకొవటమో,
     సగటు  మనిషి సారాయి సంద్రాన  మునుగుతున్నాడు. 

     కులమతాల కోటాలో కుమ్ముక్కై,
     అసమర్దులే  అందలం  ఎక్కుతుంటే,
     నిరుద్యోగి  ఎర్రగా  చూడటంలో  వింతేముందీ..?  

     ముఖాలపై ముసుగులు తీయటం లేదు,
     మూర్కపు జనాన్ని మత్తులో  ముంచుతున్నారు,
     జనం మేలుకుంటే  ఎప్పుడో  ఓట్ల  తూటాలకే,
     ఎన్కౌంటర్  అయ్యేవారు. 

     ఆశల, ఊహల,  అనాలోచితా  దారుల్లో,
     అందరమూ ప్రయాణిస్తున్నాం,సమాంతర  రేఖలమై..,
     అవును , ఎప్పటికీ  ఒక్కటి కాలేకపోతున్నాము. 

     

     
,
   


Monday, 4 November 2013

రోగం

            రోగం 

       పచ్చని ప్రాణాన్నిచప్పరించి  
       పిప్పిచేసేదే రోగం.
       చెట్టంత మనిషిని  ముప్పెనలా 
       ముంచేదే రోగం.

       కలల నుండీ, జీవన అలల నుండీ 
       తోసివేసేదే రోగం,
       కుటుంబం నుండీ,ఇంటినుండీ 
       దూరంగా నెట్టేదే రోగం.

       మంత్రాల,తంత్రాల  నమ్మకాల, 
       నిచ్చెనెక్కించేదే రోగం.
       తాయత్తుల, దిగదుడుపుల,బూడిదలకు 
       గంగిరెద్దును చేసేదే  రోగం . 

       పిడికిట్లో  పిచ్చికపిల్లవైనా,
       గూటిలో గువ్వపిల్లవైనా,
       వాకిట్లో గండుబిల్లిలా  పొంచి , 
       నిన్ను నోట కరచుకొనేదే రోగం 

       పడుకున్న మంచమే లోకంగా,
       చమట శరీరమే దుప్పటిగా,
       నీకు నీవే  గొంగళివేమో  
       అనిపించేలా  చేస్తుందీ రోగం. 

       ప్రపంచమంతా అంధకారంగా, 
       రంగులన్నీ మసిపూసుకున్నట్లుగా,
       నీ కళ్ళముందు చీకట్లు పులిమి 
       అంధుని చేసి  ఆనందిస్తుందీ రోగం. 

       పక్షిపిల్లని పొట్టచీల్చినట్లూ,కళ్ళనుండి కనుగుడ్లు లాగి 
       కర,కర నమిలినట్లూ,
       ఎంతో మందిని  ఒంటి చేత్తో 
       ఓడించాలని చూస్తుందీ రోగం. 

       రోగం ఒక వైతరణీ...... 
       రోగం ఒక మృత్యుకుహరం,.... 
       రోగం  ఒక నిర్దయ శోకం.......  

      కానీ..... ,

       ఓ  ఆత్మీయుని కర స్పర్శకే  కరిగిపోతుందీ రోగం.
       ఓ  ఊరడింపు  మాటకే ఊరవతలకి పారిపోతుందీ రోగం.
       ఓ  చిన్ని చేయూతకే  చెంతలేకుండా పోతుందీ రోగం.Saturday, 2 November 2013

అగుపించని అంగళ్ళు

      


      అగుపించని అంగళ్ళు 

       
       రోడ్డ్డు  పక్కనే  ఓ దృశ్యం,
       హడావిడి అడుగులకు  అడ్డుగా అనిపిస్తూ,
       ఎవరికీ కనిపించదు,స్వయం ప్రకాశం కాదుగా,

       గోనె సంచిపై కొన్ని కాయగూరలు,
       సత్తుగిన్నెలో కొంత చిల్లరా,
       కష్టాల కెరటాన్ని బుజానెత్తుకున్నట్లు గాబరాగా ఓ అవ్వ,

       చుప్పనాతి సూర్యుడు  తొంగి  చూస్తాడనే బాదతో,
       వడలిపోతున్న కూరగాయలకు కొంగు కప్పుతూ,
       పచ్చని చిగుర్లు  రాల్చుకున్న మోడులా... 

       వేగుచుక్కని నొసటన అద్దుకొని వచ్చీ,
       ఎర్రటెండని అయిష్టంగా  నెత్తినెత్త్తుకొని,
       రెక్కలూడిన విసురు పురుగులా.. 

       మట్టి రోడ్డుపై ఎగసే మెత్తటి మట్టిలో,
       పొద్దు తిరుగుడులో పహారా కాసే కళ్ళతో,
       సంచిపై ఎంతకీ  తరగని  కూరగాయలతో.. 

       పొద్దుట విచ్చుకొని వెళ్ళిన ముఖాలు 
       ముడుచుకొని  ఇళ్ళుచేరే సమయం,
       పెరటి పంటను పెంట కుప్పలపై విదిల్చి,
       చెమట చెట్టుకు కాసిన శిశిర ఫలంలా... 

       మంచుపెట్టెలో నానినవి  తినే నాగరికులముందూ,,
       రంగుల అంగళ్ళ హంగులకు  సలాం కొట్టే పెద్దలముందూ,
       ఆర్ధిక వ్యవస్థలో  ఆకటి అవస్థగామారి , 
       కత్తిఅంచుపై  నెత్తుటి బొమ్మగా..... శ్యం,