Pages

Thursday 28 November 2013

(ప) రాయిగా మారిన నా ప్రేయసి






(ప) రాయిగా  మారిన  నా ప్రేయసి

నన్ను చూస్తూనే  
వెలిగిపోయే.. ఆ కళ్ళు,
నా ప్రేమ వాకిళ్ళు ..


వాలిపోయే పొద్దులో,
నాకోసం ఎదురుచూస్తూ,
నా అరికాలి గుర్తులు ముద్దాడే... నా ప్రేయసి.


గాయాల పూదోటలో,
సోమ్మసిల్లిపోతూ, నాకోసం,
విరహ గీతం పాడే...నా ప్రేయసి.


శిశిరఋతువులో,
వసంతాన్ని ఆహ్వానిస్తూ,
కలల పచ్చిక తివాచీ పరచిన..నా ప్రేయసి.


పెను తుఫానులో,
చిగురుటాకులా లేలేత ప్రాయాన్ని,
విరహ వేదనలో త్యజించిన....నా ప్రేయసి.


దూరాన ఉన్నా,
తన తేనెల మాటలతో,
నా గుండెలో వలపు ఊయలలూగే..నా ప్రేయసి.


ఊసుల, ఊహల మద్య,
నా కోసం ఊపిరి నిలుపుకొని,
నన్ను చూడాలనుకొనే నా ప్రేయసి.


నిత్య సమస్యల నడుమ,
సతమత మయ్యె,
రెక్కలు తెగిన విహంగం..నా ప్రేయసి.


నా శ్వాసను శాసించి ,
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేసి,
నన్ను పిచ్చివాణ్ణి చేసిన నా ప్రేయసి.









1 comment:

  1. "నన్ను చూస్తూనే వెలిగిపోయే.. ఆ కళ్ళు, నా ప్రేమ వాకిళ్ళు ..
    వాలిపోయే పొద్దులో, విరహ గీతం పాడి,
    చిగురుటాకువై....కలల పచ్చిక తివాచీ పరచి,
    దూరాన ఉన్నా, ఊసుల, ఊహల మద్య,
    నా కోసం ఊపిరి నిలుపుకొని,
    నా శ్వాసను శాసించి, నన్ను పిచ్చివాణ్ణి చేసి" ....అంటూ

    ఒక పురుషుడి మనోభావనల్ని
    (ప) రాయిగా మారిన నా ప్రేయసి కవిత ద్వారా చాలా బాగా రాసారు. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు

    ReplyDelete