Pages

Monday 16 December 2013

ఆ "శ్రమ" జీవి

     






     ఆ "శ్రమ" జీవి 

     ఆయన   ఓ  శ్రమజీవి.
     రవి కంటే ముందే లేచి  ఉరకలేస్తాడు 

     మట్టినేలపై  విత్తునాటి  ఆశల వలవేస్తాడు,  
     చీకటి కరువుకు  ఉరివేసి  ఆకలి తీరుస్తాడు. 

     అంతంలేని  ఆదిపత్య  పొరుల్లో,
     ఎటుకొడితే  అటుపడే బంతయ్యాడు. 

     నెత్తుటి  సంతకాల  సంతాపాలల్లో,
     కత్తులుదూసిన నేలలో విత్తులు కొనలేకపోయాడు.

     సన్నకారు  రైతులంతా సబ్సిడీలకై  చేయిచాపారు.
     అభయమిచ్చే ఫ్యాక్షన్  గోళ్ళకు గుచ్చుకుపోయారు  

     అప్పుల  జప్తులో  కట్టువిప్పుకొన్న కాడెద్దులూ,
     ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యాడు.

     భూమిని తాకని చినుకుల కోతా ,విధ్యుత్ కోతా 
     వడ్డీల మోతా ,ఆకలివాతా,....... వెరసి,

     ఎండిపోయిన  ఎముకలగూడైనాడు,
     అన్నం  పెట్టిన  చేత్తో దణ్ణం పెడుతున్నాడు. 

    అన్నదాత  నేడు  అన్నదానానికై  చేయిచాస్తున్నాడు 
     అవును ఆతనిప్పుడు, ఆశ్రమ జీవి. 







   

16 comments:

  1. రైతు లేని నాడు మన బ్రతుకు లేదనే ఇంగిత జ్ఞానం నశించిపోయి ప్రవర్తిస్తున్నారు నేతలు ఎందుకో ?

    నకిలీ విత్తనాలు ,నకిలీ పురుగు మందులు ,నకిలీ ఎరువులు .....రైతు డబ్బులు , కష్టం , శోకం మాత్రమే అసలైనవి .

    నేతల బుధ్ధి కిలుం పట్టి , నకిలీలల లీలలు నల్లపూసలై పోతున్నాయి . వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు ,మనసును తట్టినట్లు రాసారు . మాటలు చాలవు మీరజ్ .

    ReplyDelete
    Replies
    1. దేవీ, రైతుని అన్నదాత అన్నారు, కానీ ఆ అన్నానికే అలమటిస్తున్నాడీ రోజు.
      అయినా ఇక ముందు అన్నం ఉండదు,

      Delete
  2. ఇలాంటి కవితలు మీరే రాయగలరు...too good

    ReplyDelete
    Replies
    1. పద్మా మీ అభిమానానికి ధన్యవాదాలు,
      మీ కవితల్లో సున్నితత్వం నా కవితల్లో కనిపించదు.

      Delete
  3. మన కడుపుని నింపడానికి ఓ సామాన్య మయిన రైతు పడే శ్రమను క ళ్ళ ముందు
    ఎంతో బాగా చెప్పిన మీరు అభినందనీయులు ఫాతిమా జి . ఇక పోతే కళ్ళు రెండు కాస్తా చెమ్మగిల్లాయి - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. శ్రీపాద గారూ, ధన్యవాదాలు.
      నా బ్లాగ్ ని సందర్సించిన మీకు మరోమారు ధన్యవాదాలు.

      Delete
  4. ‘క’-ష్ట-జీ-’వి’కి ఇరువైపులా నిలిచేవాడే ‘కవి’ - అన్నది మహాకవి ఉద్ఘాటన.
    అలాంటి శ్రమైకజీవుల సౌందర్యాన్ని, విషాదాల్నిమీరు మరింత లోతుగా స్పృశించి, అనుభవించి, కవితా సేద్యం చేయాలన్నది మా ఆకాంక్ష!!

    ReplyDelete
    Replies
    1. నా కవితలు ఆ మహాకవిని గుర్తుతెచ్చుకోవటం సంతోషం.
      నా అక్షరసేద్యానికి మంచి ఫలితం మీవంటి వారి ప్రొ్త్సాహం వల్లే వస్తుంది తమ్ముడూ..

      Delete
  5. సహకార ఉద్యమాలు పాడి పరిశ్రమలో బాగా ఫలితాలనిచ్చాయి.
    వ్యవసాయంలో కూడా వాటిని విరివిగా వాడాలి.
    అప్పుడే సన్నకారు రైతులకు శ్రమకు తగ్గ ఫలం దొరుకుతుంది.
    ఆలోచనలను రేకెత్తించిన మీ కవిత
    హృద్యమంగా ఉంది. శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. సన్నకారు రైతులెక్కడున్నారండీ...
      అందరూ ఇప్పుడు రైతుకూలీలైపోయారు.
      మీ స్పందనకు దన్యవాదాలు సర్.

      Delete
  6. "రవి కంటే ముందే లేచి, మట్టినేలపై ఆశల విత్తునాటి ఆకలి తీర్చే వేళ .... నెత్తుటి సంతకాల సంతాపాలల్లో, కత్తులుదూసిన నేలలో విత్తులు కొనలేక సబ్సిడీలకై చేయిచాపి,
    అప్పుల జప్తులో కట్టువిప్పుకొన్న కాడెద్దులూ, ఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యి,
    భూమిని తాకని చినుకుల కోతా, విధ్యుత్ కోతా వడ్డీల మోతా, ఆకలివాతా,....... వెరసి, అన్నం పెట్టిన చేత్తో దణ్ణం పెడుతూ .... అవును ఆతనిప్పుడు, ఆశ్రమ జీవి."
    శ్రమ జీవి రైతన్న దీనస్థితిని ఎన్నో కోణాల నుంచి స్పృశించి ఆ"శ్రమ"జీవి అనే కవిత ద్వారా చక్కగా ఆవిష్కరించారు. అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు.

    ReplyDelete
  7. " అన్నదాత నేడు అన్నదానానికై చేయిచాస్తున్నాడు
    అవును ఆతనిప్పుడు, ఆశ్రమ జీవి. "

    ఇంకేమి చెప్పగలం !.... నేటి రైతు స్తితి! దుస్తితి!!

    ReplyDelete
    Replies
    1. అన్నదాతను దూరం చేసుకొని అన్నానికి దూరం అవుతున్నాము.

      Delete