Pages

Saturday, 14 December 2013

దగ్ధ గీతం

        దగ్ధ గీతం 

     జనారణ్యములో  మానవ మృగాలు ,
     ఉన్మాదాలై  ఊరేగుతున్నాయి. 

     పసికూనల లేత మాంసాలతో,
     పండగ  చేసుకుంటున్నాయి. 

     అన్యం,పుణ్యం ఎరుగని ఆడపిల్లలపై,  
     దాడిచేసి  దాహం తీర్చుకుంటున్నాయి.

     రెక్కలురాని   లేతగువ్వలను  సైతం ,
     రాక్షస గోళ్ళతో  రక్కుతున్నాయి. 

     చదువుల బడుల్లో, హాస్టళ్ళ గదుల్లో,
     లైంగిక వేదింపుల ఉపాహారాలు చేస్తున్నాయి. 

     ఆరేళ్ళ శరీరాలు నూరేళ్ళు నింపుకొని ,మార్చురీ గదుల్లో  
     శవాలై  సవాళ్ళు విసురుతున్నాయి. 

     భూబోగాతాలల్లో  నిండిన నేతలు చట్టాలకు  చుట్టాలై,
     నోట్ల కట్టల నీడల్లో  సేదతీరుతున్నారు. 

     చేవ చచ్చిన,వెన్నెముక లేని వెర్రి గొర్రెలు,
     కసాయిలను నమ్మి  కబేళాలకు తరలివెళ్తున్నాయి. 
                               
                               *****
     ఇప్పుడు మనం  చేయాల్సింది  మొండిగోడలకు,  
     సున్నాలెయ్యటం  కాదు,

     కర్కశ  ఆబోతుల  పాదాల క్రింద  నలిగే,
     ప్రకృతిని పరిరక్షిద్దాం. 

     నిస్సహాయ,నిర్భాగ్య  చెళ్ళెళ్ళ సాక్షిగా,
     అసురుల  అరాచకాలను  అరికడదాం. 28 comments:

 1. ఉద్వేగ భరితం గా ఉంది, మీ కవిత ! మీ ఆవేదన , దుష్టులకు ఒక నివేదన అయి , వారిని మారుస్తుందని ఆశిద్దాం !

  ReplyDelete
  Replies
  1. నిజమే.. కొన్ని సందర్బాలు ఉద్వేగంగానే ఉంటాయి, ఎదైనా సంఘటన జరిగినప్పుడు,
   మొన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ 5 ఏళ్ళ పాప మీద సైకో దాడి విన్నప్పటి నుండీ, మనసు తొలిచేస్తుంది.
   ప్రతి చోటా ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుంది. కొంత కాలం పోతే ఆడజాతే ఉండదేమో..
   సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 2. జనారణ్యములో ఊరేగుతున్న ఉన్మాదం
  పసికూనలు,
  రెక్కలురాని లేతగువ్వలను రాక్షస గోళ్ళతోరక్కుతూ.
  చదువుల బడుల్లో, హాస్టళ్ళ గదుల్లో, లైంగిక వేదింపుల ఉపాహారాలు.
  ఆరేళ్ళ శరీరాలు నూరేళ్ళు నింపుకొని, మార్చురీ గదుల్లో శవాలై .... అక్కడ.
  మనమేమో మొండిగోడలకు, సున్నాలేస్తూ .... ఇక్కడ,
  మరి,
  ఆ కర్కశ ఆబోతుల పాదాల క్రింద నలిగే, ప్రకృతిని పరిరక్షించేందుకు, ఆ నిస్సహాయ, నిర్భాగ్య చెళ్ళెళ్ళ సాక్షిగా, అసురుల అరాచకాలను అరికట్టేందుకు నడుం బిగిద్దామా!? అంటూ,

  ఆశావహంగా ఆలోచనల్ని రేకెత్తించుతూ ఉత్తేజపరిచే విప్లవభావనల అక్షర రూపం ఈ కవిత.
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. నేను మార్పు దిశగానే అడుగులేస్తున్నాను సర్,
   నా వల్లా కొందరు ఆడపిల్లలైనా మేలు పొందగలిగితే నా జన్మ ధన్యమైనట్లే,

   Delete
 3. we need self defense by woman..all laws made by British and pseudo democracy are of no use for safety of women....what M K Gandhi said " we can say that we got freedom when women can freely midnight in streets then only we can say we got freedom...now for get about night in broad day light woman are not able to walk freely.....any amount of laws ,hanging could not change the mind set of rouges....day by day we are going to stone age ..we must thank our T V ...Movies...social net work..........may god save my country from this menace......

  ReplyDelete
 4. you are very much correct....we need to import laws to kill this mad dogs

  ReplyDelete
 5. Thank you for response Sai Ram garu, Yes, as you opine, this can be attributed to Media, Social Media, meaningless, obscene and hero worshiped Movies where women are portraying belittled. At the same time the schools are also setting themselves aside from the responsibility of inculcating the morale in students. Of-course the role of parents, Are we not forgetting our responsibility? Are we not giving much preference to boys rather than girls and indirectly encouraging the supremacy of boys which leads to man male chauvinism.

  ReplyDelete
 6. నిస్సహాయ,నిర్భాగ్య చెళ్ళెళ్ళ సాక్షిగా,
  అసురుల అరాచకాలను అరికడదాం.
  లేవండి నడుంబిగించండీ, జాతికి జీవం పోయండి.

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా, జాతికి (స్త్రీ) జీవం పోస్తేనే,...ప్రపంచం మన్నుతుంది, లేకుంటే మన్నే మిగులుతుంది.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 7. నిజమే కదూ.
  వంత దారుణం. ప్రతిరోజూ ఏదో చోట అకౄత్యాలు!
  వయసుతో న్మిత్తం లేదు. పాశవికతకు 'ఆడా
  అన్న శబ్ధం చాలు. 'ఆడా అన్న దౄశ్యం చాలు.
  అకౄత్యం చేసిన చోట ఇటువంటి మౄగాఅను
  రాబిస్ సోకిన కుక్కలను కాల్చినట్లు కాల్చాలి.
  శబ్బాష్. మంచి కవిత దూసారు.

  ReplyDelete
  Replies
  1. సర్, నిత్యం ఇలాంటి అక్రుత్యాలు జరగటం పరిపాటి అయింది కారణం మన దేశములో సరైన శిక్షలు లేకపోవటమే,
   నిజమే మీరన్నట్లు కాల్చిపారెయ్యాలి, మానసిక రొగులైన ఈ పురుషపుంగవులు కేవలం ఆడపిల్లల్ని హతమార్చటానికి మాత్రమే తిరుగుతున్నారు, తిండీఎ,తిప్పలకి ఏలాంటి లోటూ లేకుండా మైండ్ పనిచేస్తుందా...???
   ఇవన్నీ ఆలోచించే తీరిక ఎవరికుందీ? ఇలాంటి వాళ్ళు వందల సంఖ్యలో పెరిగి ప్రతిచోటా కనిపిస్తుంటే కళ్ళు మూసుకోవటమీ... ఇదే మన సామాజిక న్యాయం.
   కొద్దిరోజుల్లో ఆడపిల్లలే ఉండరు కాబోలు.

   Delete
 8. U r great andee.....no more words.
  Heart touching!

  ReplyDelete
 9. చాలా హృద్యంగా, ఆర్ద్రంగా రాశారు. ఒక వ్యవస్థ పురోగతిని, వికాసాన్ని అంచనా వేయాలంటే, ఆ సొసైటీలో స్త్రీలకు ఎలాంటి గౌరవం దక్కుతోందో చూస్తే సరిపోతుందని ఒక మహానుభావుడి ఉవాచ. ఈ కొలబద్ధతో చూస్తే స్త్రీలకు మాత్రం ఇది మానవ మృగాలు సంచరించే జనారణ్యమే అని చెప్పక తప్పదేమో. రేపటికి నిర్భయ ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మీ కవితను సందర్భోచిత నివాళిగా చెప్పుకోవచ్చు. మీరన్న మానవ మృగాల జనారణ్యంలో మార్పు తీసుకురావాలంటే ఇలాంటి కవితా విచ్చుకత్తుల అవసరం ఎంతైనా ఉంది.
  శ్రీశ్రీ కాంక్షించినట్టు...,
  కదిలేది కదిలించేది,
  పెను నిద్దుర వదిలించేది,
  పరిపూర్ణపు బ్రతుకిచ్చేది...
  కావాలోయ్ నవకవనానికి!

  ReplyDelete
  Replies
  1. మీ మాటలు అర్దవంతంగా ఉంటాయి, నిజమే వ్యవస్థ పురోగతి చూడాలంటే స్త్రీల బ్రతుకులు చూస్తే చాలు.
   అడుగడుగునా, క్షణ,క్షణానా పచ్చిమాంసం(ఆడ మాంసం ) తినే మ్రుగాళ్ళు పెరిగిపోయారు,
   అసహ్యమైన పదజాలంతో,జలదరిచే చూపులతో సగం చంపి రాక్షసానందం పొందుతున్నారు,
   నాగరాజ్ గారూ, నిత్యం స్త్రీని కలచివేసేవి ఇవన్నీ...
   1.బూతుల్లొ స్త్రీ ని గుప్పించటం,
   2.చూపులతో తినివేయటం.
   3.వయస్సు తారతమ్యం మరచి అమ్మ వయసున్న స్త్రీని కూడా వెకిలిగా చూడటం,
   4.బస్సుల్లో,బజారుల్లో చేతులూ,బుజాలూ తాకించటం...వగైరా,వగైరా, ఇవన్నీ స్భ్యసమాజ నడిబొడ్డున నడుస్తున్నా, జనాలంతా ద్రుతరాట్రులయిపోవటం గమనార్హం.
   ఇలాంటి వెదవల్ని, కాల్చి చంపెయ్యాలి, కళ్ళుపీకి నడిరోడ్డుమీద వదిలెయ్యాలి.
   గాయపడిన (నా చెల్లళ్ళు) వేలాది మంది నిర్భయలకు ఈ కవిత నా కన్నీటి నివాళి.

   Delete
 10. ఎంతగా కలికాలం ప్రబలి పొయిందో ,కాటికి కాళ్ళు జాపినవాడు......ఆరవ తరగతి విద్యార్ధుల వాడు,వీడు తేడా లేదు...పసి పిల్లా లేదు,వయసు మళ్ళిన వారు లేదు.శరీరం ఆడది అయితే చాలు .రోజు రోజుకు అరాచకాలు అధికం అవుతున్నా మీరన్నట్లు పాలకులంతా ధ్రుతరాష్త్రుల మాదిరి ఉన్నారు .కష్టం వారిది కాదుగామరి .అటువంటి ప్రతి నీచుడిని బహిరంగంగా ఉరి తీయాలి .వాడికి నోట్ల గొడుగు పట్టేవారిని నడిరోడ్డు మీద నరికెయ్యాలి ......మీరజ్ మీ కవిత చదివిన నీచులు సిగ్గుతో చచ్చి పోవాలి .

  ReplyDelete
 11. దిక్కుమాలిన సినిమాలూ,ఇంటర్నెట్లూ,టి.వి.లూ, మగపిల్లల ఆలోచనలని మారుస్తున్నాయి,
  ఆడపిల్లల వస్త్రధారణ సరిగా ఉండటం లేదు. విపరీతాలకు కారణం పెద్దవాళ్ళే,
  ముఖ్యంగా తల్లులు ఆ దిక్కుమాలిన టి.వి సీరియళ్ళకు ఇచ్చిన ప్రాముఖ్యం పిల్లల పెంపకానికివ్వరు.
  పెరుగుతున్న నగర జనాబా కొత్తవాళ్ళతో పిల్లలు ఎలా మసలుకోవాలో చెప్పరు.
  పెరుగుతున్న అపార్ట్మెంట్ జీవనాలు, ఇలా ఎన్నో కారణాలు.
  ప్రతిచోటా అబద్రత, ఎక్కడికక్కడ తెగ నరుకుతారు అనే భయం ఉంటే తప్పుచేయటానికి వెనుకాడతారు.

  ReplyDelete
 12. Replies
  1. ధన్యవాదాలు మీ ప్రశంసకు ప్రసాద్ గారు.

   Delete
 13. "యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: " అని బోధించే వారు ప్రబోధించేవారు ఎవరున్నారిప్పుడు. నేటి విద్యావిధానాల్లో ఇలాంటివాటికి తావేలేదు. విద్యనేర్పే గురువులే కీచకులైపోతున్నారు ఒక ప్రక్క. మీకవితలో ఆర్ద్రత, ఆవేశం ఆలోచింపచేసేలా వున్నాయి. వ్యవస్థలో మార్పురావాలని ఆశిద్దాం.

  ReplyDelete
  Replies
  1. శశిదర్ గారికి, నా బ్లాగ్ కి స్వాగతం.
   నిజమే మీరన్నది, ఉపాద్యాయుడు అంటే తండ్రితో సమానం కావాలి, అలాంటిది వారే కీచకులై పోతున్నారు,
   మార్పుని ఆశించే నా అక్షర బాటలో మీ వంటివారి ప్రో్త్సాహం ఉండాలని ఆశిస్తున్నాను.

   Delete
 14. Replies
  1. శ్రీపాద గారూ, నా బ్లాగ్ కి స్వాగతం,
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 15. కర్కశ ఆబోతుల పాదాల క్రింద నలిగే,
  ప్రకృతిని పరిరక్షిద్దాం

  హృద్యంగా ఉంది.. నిజం అక్కా.. ఇప్పుడు మనం చేయాల్సింది ఇదే...

  ReplyDelete
  Replies
  1. శోభా,మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 16. మీ కవిత కొందరిలో అయినా మార్పు తెస్తుందని ఆశిద్దాం ఫాతీమాగారు

  ReplyDelete
  Replies
  1. అదే నా ఆశకూడా ప్రేరణగారూ,
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete