Pages

Wednesday, 18 December 2013

గాయాల గేయాలు

     


    గాయాల గేయాలు 

     అనా(నానా) రోగ్యాల పాలైన నిరుపేదలు,
     గుండె దిటవు  చేసుకుని  వెళ్ళే  మృత్యుద్వారాలు. 

     చావుబతుకుల మద్య  కొట్టుమిట్టాడుతున్నా, 
     కనికరించని  ధన్వంతరి వారసులూ,

     ఆర్ధిక స్థితిగతులను  అంచనావేసి,
     లోనికి  అనుమతించే ఆసుపత్రి  ఉద్యోగులూ,

     అయినవాళ్ళ భుజాల ఆసరాతో నడిచే రోగులూ,
     సూదిమందులను వీల్ చైర్లో తీసుకెళ్ళే
నర్సమ్మలూ,

     ఎండలో క్యూలో  నిల్చుని  సోలిపోతున్న రోగులూ,
     సెల్లులో సోల్లుతూ  దారినడ్డుకొనే  వార్డుబాయ్ లూ,

     కొంపా,గోడూ ,గొడ్డూ,గోదా,  అమ్ముకొచ్చినా ,
     దారి ఖర్చులకే దాసోహమైన దాఖలాలూ,

     ఆరుబైటే ప్రసవించే గామీణ  ఆడపడచులూ,
     అసహ్య  పదజాలంతో  గాండ్రించే  ఆయాలూ,

     ఆధార్ కార్డులూ,ఆరోగ్య కార్డులూ  లేని అభాగ్యులూ,
     ఆసుపత్రి ఆవరణలోనే విగతజీవులైన  నిర్భాగ్యులూ,
     
     కేవలం  కాగితాలకే  పరిమితమైన  "ఆరోగ్య కేంద్రాలు"
     ప్రభుత్వాలు  అనుమతించిన  నాటక కంపెనీలు.   

     నిరుపేదల  చావులను నిర్దాక్షిణ్యంగా  తిలకించే,
     ఈ ఆసుపత్రులు   మానవ మాంసాలతో.. 
     వ్యాపారం  చేసే  మానవ కభేళాలు. 

(మానవతతో  వైద్యం చేసే  వైద్యులకు  పై కవిత  వర్తించదు, ప్రాణం పోసే వైద్య వృత్తికి  అంకితమైన మీకు  నా సలాం )
6 comments:

 1. వైద్యం ఎప్పుడయితే వ్యాపారం అయిందో అప్పుడే ప్రాణం విలువ తగ్గిపొయింది, మానవత్వం నశించిపోయింది పోయే ప్రాణాన్ని నిలబెడదాం అనే ధ్యాస లేకుండాపోయింది మీరజ్ . మీలోని ఆవేదనను మీ కలం వేదనగా రాసింది . చిత్రంకాదది నిత్యం జరిగే సత్యం .

  ReplyDelete
  Replies
  1. దన్యవాదాలు దేవీ,

   Delete
 2. ఆర్ధిక స్థితిగతులను అంచనావేసి, లోనికి అనుమతించే ఆసుపత్రి లో అనా(నానా) రోగ్యాల పాలైన నిరుపేదలు, గుండె దిటవు చేసుకుని వెళ్ళే మృత్యుద్వారాలు. కేవలం కాగితాలకే పరిమితమైన "ఆరోగ్య కేంద్రాలు" ప్రభుత్వాలు అనుమతించిన నాటక కంపెనీలు. ఈ ఆసుపత్రులు మానవ మాంసాలతో .... వ్యాపారం చేసే మానవ కభేళాలు.
  ప్రభుత్వ ఆసుపత్రుల దైనిక బాగోతాన్ని కళ్ళకు కట్టినట్లు చాలా బాగా విశ్లేషించి రాసినట్లు ఉంది
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. ఆసుపత్రి వర్గాలు కొంతవరకైనా మారగలిగితే చాలు సర్,
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 3. మానవత్వం మృగ్యం అయిపోయింది.
  వైద్యం వ్యాపారమైపోయింది.
  ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన
  నాకు అప్పుడప్పుడూ గుర్తుకొస్తూ కొందరు వైద్యులు అంత అమానుషంగా
  ఎలా ఉంటరనే సందేహం మానని గాయంలో బాధిస్తూ ఉంటుంది.
  నా ఫ్రెండ్ తల్లి చావుబతుకులలో ఉంటే ఇంటికి వచ్చి చూసిన డాక్టర్
  ఒక ఇంజక్షన్ చేసాడు. పది రూపాయలు ఇస్తే, అయిదు రూపాయల
  చిల్లర లేదని చెప్పి మరో ఇంజక్షన్ చేసాడు.
  అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మరింత
  దిగజారిపోయింది.
  కొన్ని జబ్బులను కంప్లీట్‌గా క్యూర్ చేయగలిగినా
  కావాలని అటువంటి మందులను మార్కెట్ లోకి తీసుకురాకుండా
  ఆ జబ్బులను అలాగే కొనసాగించే తాత్కాలిక ఉపశమనాలే
  అందుబాటులో ఉంచుతున్నారా అనే సందేహం నాకు గత పదేళ్ళుగా ఉంది.
  నిజం ఆ పెరుమాళ్ళకే ఎరుక!
  ఆలోచింపచేసే కవిత. బాగుంది.
  గాయాల గేయాల కంటే గేయాల గాయాలు బాగా సూట్ అవుతుందేమో!

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన మీ స్నేహితుని తెల్లి స్థితి మరీ దారుణం. ఇలాంటివి కూడా జరుగుతాయని మొదటిసారిగా వింటున్నాను. స్పందించిన మీకు దన్యవాదాలు సర్.

   Delete