Pages

Sunday, 9 September 2012

కనపడుటలేదు


కనపడుటలేదు 

పట్నం వెళ్ళిన పండుగాడు పదిరోజులైనా పతాలేడు.

బయపడ్డ బంగారు బస్తీ బయలుదేరింది.
చిలిపి సెంటర్లూ, తులిపి హోటళ్ళూ వెతికింది.
కంగారుపడ్డ బంగారు ఏమంటుందో విందామా..

మాటలొద్దు మనువాడరా మామా అంటే, 
నచ్చినోడినే కదా నమ్మకంలేదా అన్నాడు.

నోసటన బొట్టెట్టి, కాలివేళ్ళకి మెట్టిలెట్టి,
నువ్వు భార్యవే కదా బంగారుకొండా అన్నాడు.

అదిగో నాకప్పుడే అనుమానమొచ్చింది నేనసలే గడుసుదాన్ని.

ఏటిగట్టున ఎవరితో ఆ పరాచికాలూ అంటే,
నీటిలోని చేపలతోనే నాచిలకా అన్నాడు.

మంచె మీద ఎవరితో ఆ మంతనాలూ అంటే..,
మల్లెతీగతోనే మరదలపిల్లా అన్నాడు.

సంతలో ఎవరితో ఆ సరసాలూ అంటే..
చంకనున్న మేకపిల్లతోనే నా సంపంగీ అన్నాడు.

వేగుచుక్కతోనే లెగిసిపోతావ్ ఎందుకు మామా అంటే..,
ఏరువాక ఎనకబడిపోతే ఎంత అగమానమే నా ఎంకీ అన్నాడు.

నిద్దట్లో ఎవరితో ఆ కలవరింతలూ అంటే..,
నా కలలన్నీ నీ చుట్టూరే కదరా కన్నా అన్నాడు.

బంతి పూలతోటలో ఎవరితో ఆ బాసలూ అంటే..,
అవి బంతిపూలా నీ బుగ్గలనుకున్నానే భామా అన్నాడు.

చెరకు తోటలో ఎవరితో ఆ చతుర్లూ అంటే..,
చిలకలన్నీ పలుకుతున్నాయే చిత్రాంగి అన్నాడు.

ఆరుబైట ఎవరితో ఆ హాస్యాలూ అంటే..,
ఆకాశవాణి వింటున్నానే అల్లరిపిల్లా అన్నాడు,

ఈ మహా నగరంలో వాడిని ఎలా వెతకను నేనసలే అనుమానపుదాన్ని.

ఏ లతాంగిని లాలిస్తున్నాడో.
ఏ కలికిని కవ్విస్తున్నాడో.
ఏ ముదితతో ముచ్చట్లాడుతున్నాడో.
ఏ కొమ్మతో కులుకుతున్నాడో.
ఏ లలనను లాలిస్తున్నాడో.
ఏ మగువను మురిపిస్తున్నాడో.
ఏ తలోదరిని తలచుకుంటూ ఉన్నాడో.

వాడు దొరికాడో..అయ్యతో చెప్పి బడితపూజ చేయిస్తాను.
గుంజీలు తీయించి, గుంజకు కట్టేస్తాను.

వాడి చేతికి తాళిబోట్టిచ్చి, మీ చేతిలో అక్షింతలు పెడతాను. ఆ... నేనసలే గడుసుదాన్ని.
38 comments:

 1. ఇంతగడుసుది కనకే పారిపోయాడు :) :)

  ReplyDelete
  Replies
  1. గడుసుతనం వెతికి పట్టుకుంటుంది, కానీ అపనమ్మకం వల్లా పోగొట్ట్టుకుంటుంది.
   సర్ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.....మెరాజ్

   Delete
 2. మెరాజ్ గారూ!
  మీరింతగా అలా వెంటబడితే...
  ఎలా దొరుకుతాడు చెప్పండి...:-)
  దొరికితే చూపించండి మీ పల్లెటూరి బా(మా)వని.
  చాలా బాగా వ్రాసారు...
  శర్మ గారి వ్యాఖ్యలో కొంత నిజం లేకపోలేదు...:-)
  అభినందనలు...
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. మీకేమైనా కనిపించాడా? ఆ.హా ఏమి లేదు రాష్ట్రాన్నే దాటి వెళ్లిఉండవచ్చు కదా. ఏమో నాకసలే అనుమానం.:-) :-)
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు సర్...మెరాజ్

   Delete
 3. మొత్తనికి గట్టి మావే, బడితపూజ తప్పేట్టులేదు పాపం గడుసు మరదలి చేతిలో. ఇంకెక్కడికిపోతాడు లెండి ;)
  చదువుతుంటే ఎంకి, నాయుడు బావలు గుర్తుకొచ్చారు.
  బాగుందండీ!

  ReplyDelete
  Replies
  1. చిన్నిఆశగారూ, బ్లాగ్ కి స్వాగతం. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
   ఏదో సరదాగా రాయాలి అనిపించి రాసాను ...మెరాజ్

   Delete
 4. ఇంత గడుసు భామాకా తుంటరి బావ కనబడకెక్కడికి పోతాడు :-) very very nice fathima garu

  ReplyDelete
  Replies
  1. అమ్మో అలా అనుకొనే జారవిడుచుకుంటారు.
   ఏమైనా బంగారు జాగ్రత్తగా ఉండాలి కదా.:-) :-)
   కవిత నచ్చినందుకు థాంక్స్ రమేష్ గారూ........మెరాజ్

   Delete
 5. Entha chakkani varNaNa.
  Wonderful. Meraj.

  ReplyDelete
  Replies
  1. వనజా, కవిత చదివిన మీకు ధన్యవాదాలు. వర్ణన నచ్చినందుకు సంతోషం...మెరాజ్.

   Delete
 6. మీ పండుగాడు చాలా తెలివైనవాడిలా ఉన్నాడు.
  ఆ అమ్మాయిని బాగా బుట్టలో వేసాడు.
  నేను గడుసు, అని పదే పదే చెప్పుకుంటున్నా
  మీ ఎంకి పాపం అమాయకురాలులానే ఉంది.
  ఉండండి, మేమంతా సాయం వస్తాం,
  మీతో పాటు వెతికి పండు గాడిని మీ చేతికి అప్పగించి వెళ్తాం.
  అక్షతలు కూడా వేస్తాం.
  విందుకి మీరు ఏర్పాటు చేసుకోండి

  ReplyDelete
  Replies
  1. అమ్మో .. చాలా గడుసువాడండి, రెప్ప మూసేలోగా పారిపోతాడు.
   ఆడపిల్ల ఎంత గడుసుదైనా ఏమి చేయగలదు చెప్పండీ.. అయినా మీరంతా ఉండగా దిగులెందుకు,
   దొరకాలీ..బంగారు చెప్తుంది వాడి పని.:-) :-)
   సర్, నా సరదా కవితని చదివి అంతే సరదాగా స్పందించిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.

   Delete
 7. మీరే అంటే మీకంటే గరుసుడు కావచ్చు మీ పండు బా(మా )వ
  చాల బాగుంది ...

  ReplyDelete
  Replies
  1. జాగ్రత్తగా ఉండాలి కదా లేకుంటే పారిపోతారు ఇలాగే...:-) :-)
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు అక్షర కుమార్ గారూ.

   Delete
 8. మెరాజ్ గారు, మీరేనా రాసింది...అహా! అనుమానం వస్తేనో!
  నాకు భలే నచ్చిందండి. ఆ మాత్రం గడుసుతనం ఉండాలి సుమండీ!!
  హాయిగా నవ్వించారు.. నాకు మామ సమాధానాలు కూడా భలే నచ్చాయండి.

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ, అమ్మో గడుసుతనం లేకుంటే ఎలా చెప్పండీ:-)
   నా సరదా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది, అప్పుడప్పుడూ ఇలా రాయటానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
   మీలాంటి సోదరి నచ్చింది అంటే మురిసిపోతాను....మెరాజ్.

   Delete
 9. మరదలు గడుసరని
  బావ...మరీనూ:-)

  ReplyDelete
  Replies
  1. మరదలుపిల్ల అంటే కొంచం భయం కూడా ఉండాలి. మరీ పారిపోయేంత కాదు లెండి.:-):-)
   పద్మగారూ కవిత చాదివిన మీకు థాంక్స్.

   Delete
 10. హహహ! భలే వ్రాశారు! వాడి చేతిలో తాళిబొట్టు, మీ చేతిలో అక్షింతలు సరే కానీ మా నోటిలో స్వీట్లు లేవా ;)

  ReplyDelete
  Replies
  1. రసజ్ఞ గారూ, తప్పకుండా మీకు స్వీట్ పెట్టాలి, కానీ మీరు కూడా ఈ పండుగాడిలా నా బ్లాగ్ వదిలి వెళ్ళిపోతున్నారు,
   పనిలో పని మిమ్మల్ని కూడా కట్టి పడేస్తే..(సరదాగా అన్నాను)
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు...మెరాజ్.

   Delete
 11. సరదాగా ఉందండీ బంగారు కంగారు :)
  చాలా బాగుంది ...

  ReplyDelete
  Replies

  1. రాజీగారూ, బాగుంది అన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
   నా కవితలను మెచ్చుకొనే స్నేహమయిగా మీ ప్రశంస బలాన్నిస్తుంది నా అక్షరాలకు...మెరాజ్

   Delete
 12. గడుసరి 'బంగారు' మాటలు కొంత రమణీయంగా, మరికొంత కమనీయంగా ఉన్నాయి. చక్కటి హాస్యాన్ని
  పండిస్తూ... చక్కగా రాసారు. అభినందనలు ఫాతిమా గారు!

  ReplyDelete
 13. నాగేంద్ర గారూ, నా హాస్య కవిత నచ్చిందని మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.
  ధన్యవాదాలు....మెరాజ్

  ReplyDelete
 14. విభిన్నమైన కవితా ప్రయోగం .సరదాగా వుంది.

  ReplyDelete
 15. రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 16. కవిత సరదాగ సాగినా భాషాపరంగా ముచ్చటగా ఉంది మెరాజ్ గారూ..ఆసక్తిగా చదివించె రచన

  ReplyDelete
  Replies
  1. వాసుదేవ్ గారూ, మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
   "పాలపిట్ట" మాసపత్రికలో మీ కవిత బాగుంది...మెరాజ్

   Delete
 17. రవిశేఖర్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 18. అమ్మో, ఇన్ని అనుమానాలైతే కష్టమండి,...

  ReplyDelete
 19. ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవాళ్ళను?:-):-).
  అనుమానం పుట్టి ఆడది పుట్టింది అంటారు గానీ, దాని వెనుక ఎంత ప్రేమ ఉందొ తెలీదు.
  భాస్కర్ గారూ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 20. ఏమి చెయ్యాలి చెప్పండీ అప్పుడప్పుడూ మాయయ్యేవాళ్ళను?:-):-).
  అనుమానం పుట్టి ఆడది పుట్టింది అంటారు గానీ, దాని వెనుక ఎంత ప్రేమ ఉందొ తెలీదు.
  భాస్కర్ గారూ కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 21. కవిత చాలా చాలా బాగుంది. "ఈరోజు నా రాజు కేరాయిడౌనో, ఈ రేయి నారాత లేరాల పాలో" అని తనలోనే కుమిలి క్రుంగి కృశించి పోయే నండూరి వారి యెంకిలా కాకుండా, మీయెంకి ఈ రోజులకు తగ్గట్టుగ్గా గడుసుదనాన్ని సంతరించుకుంది.మీ కవితలే కాదు మీరు పెడుతున్న ఫోటోలూ మమ్మల్ని అలరిస్తున్నాయి.శెభాస్.మీరు రాస్తూనే ఉండండి. మేము చదువుతూనే ఉంటాము.

  ReplyDelete
  Replies
  1. సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
   నా రచనలు మీ వంటి వారు మెచ్చుకోవటం నిజంగా అదృష్టం.
   ప్రతి కవితా చదివి వ్యాఖ్యానించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
  2. సర్, మీ స్పందన చూసి చాలా సంతోషం అయింది.
   నా రచనలు మీ వంటి వారు మెచ్చుకోవటం నిజంగా అదృష్టం.
   ప్రతి కవితా చదివి వ్యాఖ్యానించిన మీకు కృతజ్ఞతలు.

   Delete
 22. గడసరి భామ సొగసరి మామ...బావుంది మెరాజ్ గారు. మీరేనా ఇది వ్రాసింది అని ఆశ్చర్యపోయాను.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ, నేను రాసిన కవిత కంటే మీరు పెట్టిన టైటిల్ బాగుంది.
   అయితే మనమిద్దరం ఓ మాంచి సినిమా తీసేద్దాం ఎలాగూ మీకు ఫోటోగ్రఫీ కూడా వచ్చు కదా :-):-)
   థాంక్స్ dear మీ స్పందనకు....మెరాజ్

   Delete