Pages

Wednesday, 5 September 2012

బహుమతి









బహుమతి

అంతరాన ఉన్న  ఒక్కో తలపూ.. అంతమవుతుంటే ,

కట్టుకున్న కలల  సౌధం  కళ్ళముందే  కూలిపోతుంటే..,

శ్వాసను ఆపివేసేందుకు ఒక్కో అణువూ  పోరాడుతుంటే,

మాటలన్నీ మౌనం దాల్చి మూగతనం  అంటగడుతుంటే,

గుండెకు  తోడున్న  అనుబంధం విచ్చన్నమవుతుంటే, 

తీగ  తెగిన  హృదయవీణ   మ్రోగలేనని    మూగబోతుంటే.

విచ్చుకున్న  ప్రేమ  కుసుమం  రేకులు   రాలిపోతుంటే.
                                 




కమ్ముకున్న పొగమంచులో,కదిలిపోయే మేఘంలా .., 

సాగిపోయే  సమీరంలా   వెళ్తున్న నీవు వెనక్కి రావటం..,

ఎగిసిపడే  కెరటంలా ఒక్క  ఉదుటున  నీఎదుట నిలిచిన 

నా  చేతిలో  నీవు  పెట్టిన  నీలిరంగు  " చిన్ని చీటీ "

నీరు నిండిన నా కళ్ళకు "దస్త్రం లో చుట్టినదస్తావేజులా...

నేను విప్పి చూడలేదు   ఆ అవసరమే రాదు,

నాకు తెలుసు  అందులో  ఏముందో, 

"అక్షరాల ఆత్మవంచన," " స్వచ్ఛతలేని ప్రాయశ్చిత్తం" 

"నిగూడ పద ప్రయోగం" మరచిపోయిన "స్మృతి చిహ్నం". 

అనంత క్రూర నిరీక్షణకై నీవు కట్టిన కలలసమాది.
అనంత తీవ్ర ఆవేదనకై నీవు వేసిన అక్షర శిక్ష. 

25 comments:

  1. బావుందని అనలేను. :(:(
    నాకు తెలుసు అందులో ఏముందో ,
    అక్షరాల ఆత్మ వంచన స్వచ్చత లేని ప్రాయచిత్తం
    నిగూడ పద ప్రయోగం మరచిపోయిన స్మృతి చిహ్నం.

    ఎంత వేదన ఉంది.మనసేమిటో తెలిసిన వారికి నిజం గుర్తించడం కష్టమా!?

    ఆ కలల సమాధిని కూల్చివేసి, ఆ అక్షర శిక్ష ని నీటిలో కలిపేసి.. అక్షర సహవాసంతో.. స్వాంతన పొందమని చెపుతాను నేను.

    ReplyDelete
    Replies
    1. వనజా, మీ కవితా విశ్లేషణ బాగుంటుంది.
      మీరు సూచించిన చక్కటి సలహా అక్షరాలా నిజం.
      కవి తన వేదనను , భావ తపననూ, తట్టుకొనేందుకు అక్షరాలతో సహవాసం చేస్తాడు.
      స్వాంతన పొందుతాడు, అందుకే అన్నాను నేను మెచ్చే నెచ్చలి మీరే అని....మెరాజ్.

      Delete
  2. అమ్మో ఇన్ని అందమైన అక్షరాలతో శపిస్తుంటే కష్టమండి కమెంట్ పెట్టడం. ఎంతైనా గురువులనిపించుకున్నారుగా:-)

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, గురువుగా అందమైన అక్షరాలతో శపిస్తుంటే,
      ఈ (పద్మ) శిష్యురాలు అందమైన అక్షరాలతో మురిపిస్తుంది.
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.

      Delete
  3. మేరాజ్ గారూ!
    అక్షరాంజలి వ్రాసిన కలమేనా?
    ఈ అక్షర శిక్ష వ్రాసింది?
    మనో వేదనకు పరాకాష్ట అనాలా?
    అంతులేని వేదనకు దర్పణం అనాలా?
    ఇది కవితే అయితే...చెప్పడానికి మాటలు చాలవు.
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. సర్, మీ విశ్లేషణ బాగుంటుంది.
      కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. మీ ఆలోచనల నుండి బ్లాగులోకి మెరుపు తీగల్లా దూసుకు వస్తున్న 'అక్షర ఫిరంగులు' మా హృదయాల్లో
    లక్షణంగా ఒదిగిపోతున్నాయి ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, మీ వ్యాఖ్యలు నా కవితకు అభినందన జల్లులు.
      ధన్యవాదాలు సదా కృతజ్ఞురాలినై ఉంటాను....మెరాజ్

      Delete

  5. మేరాజ్ గారూ!చాలా రోజుల తరువాత చదివాను మీ కవిత. హృదయానికి హత్తుకునేలా వేసారుగా అక్షర శిక్ష. చాలా బాగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, చాలా బిజి అయిపోయారు.
      కానీ, మీ అభిమానాన్ని నాకు పంచాల్సిందే.
      కవిత చదివిన మీకు థాంక్స్...మెరాజ్

      Delete
  6. "అక్షరాల ఆత్మవంచన," " స్వచ్ఛతలేని ప్రాయశ్చిత్తం"

    నిజమేనండీ ఒక్కోసారి ఇలాంటి బహుమతులు కూడా అందుకోవాల్సి వస్తుందేమో జీవితంలో...!

    ReplyDelete
    Replies
    1. రాజీ గారూ, మీరన్నదీ నిజమే. నా కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  7. అతని వంచనన్ బొగిలిన 'యతివ 'చేతి
    'కక్షరాయుధ'మిచ్చి పోరాడు మనక
    ఇటుల 'అక్షర శిక్ష 'విథించ నేల ?
    వంచనకు 'తల వంచుట' పాడి యగున ?
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. సర్, అన్నివేళలా ఆయుధపోరాటం చేయుట సాద్యమా?
      ఓ గొప్ప కవి అన్నారు "మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువుకదా".
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు...మెరాజ్

      Delete
  8. ఏముందబ్బా ఆ చిన్ని చీటి లో!ఇసి
    ఎగిసిన కెరటం రంగు నీలం!
    చీటి రంగు నిలం!
    అయ్యో, ఆమె నీలాల కళ్ళల్లో నీరు నీలం!
    మీరు రాసిన అక్షరాలు నీలం!
    ఓం శాంతి!

    పి.ఎస్. ఊరికే సరదాగా అన్నాను!
    కవిత బాగుంది!

    ReplyDelete
    Replies
    1. సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
      ఆ చిన్ని చీటిలో ఏముందో అంత పెద్ద కవులు చెప్పలేరా?
      ప్రశంసకు కృతజ్ఞతలు.

      Delete
  9. Replies
    1. Ramakrishna garu kavitha chadivina meeku dhanyavaadaalu. naa blog ku swagatham

      Delete
    2. Fathima garu chinna correction. My name is lasya and my husband name is Ramakrishna.

      Delete
  10. oh..sorry lasya garu, na kotta kavitha choodandi.

    ReplyDelete
  11. oh..sorry lasya garu, na kotta kavitha choodandi.

    ReplyDelete
  12. అనంత క్రూర నిరీక్షణకై నీవు కట్టిన కలలసమాది.
    అనంత తీవ్ర ఆవేదనకై నీవు వేసిన అక్షర శిక్ష.
    ఎంతో వేదన లో నుండి వచ్చిన పద ప్రయోగం.
    ఇక పోతే అందులో ఏముందో తెలిసి చూడకపోవటమే సరి అయిన చర్య.లేక పోతే జీవిత మంతా ఆ ఉత్తర మొక శిక్ష .

    ReplyDelete
  13. శేఖర్ గారూ, కవిత అర్ధం చేసుకోవాలంటే మొదటగా భావుకత ఉండాలి.
    నా కవితని సహృదయతతో ఆదరించి, మంచి విశ్లేషణ ఇచ్చిన మిత్రులలో మీరూ ఒకరు.
    మీ వ్యాఖ్య లేని వెలితి తీరిపోయింది. ధన్యవాదాలు....మెరాజ్

    ReplyDelete