ఉదయం ఐదు గంటల సమయం నిద్రలో ఉన్నా.. "డబ్ " మన్న చప్పుడుతో ఉలిక్కిపడి లేచాను. వెంటనే "వామ్మో చచ్చాను" అనే కేక విని హడావిడిగా ముందుగదిలోకి వెళ్లి చూసాను.. మా శ్రీమతి మాధవి బోర్లాపడి వుంది. "అయ్యో ఏమయ్యిందే " కంగారుగా అడిగాను.
టి.వి లో "మీ వొళ్ళు - మా ఆసనాలు" కార్యక్రమం చూసి శీర్షాసనం వేద్దమనుకున్నానండీ, ఇదిగో ఇలాపడి పోయాను, లేపండీ అలా తమాషా చూస్తారే.. చేయి అందించింది మాధవి. అప్పుడు టి.వి.వంక చూసాను.. ఆసనాలు వేసే గురువుగారికి తిండి అనే పదం తెలుసో లేదో, అస్తిపంజరానికి కుర్తా పైజమా వేసినట్లున్నాడు. "గురువుగారు సులభంగానే వేసారండీ, నేనూ అలాగే వేద్దామనీ"..నసిగింది మాధవి.
"ఆ ఆసనం అతనే వేశాడా?" అది శవాసనమా? మళ్ళీ అనుమానంగా అడిగాను.
"అదిగో అందుకే మిమ్మల్ని రోజూ కొంచం సేపైనా గురువుగారి ఆసనాలు చూడండీ అని మొత్తుకోనేది". కనీస ప్రాధమిక జ్ఞానం కూడాలేదు అన్నట్లు నా ముఖాన ఓ సీరియస్ లుక్ పడేసి లోపలికి వెళ్ళింది విసవిసా. (మరిప్పుడు నడుం నొప్పి ఎమైనట్లో?)
పోనిద్దూ ఏమన్నా అన్నానా నాకు కాఫీ ఉండదు, లోపలికి వెళ్లిందంటే కాఫీ తెస్తుంది, అలా ఆరుబైట కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తూ తాగొచ్చు ముఖ్యంగా ఈ దిక్కుమాలిన టి.వి. కట్టేయవచ్చు అనుకున్నాను. లోపలిగదిలో నుండి వచ్చిన మాధవి చేతిలో కాఫీ కప్పుకు బదులు ఓ చిన్న చెడ్డీ ఉంది. అది నా చేతిలో పెట్టి "మనూ.. ఇది వేసుకొని మీరూ ప్రాక్టీస్ చేయొచ్చు..ఉండండి చానల్ మారుస్తాను" అంటూ చానల్ మార్చింది. ఓ ముప్పై ఏళ్ళ యువతి పొట్టిగా లావుగా ఉంది ఒన్..టూ అంటూ గెంతుతుంది. అమ్మో మా శ్రీమతి ఎంత హుషారూ.. నన్ను ఎలాగైనా ఈ టి.వి ప్రోగ్రామ్స్ కి కట్టేయాలని ఇలా ఆడ అస్త్రాలను కూడా ప్రయోగించి చూస్తుంది.
"అమ్మా బంగారు తల్లీ నన్నిలా బ్రతకనీ, ఆ విచిత్ర వేషధారణ నేను వెయలే నుగానీ నా ముఖాన ఇంత కాఫీ పడెయ్యి" అనేసి అక్కడే కూలబడ్డాను.(నేను అక్కడే టి.వి.లో కళ్లేసాను ).
శ్రీమతి కాఫీ తేవటానికి వెళ్లిందో లేదో, టక్కున రిమోట్ (కొరివి ) తీసుకొని చానల్ మార్చాను.(పొయ్యి మీది నుండి పెనం మీద పడ్డానన్న మాట)
హాయ్. . నవ్వుకావాలా? లవ్వు కావాలా? ప్రోగ్రాంకి "ష్వాగతం" "షుశ్వ్వాగతం". ముందుగా ఎవరి కాలో(ఎవరు జారారో?) చూద్దామా? అంటూ ఓ అమ్మాయి పళ్లన్నీ బైటపెట్టి మనం బాగా పరిచయం ఉన్నట్లు. మాట్లాడుతుంది. ఇంతలో ఏపనీ పాటా లేని తల్లెవరో ఫోను చేసినట్లుంది. "హాయ్ ఆన్షీ... క్యా బాత్ హై, అంకుల్ లేరా? " (యాంకర్ ప్రశ్నల వర్షం). ఆమె ఏదో చెప్పబోయేలోగా "హాయ్ "ఆన్షీ" మీకు బోయ్ ఫ్రెండు ఉన్నారా? మీరు ఎలాంటిపాట ఆయనకీ పంపుతారూ" అంటూ వచ్చీ రాణి (ఛి,ఛీ నేను తెలుగు మరచిపోతున్నా) తెలుగులో ఆమె కొంపకి నిప్పు పెట్టె సమయానికి మా శ్రీమతి కాఫి తెచ్చింది. మా శ్రీమతి వస్తూనే సంబరంగా యాంకర్ని చూస్తూ ఇదిగో ఈ చీరే నేను చెప్పింది మిమ్మల్ని కొనమని.. అంటూ ఉండగా, ముంచుకొచ్చే ప్రమాదాన్ని గ్రహించి నేను వేడి వేడి కాఫీ గొంతు కాలుతున్నా ఎలాగో మింగేసి. స్లిప్పర్స్ వేసుకొని వాకింగ్ బయలుదేరాను.
*********
సాయంకాలం ఆఫీసునుండి వస్తూ కూరగాయలు కొంటుంటే మా సెక్షన్లో పని చేసే మా కొలీగ్ రాణి గారు కలిసారు. ఇద్దరం ఉన్నది ఒకే కాలనీ అయినా ఎప్పుడూ ఇలా తటస్థ పడలేదు, ఇద్దరం ఏవో మాట్లాడుకుంటూ నడుస్తుండగానే మా ఇల్లోచ్చేసింది. బాగుండదుకదా అని ఆమెను ఇంట్లోకి ఆహ్వానించాను (ఇబ్బందిగానే). ఆమె కూడా మొహమాటపడుతూనే వచ్చారు.
పరిచయాలయ్యాక మాధవి టీ పెట్టేందుకు లోపలికెళ్ళింది. టి.వి. లో "బతుకు రిక్షా బండి" ప్రోగ్రాం వస్తూ ఉంది. ఓ నడివయసు మహిళ చేతులు లేని జాకేట్టుతో, మెడలో పెద్ద పూసలమాలతో (లేగదూడల మేడలో వేసే లాంటిది) జుట్టు ముఖాన్ని సగం కప్పేస్తుంటే వెనక్కి తోసుకుంటూ ప్రోగ్రాము anchoring చేస్తూ ఉంది. ఎదురుగా ఓ పల్లెటూరి యువతి నేతచీరలో ముద్దబంతిలా ముద్దుగా ఉంది. ఆమె ఎదురుగా ఓ యువకుడు మాసిన బట్టల్లో దిగులుగా ముఖం వేలాడేసుకుని ఉన్నాడు.
జబ్బల్లేని జాకెట్టు (JLJ) ముందుగా నైతిక విలువల గూర్చి, మధ్య మధ్యలో పూసలు సవరించుకుంటూ మగవారి దురహకారం (?) గూర్చి లెక్చర్ దంచి ఆ తర్వాత ఇంటర్వూ మొదలు పెట్టింది.
ఏమయ్యా "నువ్వు నీ భార్య పర్మిషన్ లేకుండా పరాయి ఆడదాన్ని ఇంటికేందుకు పిలిచావ్?" అంటూ ఆ యువకుణ్ణి దబాయించింది JLJ.
అది కాదమ్మా..ఆయమ్మ నేను పని చేసేకాడనే చేస్తా... అతని మాట పూర్తి కాకుండానే JLJ అడ్డుకుని "నోర్ముయ్ నిన్ను496, 498A సెక్షన్ల కింద అరెస్టు చేయిస్తాను తెలుసా.. హుంకరించింది.
"అయ్యో, ఆడి తప్పేమీ లేదమ్మా, ఆడు పిలవంగానే ఎగేసుకొని వచ్చిందే దాన్ని అనుకోవాలి" ఆ ముద్ద బంతి మొగుణ్ణి వెనకేసుకొచ్చింది. నువ్వు నోర్ముయ్ మేము చూస్తాం కదా (మీరు ఎలా కాపురం చేస్తారో), కోపంగా అరిచింది JLJ.
నేను ఇబ్బందిగా చూసాను మాకొలీగ్ వంక, ఇంచుమించు ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. మా శ్రీమతి మమ్మల్ని కొరకొరా చూస్తుంది. ఇంకోమారు టి.వి. మా ఇంట నిప్పు పెట్టింది అనుకున్నాను నేను, ఎలాగో ఆమెను సాగనంపాను.
ఈ దిక్కుమాలిన టి.వి నుండి బైట పడటానికి రిమోట్ మా పుత్ర రత్నానికి ఇచ్చాను. వాడేదో కార్టూన్ పెట్టాడు. ఆబోమ్మలకి అనుగుణంగా విచిత్రమైన భాష (తెలుగే).
"హె..హే.. నువ్వు ఎక్కడికీ పోలేవు జేన్, నువ్వు నా దోస్తీని అంగీకరించాల్సిందే"
"లేదు
జేన్ నీది స్వార్ధపరమైన ఆలోచన "హో కమాన్ '" ...
ట్రూ ట్రాన్సిలేషన్ ... ఇంచి, తుంచి, దంచి, చీల్చి కుట్టిన అతుకుల బొంతలా ఉందా భాష... బాబో నా మెదడు నరాలు చిట్లినట్లు, వంద సూదులు ఒకేసారి కళ్ళలో గుచ్చినట్లూ ఉంది.
(ఈ హింస ఇప్పటికి ఆపేస్తాను, మా ఇంట్లో ఈ టి.వి. అనే రాక్షసి పెట్టె హింస మళ్ళీ చెప్తాను).
fathima garu gruha himsa gurinchi adbhutamga rasaru :-)
ReplyDeleteRamesh garu nachhinanduku dhanyavaadaalu. naa blog darshinche meeku kruthagnathalu
Deletesuper...!
ReplyDeleteIvannee anubhavaalenaa? meraj..:) :)
వనజా, మీకు ఇలాంటి సందేహం వస్తుందనే అనుకున్నాను.
Deleteనిజమే కోరి తెచ్చుకొన్న కొరివి కదా. తప్పుతుందా.
మా ఇంట్లో టీవీ రాక్షసిని బంధించి అలంకారంలా హాంచేసారు. అందుకే ఇలా మీ అందరితో అనుబంధం:-)
ReplyDeleteమంచి పని చేసారు. కవిత చదివిన మీకు ధన్యవాదాలు పద్మగారు.
Deleteహహహహ్హ నేను టి వి కి దూరంగానే ఉంటాను.. ఈ తెలుగు పైత్యం చూడలేక.. బాగుంది ఫాతిమా గారు
ReplyDeleteఅయ్యో , కొత్త తెలుగు నేర్చుకోవచ్చు మళ్ళీ చూడటం మొదలు పెట్టండి రమణి గారు.
Delete:) బాగుంది, మీ గృహహింస.
ReplyDeleteThank you SNKR garu, idi prathi intilo unna himse sir. blog darshinchina meeku thanks.
Deleteతెలుగు ఛానల్స్ ప్రసారం చేస్తున్న చెత్త కార్యక్రమాలపై మీ అనుభవాలకు హాస్యం జోడించి చక్కగా రాసారు.
ReplyDeleteనాగేంద్ర గారూ. మీరు వినగలరు అనుకుంటే ఇంకా చెప్పేదాన్ని,
Deleteకానీ మంచి మిత్రులను వదులుకోవటం ఇష్టం లేక కొంత మాత్రమె చెప్పాను...చదివిన మీకు ధన్యవాదాలు.
చెప్పాలనుకున్నది నిస్సంకోచంగా చెప్పేయండి. విన్నాక తెలుస్తుంది మిత్రుల మంచి ఎంతో. :)
DeleteSNKR garu, vaddulendi himsa yedainaa mitrulu manavaallee kadaa baagundadu. blog darshinchinanduku dhanyavaadaalu.
Deleteబాగుందండి,
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారు.
Deleteహహహ....
ReplyDeleteమెరాజ్ గారూ!...
చాలా బాగుంది మీ టీవీ ప్రహసనం...:-))
TRP (TELEVISION RATING POINT)
పెంచుకునేందుకు ప్రతీ చానెల్ పడే తిప్పలు...
ఏదో కొత్తదనం చూపించాలనే ప్రయత్నంలో
మనలాంటి ప్రేక్షకులు బలి అయిపోతున్నారు...
పార్ట్ 2 తొందరగా పోస్ట్ చేసేయండి మరి...
@శ్రీ
శ్రీ గారూ, మొదట మీకు సారీ, తర్వాత థాంక్స్ చెప్పాలి.
Deleteటి.వి. ఉద్యోగులు కనుక సారీ, నిజం ఉందని ఒప్పుకున్నందుకు థాంక్స్.
ఇకపోతే మీరు చదవగలనంటే రెండవ భాగం పెట్టేందుకు సాహసిస్తాను.
హాస్యభరితంగా, చాలా చక్కగా తెలియజేశారండి గృహ హింసని... బాగుంది మీ పోస్ట్.
ReplyDeleteభారతి గారూ, గృహహింస నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteమళ్ళీ కలుద్దాం మరో హింసతో( అహింస)...మెరాజ్
శ్రే ఫాతిమా గారికి, నమస్కారములు.
ReplyDeleteలేనిపోని తంటాలు కొనితెచ్చుకోవటమెందుకు? అని అంటుంటారు. చనిపోయినతరువాత నరకానికి ముందుగా పోతారంటారు. అప్పుచేసి టీ.వి. కొని తెచ్చుకొని, చనిపోకముందే, ఈ టీ. వి. కార్యక్రమాలద్వారా నరకయాతనని మనం అనుభవిస్తున్నాము. కొని తెచ్చుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ. తప్పదు అనుభవించాల్సిందే. చాలా చక్కగా వ్యక్తీకరించారు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవ రావ్, గారికి నమస్తే. నా బ్లాగ్ కు స్వాగతం.
Deleteబలేవారే కోరి తెచ్చుకొన్నది కనుకే బైట పడేయలేక బలి అవుతున్నాము.
స్నేహాలని, అనుబంధాలని, ఆకరికి కనీస సంస్కారాన్ని కూడా మరచిపోయే సందర్బాలు లేకపోలేదు ఈ టి.వి చూడటంలో మునిగి.
ఆ దిక్కుమాలిన ధారావాహికాలు మన మునిమనవలు కూడా చూడవచ్చు అలా సాగదీస్తారు.
పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.
బలె! బలే!! మా బాగా అయ్యింది :) లేపోతే తెనుగు టి.వి చానల్ చూస్తారా, హన్నా!!!
ReplyDeleteసర్, నవ్వండి.. తెలివిగలవారు ముందే జాగ్రత్త పడ్డారులా ఉంది.
Deleteగృహహింసా/టివి హింస భలే రాసారు మెరాజ్ గారు..
ReplyDeleteవెన్నెల గారూ, మీకు ఈ బాద ఉండదు అనుకుంటా..
Deleteపోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు...మెరాజ్
అలా ప్రోగ్రాంలు చూసాక కూడా ఇలా రాస్తున్నారంటే....అమ్మో అమ్మో ఎంత గుండెనిబ్బరమో!:)
ReplyDeleteసృజన గారూ, నిజమే ఇంకా మిమ్మల్ని గుర్తుపడుతున్నాను అదృష్టం బాగుంది.:-) :-)
Deleteచదివిన మీకు ధన్యవాదాలు.
మొత్తానికి ఇడియట్ బాక్స్ ని చక్కగా హాస్యాన్ని జోడించి దాని హింసను వివరించారు. ఏదైనా మితి మీరిపోతే ఎలా వుంటుందో అన్నదానికి మన టీవీ చానల్స్ వాటి కార్యక్రమాలు, సీరియల్స్ ఉదాహరణగా కాదు సజీవ సాక్ష్యాలు. అవి మన మెదళ్ళపై వేస్తున్న ప్రభావం చాలా తీవ్రమైనది. వార్తల కోసం చూద్దామన్నా మసాలా జోడించిన వార్తలు తప్ప పరిశుద్ధమైన తెలుగులో శాంతి స్వరూప్ గారిలా చదివే వారు కొరత. తిప్పి తిప్పి ఒకే వార్తను రోజంతా ప్రసారం చేస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గుండెలార్పేసే చానళ్ళూ వున్నాయి. సగటు జీవి పడే హింసకు పరిష్కారం జస్ట్ స్విచాఫ్..:)
ReplyDeleteఅభినందనలతో..
వర్మ గారూ, టి.వి కి మీరు పెట్టిన పేరు బాగుంది.
ReplyDeleteకేవలం వార్తలు చూద్దామనుకున్నా మీరు చెప్పినట్లు ఒకే వార్త పదే పదే చూపిస్తారు.
వార్తా పిచ్చి ఎంత వరకు వచ్చిందంటే ఎవరైనా ఆత్మాహత్య చేసుకుంటే వారిని ప్రశ్నలతో వేదించి హత్య చేసినంత పని చేస్తున్నారు.
చదివిన మీకు థాంక్స్.
టైటిల్ చూసి ఏదో అనుకున్నాను. గృహ హింస...హహహ
ReplyDeleteచేదుమాత్రకు హాస్యంతో తీపిని అద్దారు. బావుంది ఫాతిమా గారు.
జ్యోతి గారూ, ఏమి చేద్దాం మీ లాంటి వారిని వల వేసి పట్టుకోవాలి మరి, అందుకే ఇలాంటి టైటిల్స్.
ReplyDeleteధన్యవాదాలు మెచ్చిన మీకు.....మెరాజ్
హింస అంటూనే అలరించారు. మను కి యోగ ఎప్పుడు నేర్పిస్తారు.
ReplyDeleteరెండో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాం .
సర్, హింసను హంసగా మార్చాను చూసారా?
ReplyDeleteఈ సారి మీ కామెంట్ లేకపోతె హింసకి దూరంగా ఉన్నారేమో అనుకున్నాను.
ఎలాగైనా మనూ చేత యోగా చేయించాలి. చూసారుగా ఎలా తప్పించుకున్నాడో చీర అడిగితే, ఈ తెలివైన వాళ్ళు టి.వి. చూడరు ..
రెండవ ఎపిసోడ్ త్వరలో రాస్తాను.
కథ చదివిన మీకు ధన్యవాదాలు.
Fathimaa gaaru..
ReplyDeletenijanga gruha himsa antee entoo anukuni chadivaanu.. Kani baagaa navvinchaaru:)
chinnigaaaru thanks mechhinaduku, naa blog ku vachhinanduku.
ReplyDeleteటి.వి.లో వచ్చే కార్యక్రమాలపై మీ వ్యాసం బాగుంది.కొన్ని మంచివి ఉన్నాయి.ఏదైనా సమతూకం మంచిది.
ReplyDeleteఅయ్యో లేదన్నదేవరూ.. వాటి కోసం వెతుకుతూనే కదా ఈ మహా కళా ఖండాలకు బలైపోతున్నది.
ReplyDeleteపోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు శేఖర్ గారు.
హహహ! యేళ్ళు అయిపోతోందండీ టీవీ చూసి :(
ReplyDeleteadrustavanthulu..deergaayushmaanbhava
ReplyDeleteఈ పోస్టు లేటుగా చూసానండీ. భలే బాగుంది.మరి రెండో భాగం ఎప్పుడు? ఎదురు చూస్తున్నాను.
ReplyDeleteసర్, హాస్య కథ నచ్చినందుకు ధన్యవాదాలు రెండవ భాగం పెడతాను తప్పకుండా మీరు చదువుతానన్నారు కదా దైర్యం వచేసింది.
ReplyDelete