Pages

Sunday, 26 August 2012

అంతరాన...


అంతరాన...

అప్పుడప్పుడూ నా అంతరంగం తనలోకి నన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది.

లోపల ఎంత భయంకర నిశ్శబ్దమో...ఎన్ని మణుగుల తిమిరమో.

అప్పుడప్పుడూ ఓ కాంతి పుంజం, ఆశగా మిణుగురు పురుగులా మెరుస్తూ మురిపిస్తూ ఉంటుంది.

బ్రతుకు పేజీలు తిప్పటానికి బైటకి వస్తాను.

ఇక్కడంతా గజి,బిజీ అడుగులే, అసంధర్బపు ఆరాటాలే.

అక్కర లేని అనుబంధాలే, అనవసరపు ఆర్బాటాలే.

కావిళ్ళ కొద్దీ కాలయాపనలే, కలల నిండా కల్పనలే.

భావాలకందని భాషలే, బలవంతపు బాద్యతలే.

మాటల గారడులే, మంచు అక్షర కావ్యాలే.

అపనమ్మకాల అంపశయ్యలే, అలసట ఎరుగని నిరీక్షణలే.

అంతస్థులు ఎరుగని అత్యాశలే, అందనివాటికై నిచ్చేనలే .

కాలిన గుండెలో ఘోరమైన గాయాలే, అవి నిత్యం పలికే గేయాలే.

అదిగో అప్పుడే నా అంతరంగం నను ఆహ్వానిస్తూ ఉంటుంది.

నాలోకి నేను చొచ్చుకొని, నాకై నేను నొచ్చుకొని,

నన్ను నేనే హత్తుకొని, నన్ను నేనే మెచ్చుకొని,

నన్ను నాకే అర్పించుకొని, నన్ను నేనే శిక్షించుకొని.

నన్ను నేనే ఓదార్చుకొని, నన్ను నేనే రక్షించుకొని.


నా... నేను.... నాకై ...నాలో... దాగిపోతున్నాను...

57 comments:

 1. ఫాతిమా అక్క చాలా బాగుంది కవిత..
  ఇన్ని రోజులూ మిస్ అయిన వాటిని వరసగా చదివేసాను.. అన్నీ చాలా బాగున్నాయి...

  ReplyDelete
  Replies
  1. Very nice..keep continue. Goodluck.

   Delete
  2. సాయి, చాలా కాలం తర్వాత మీ కామెంట్ చూసినట్లుంది.
   తమ్ముడూ కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...

   Delete
  3. రాజా రావు గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 2. ఒక ఫీలింగ్ ను అలా యధాతధంగ పరిచినట్లున్నారండి.ముసుగేయకుండా.....

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారూ, కవితను విశ్లేషించిన మీకు ధన్యవాదాలు.
   నచ్చినందుకు కృతజ్ఞతలు.

   Delete
 3. Replies
  1. Ramesh gaaru, blog dharshinchina meeku dhanyavaadaalu. baagundi annaaru thank you.

   Delete
 4. అదిగో అప్పుడే నా అంతరంగం నను ఆహ్వానిస్తూ ఉంటుంది.
  నాలోకి నేను చొచ్చుకొని, నాకై నేను నొచ్చుకొని,
  నన్ను నేనే హత్తుకొని, నన్ను నేనే మెచ్చుకొని,
  నన్ను నాకే అర్పించుకొని, నన్ను నేనే శిక్షించుకొని.
  నన్ను నేనే ఓదార్చుకొని, నన్ను నేనే రక్షించుకొని.
  నా... నేను.... నాకై ...నాలో... దాగిపోతున్నాను...

  అద్భుతమైన అంతరంగపు భావవల్లరి. చక్కటి కవితాఝరి.
  చాలా బాగుంది ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. భారతి గారూ, అంతరంగం అప్పుడప్పుడూ ఇలా భావాలను కురిపిస్తుంది.
   నచ్చిన మీ వంటి మిత్రులు మెచ్చుకుంటే ఇంకా పొంగిపోతుంది...మెరాజ్

   Delete
 5. లోపల ఎంత భయంకర నిశ్శబ్దమో...ఎన్ని మణుగుల తిమిరమో.
  మంచు అక్షర కావ్యాలే.
  కాలిన గుండెలో ఘోరమైన గాయాలే, అవి నిత్యం పలికే గేయాలే.
  నన్ను నేనే ఓదార్చుకొని, నన్ను నేనే రక్షించుకొని.
  నా... నేను.... నాకై ...నాలో... దాగిపోతున్నాను.....

  (ఎంత వేదన?..హృదయ రోదన...)
  ఇలాంటి పద ప్రయోగం కేవలం మీ సొత్తు...
  అభినందనలు మెరాజ్ గారూ!
  @శ్రీ

  ReplyDelete
  Replies
  1. శ్రీ గారూ, నా పద ప్రయోగం బాగుంది అన్నారు.
   మీప్రశంసకు ధన్యవాదాలు.
   నా ప్రతి కవిత చదివి నన్ను ప్రోత్శాహించే మీకు మరో మారు కృతజ్ఞతలు...మెరాజ్

   Delete
 6. >>బ్రతుకు పేజీలు తిప్పటానికి బైటకి వస్తాను.>>

  వెండి మబ్బులు, పిల్లతెమ్మెరలు, ఎగిరే గువ్వలు, పచ్చని చిగుర్లు మీకు స్వగతమివ్వాలని కోరుకుంటున్నాను ఫాతిమా గారు.

  ReplyDelete
  Replies
  1. జ్యోతి గారూ, మీ అభిమానం చూస్తే మనస్సు ఎంతో ఆహ్లాదంగా మారింది.
   ప్రతి మనిషి వెనుకా ఇంతటి ఆత్మీయ స్పందన ఉంటె వేదనలు పారిపోవా.
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.

   Delete
 7. "నన్ను నేనే మెచ్చుకొని,నన్ను నేనే శిక్షించుకొని."

  మనిషికి అంతరంగానికి మించిన ఆత్మీయ నేస్తం మరొకరు ఉండరేమోనండీ..
  అంతరంగభావాలను చాలా బాగా చెప్పారు..  ReplyDelete
  Replies
  1. రాజీ గారూ, మీరన్నది నిజమే అంతరంగమే మంచి నేస్తం .
   కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.....మెరాజ్.

   Delete
 8. చాలా బాగుంది ఫాతిమా గారు

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ, బహుకాల దర్శనం , ఎలా ఉన్నారు,
   కవిత చదివిన మీకు ధన్యవాదాలు....మెరాజ్.

   Delete
 9. తెలుగు భాషలో,తెలుగు పద ప్రయోగంలో , కవితావేశంలో - మాంచి పట్టు కనిపిస్తోంది .
  ఐతే , మన చుట్టూ అంతా అంధకారాన్నే వీక్షిస్తే ఎలాగండీ , ఫాతిమా గారూ!

  ReplyDelete
 10. సర్, ఇన్నాళ్ళకు నా శ్రమ ఫలించింది.
  ఈ ప్రశంస కోసమే నేను ఎదురుచూసింది.
  ఎప్పుడో పదవతరగతిలో ఉన్నప్పుడు తెలుగు మాస్టారు మెచ్చుకొనే వారు.
  ఇప్పుడు ఇంతటి గొప్పవారి మెప్పు పొందాను.
  నిజమే.. ఎక్కువగా చీకటే సుదూర తీరాల వరకూ ఆవహించిన భావన నన్ను వేటాడుతుంది.
  మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, మీ స్పందనకు కృతజ్ఞతలు.....మెరాజ్.

  ReplyDelete
 11. ఏకీభావం అంటే ఇదేనేమో!మనలోకి మనం ఏకాంతం లో వెళ్ళటం గురించి వ్రాసాను నేను ఏకాంతం పోస్ట్ లో.మీరు ఇలా కవిత రూపం లో పలికించారు.కవితా గమనం చాలా బాగుంది.కానీ మనలో ఉండే నిశ్శబ్దం కూడా మనకు భయంకరంగా ఉంటె చాలా కష్టమేమో నండి.ఆ నిశ్శబ్దం ఓ ఆనందలోకాన్ని సృష్టించాలి. అప్పుడే బాహ్య ప్రపంచపు ఒత్తిడిని తట్టు కోగలుగుతాము.

  ReplyDelete
  Replies
  1. రవి శేఖర్ గారూ, నిజమే అంతరాన కూడా నిశబ్దం అయితే భయంకరమే, కానీ అందమైన ఊహలు ఎక్కువసేపు నిలవవు.
   కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.....మెరాజ్

   Delete
 12. మీ అంతరంగాన్ని అందంగా అలంకరించారిక్కడ!

  ReplyDelete
  Replies
  1. కవిత చదివిన మీకు ధన్యవాదాలు పద్మగారూ.

   Delete
 13. ఒంటరి తనం చిక్కగా అలుముకున్నట్లు ఉంది కవిత
  దీపావళి వెలుతురులు మీ అంతరంగాల నిండాలని
  తిమిరాలు పరుగులెట్టి పారిపోవాలని
  కోరుకుంటున్నాను.
  వెంటనే స్పందించలేకపోయాను, ఎందుకంటే కవిత చదివితే
  బాగా దిగులేసింది.
  మీ బ్లాగ్ విజిట్ చేసే మిత్రులందరికి నా బ్లాగ్ చూడడానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను.
  గుడ్ నైట్!

  ReplyDelete
  Replies
  1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
   మీ దీవనలకు కృతజ్ఞతలు.
   మీ ఆహ్వానాన్ని నా బ్లాగ్ మిత్రులు తప్పకుండా స్వీకరిస్తారని ఆశిస్తూ....మెరీజ్

   Delete
 14. చాలా బాగాచెప్పారు.

  ReplyDelete
  Replies
  1. సృజన గారూ, మెచ్చుకున్నా మీకు ధన్యవాదాలు.

   Delete
 15. కావిళ్ళ కొద్దీ కాలయాపనలే, కలల నిండా కల్పనలే.
  చాలా హత్తుకుందీ వాక్యం..
  కవిత ఆసాంతం ఒకే బిగువును కొనసాగించిన తీరు చాలా నచ్చింది..అభినందనలు ఫాతిమాజీ...

  ReplyDelete
  Replies
  1. వర్మాజీ, మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
   మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.

   Delete
 16. "బ్రతుకు పేజీలు తిప్పటానికి బైటకి వస్తాను." చాలా నచ్చిన వాక్యమిది ఫాతిమాజీ..ఎప్పటిలా మీ కవిత రకరకాల భావనల మిశ్రమంగా ఉండి ఆకట్టుకుంది. అభినందనలు

  ReplyDelete
  Replies
  1. వాసుదేవ్ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 17. ఫాతిమాజీ, మీకు మెయిల్ పంపాలంటే మీ మెయిల్ ఐడీ మీ ప్రొఫైల్లో లేదు. నా ఐడీ ఇది vasudevadari@gmail.com
  దీనికి ఓ టెస్ట్ మెయిల్ పంపుతారా? కృతజ్ఞతలు

  ReplyDelete
 18. కవితలో ఆఖరి అయిదు లైన్స్ ఎంత బాగా ఆవిష్కరించారు..మేరాజ్ .
  ఆత్మ విశ్లేషణ చేసుకోవడం, దానిని బహిరంగంగా భావప్రకటనతో కవితగా అలరించ గలగడం .. చాలా బావుంది.
  నాకు బాగా నచ్చింది. అభినందనలు

  మీరు మీలోనే దాగి పొండి. అంతఃచక్షువులతో అయినా.. నెచ్చెలి మనసున దాగినది చూస్తుంటాను. :):)

  ReplyDelete
 19. వనజా, మీ ప్రశంసకు కళ్ళు చమర్చాయి. మొదటినుండీ నా కవిత్వాన్ని నడిపించిన వారిలో మీరూ ఒకరు.
  మీకు ఆరోగ్యం బాగాలేదని మాట్లాడాలి అనుకున్నాను ఎలాగో తెలీలేదు, నా ప్రార్దన ఆలకించి దేవుడు త్వరగా నా బ్లాగ్లో ఇలా పంపాడు.
  నా కవితా భావం నచ్చినందుకు ధన్యవాదాలు.....మీ మెరాజ్.

  ReplyDelete
 20. అంతరంగపు ఆవేదన బాగుందండీ..మొదటిసారి చూడ్డం. మీ బ్లాగు బాగుందండి.

  ReplyDelete
 21. సుభామేడం గారూ, నా బ్లాగ్ కి స్వాగతం మీ వంటి చిత్రకారిణి నా కవిత మెచ్చుకోవటం సంతోషం.
  నేను మీ వ్యాఖలు ఇతర బ్లాగుల్లో చూశాను, మీ బ్లాగ్ చూస్తాను మేడం......మెరాజ్.

  ReplyDelete


 22. http://telugulocomputer.blogspot.in

  ReplyDelete
 23. మొదటిసారి చూస్తున్నాను మేడమ్ మీ బ్లాగ్. బాగుంది.

  ReplyDelete
 24. sisira garu naa blog ki swagatham. baagundi annaaru santhosham

  ReplyDelete
 25. Replies
  1. కిట్టు గారూ,థాంక్స్

   Delete
 26. అంతరంగాన్ని యధాతధంగా ఆవిష్కరిస్తే ఇలా సహజ కవిత అవుతుందేమో!

  ఇలాంటప్పుడే అనిపిస్తుంది ' మనసున మనసై ... బ్రతుకున బ్రతుకై... తోడొకరుండిన.. అదే భాగ్యమూ ..." అని.

  బాధగా మనసు పాడుకుంటుంది ' మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడూ...మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ ..." అని

  మీ అంతరంగ ఆవిష్కరణల కవితా సమాహారం బాగుంటుందోండీ.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సర్, మీ విష్లేషణ బాగుంది

   Delete
 27. నిజంగా చాలా బాగా వ్రాశారు...
  అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు...
  అభినందనలు...

  ReplyDelete