నీ అంతరాత్మనే సంతకం గా చేయమన్నది.
ముఖ్యమే అనుకుంటావో..ముసాయిదా అనుకుంటావో,
చేదు విషపుసిరాతో నింపిన అక్షర వ్రణం.
ఆఖరి వీడ్కోలు వరకూ ఎదురుచూసిన ప్రణయం.
భగభగ మండే అగ్శిశిఖ సలసల కాగే తైల సెగ.
అనుభూతులను పాతిపెట్టిన వాస్తవ గాధ.
ముచ్చటైన పలుకులను గొంతులోనే నొక్కేసిన హత్యారి
హృదయాన్ని అర్పించి, శ్వాసని ఆపేసిన తలారి.
ఆరిపోయిన కణాలను సాగిపోతున్న క్షణాలతో కలిపే ప్రయోగి .
నమ్మకాన్ని అమ్ముకొని, ఆశను నమ్ముకున్న విరాగి.
కరిగిపోయిన కలను, తిరిగి
కాంచాలనుకునే
అత్యాశి.
తానూ పులిలా
కానరావాలనుకునే వాతలు పెట్టుకొనే జంబుకం..
ఎత్తైన సౌధాలను, ఒత్తైన అందాలను ఎదుర్కోలేని అనాకారి.
ఏడు అడుగులనూ, మూడు ముళ్లనూ నమ్మిన సంసారి.
నీటిపలక మీద గోటితో రాసిన అక్షర
శోకం.
కంటికొలికిలో ఒదగలేక ఒలికిపోయిన అశ్రుకణం.
కళ్ళముందే ఉన్నా కనిపించని శ్వేత పత్రం.
చెవి
చెంతనే ఉన్నా వినిపించని మరణ మృదంగం.
O teevramaina aavedananu ante teevramaina aagrahamto palikincharu Fatimali...abhinandanalu..
ReplyDeleteవర్మగారూ, కవిత మీ విశ్లేషణలో బాగుంది,
Deleteనిజమే ఒక్కోసారి తీవ్రమైన ఆవేదన వస్తుంది దాని అక్షర రూపం ఆగ్రహంగానే ఉంటుంది.
స్పందనకు ధన్యవాదాలు.
happy friendship day.
ReplyDeletebhaaskar gaaroo happy friendship day meku kooda.
Deleteహృద్యం గా రాసారండీ...!!
ReplyDeleteఏదో ఆవేశం అస్పష్టం గా ఊగిసలాడుతోంది...
సీత గారూ, కవిత కొంత ఆవేశంగా ఉన్నది నిజమే,
Deleteకవులకు ఎలాంటి భావం కలిగినా కాగితమే వేదిక కదా..
నవీన రచయిత్రిగారికి వేరే చెప్పాలా? చదివిన మీకు కృతజ్ఞతలు.
ఫాతిమ గారు! కవిత చాలా చాలా బాగుందండీ!
ReplyDeleteనాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteకవిత,చిత్రం రెండూ బాగున్నాయండీ..
ReplyDeleteHappy Friendship Day..!!
రాజీగారూ, కవిత చిత్రం నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteచదివిన మీకు కృతజ్ఞతలు.
అద్భుతమైన పదజాలం తో సాగింది కవిత. కానీ నేపధ్యం అర్థం కాలేదండి.వివరించగలరు.మీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
ReplyDeleteరవి శేకర్ గారూ, నేపద్యం అంటూ ఏమి లేదు మదిలో మెదిలే ఎన్నో భావాలకు అక్షర రూపం ఇవ్వాలనే తపన,
Deleteఅది తీవ్రమైన వేదనగా మారుతుంది .
ప్రతి కవి ఒక్కసారైనా ఈ స్థితి అనుభవిస్తాడు,
" అంతర్లాపి అంటేనే ఉత్తరములో అడగలేని అణిగి ఉన్నట్టి సమస్య " ఆ బావాన్నే పలికించాను.
కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
ముందుగా నేస్తుల దినం సందర్భంగా శుభాకాంక్షలు.
ReplyDeleteమీ కోపం అర్థమయింది. మీకు వెన్నెలరాజు చల్లదనాన్ని వెన్నెల బాలతో పంపి ఊరడించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఎందుకంటే బ్లాగు మిత్రులు కలవరపడుతున్నారు కవి కోకిలకు
కోపమెందుకా అని.
చూసారా, మీ కవితలు చదివి చదివి నాకు కూడా భాష కొంచెం
పట్టుబడుతోంది.
చిన్న సలహా: అశ్రువు అన్న చోట అశ్రు కణం ఎలా ఉంటుంది.
శుభరాత్రి మీ కుటుంబ సభ్యులందరికీను.
సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
Deleteఇక పోతే నా కవితలు చదివి మీకు భాష మీద పట్టు రావటం అనేది అతిశయోక్తి అనిపిస్తుంది.
ఓ పాపులర్ రచయిత ప్రశంస ఈ విదంగా అందుకోవటం ఆనందదాయకమే.
ఇకపోతే ఏదో భావావేశంలో రాసిన కవిత ఇది.
నా బ్లాగ్ మిత్రుల ప్రోత్సాహం లేకుంటే నేను ఇలా రాయలేనేమో,
ఫాతీమాగారి కోపమా!!!
ReplyDeleteలేక కవితా విలాపమా?
శాంతించి చిరునవ్వుతో
శుభాకాంక్షలు అందుకోమ్మా:-)
పద్మ గారూ, మీ లాంటి నెచ్చలి మీద కోపమా.. నెవ్వర్.
Deleteకవితా ప్ర..కోపమే. కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
ఏంటో Thank you అన్న బొమ్మ చూసి Friendship మీద ఏమో అనుకుని చదివితే...అమ్మో భయపెట్టేశారు కవితతో...
ReplyDeleteచిన్ని ఆశగారూ, మీకు తెలుసు కదా నా పోస్ట్స్ ఎప్పుడూ ఏదో మెలిక ఉంటుందని,(సరదాగా అన్నాను )
Deleteచదివినందుకు ధన్యవాదాలు.
అంతర్లీనమైన వేదన లావాలా బైటికి చిమ్మిన క్షణం
ReplyDeleteమీ కవితా విస్ఫోటనం...
చాలా బాగుంది కవిత...
అగ్నిశిఖ,జంబుకము..సరి చేసుకోండి ఫాతిమా గారూ!
@శ్రీ
శ్రీ గారూ, ఒక్కోసారి ఎన్నో భావాలు మిళితమై కవులను ఉక్కిరి,బిక్కిరి చేస్తాయి అలా చిమ్మిన లావా ఈ కవిత.
Deleteమీ ప్రశంసకు ధన్యవాదాలు. మీరు చెప్పిన సవరణలు చేసాను. మీకు కృతజ్ఞతలు.
ఎవరిమీదనో ఈ కోపావేశపు అణుబాంబు విస్పోటం ఫాతీమాగారు:)
ReplyDeletecongrats for new rhythm of words.
సృజన గారూ, అణుబాంబువిస్పోటనం కనుక తప్పకుండా పేలుతుంది.
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.
మిరాజ్,
ReplyDeleteకవిత అదిరింది . నిజానికి "అంతర్లాపి"అన్నది నాకు కొత్త పదం. మీలోని వేదన ఎంత అందమైన పదజాలాన్ని వెలికి తీసిందో ! అమ్మాయి అమెరికా ప్రయాణం తో తీరిక చిక్కి మీ అంతర్లాపి కంట పడింది. ఈసారి నేనూ కవిత రాస్తే కొంచం ఆలోచించాలేమో..ఇంతటి పదజాలం గుర్తుకు చేసుకునేందుకు...మనఃపూర్వక అభినందనలు
లక్ష్మి గారూ, ఎలా ఉన్నారు?
ReplyDeleteచాలా కాలం తర్వాత పలకరించారు.
ఫోన్ చేస్తారని ఎదురుచూసాను. కవిత నచ్చినందుకు చాలా థాంక్స్.
మీ ఆత్మీయ ప్రశంస నన్ను కదిలించింది. మీరూ చాలా బాగా రాస్తారు.
ఫాతిమా గారు చాలా బాగుంది.. ఏదో ఆవేశం కన్పిస్తుంది...
ReplyDeleteఎంతైనా టీచర్ గారిలా రాయడం ఎవరి వల్లా కాదు అండీ... హ్యాట్సాఫ్......
సాయిగారూ, విద్యార్ధిగా మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు.
ReplyDeleteకానీ నా ప్రతి కవితా క్రమం తప్పకుండా చదివి ఆత్మీయంగా ప్రశంసిస్తారు.
ఓ తమ్మునిలా అనిపిస్తారు నాకు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ఇప్పటి యువతరంలో సాహిత్యం మీద అభిలాష ఉన్న మీ వంటి వారిని ఎంతైనా అభినందించాలి.