Pages

Sunday 5 August 2012

అంతర్లాపి



అంతర్లాపి
నా  "అంతర్లాపి " ఎగిరి  వచ్చి నీ యెదుటనే  వాలింది, 
నీ అంతరాత్మనే సంతకం గా  చేయమన్నది.
ముఖ్యమే  అనుకుంటావో..ముసాయిదా అనుకుంటావో, 

చేదు విషపుసిరాతో  నింపిన  అక్షర వ్రణం.
ఆఖరి  వీడ్కోలు వరకూ  ఎదురుచూసిన  ప్రణయం.

భగభగ మండే  అగ్శిశిఖ సలసల కాగే తైల సెగ. 
అనుభూతులను పాతిపెట్టిన  వాస్తవ  గాధ.

ముచ్చటైన  పలుకులను గొంతులోనే  నొక్కేసిన హత్యారి 
హృదయాన్ని అర్పించి,  శ్వాసని  ఆపేసిన తలారి.

ఆరిపోయిన కణాలను  సాగిపోతున్న  క్షణాలతో  కలిపే   ప్రయోగి .
నమ్మకాన్ని అమ్ముకొని, ఆశను  నమ్ముకున్న  విరాగి.

కరిగిపోయిన కలను, తిరిగి   కాంచాలనుకునే  అత్యాశి.
తానూ  పులిలా  కానరావాలనుకునే వాతలు పెట్టుకొనే జంబుకం..

ఎత్తైన  సౌధాలను, ఒత్తైన అందాలను  ఎదుర్కోలేని  అనాకారి.
ఏడు అడుగులనూ, మూడు ముళ్లనూ నమ్మిన సంసారి.

నీటిపలక  మీద గోటితో  రాసిన అక్షర  శోకం.
కంటికొలికిలో ఒదగలేక  ఒలికిపోయిన అశ్రుకణం.

కళ్ళముందే ఉన్నా కనిపించని  శ్వేత పత్రం.
చెవి  చెంతనే ఉన్నా వినిపించని  మరణ మృదంగం.

26 comments:

  1. O teevramaina aavedananu ante teevramaina aagrahamto palikincharu Fatimali...abhinandanalu..

    ReplyDelete
    Replies
    1. వర్మగారూ, కవిత మీ విశ్లేషణలో బాగుంది,
      నిజమే ఒక్కోసారి తీవ్రమైన ఆవేదన వస్తుంది దాని అక్షర రూపం ఆగ్రహంగానే ఉంటుంది.
      స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. bhaaskar gaaroo happy friendship day meku kooda.

      Delete
  3. హృద్యం గా రాసారండీ...!!
    ఏదో ఆవేశం అస్పష్టం గా ఊగిసలాడుతోంది...

    ReplyDelete
    Replies
    1. సీత గారూ, కవిత కొంత ఆవేశంగా ఉన్నది నిజమే,
      కవులకు ఎలాంటి భావం కలిగినా కాగితమే వేదిక కదా..
      నవీన రచయిత్రిగారికి వేరే చెప్పాలా? చదివిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  4. ఫాతిమ గారు! కవిత చాలా చాలా బాగుందండీ!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. కవిత,చిత్రం రెండూ బాగున్నాయండీ..
    Happy Friendship Day..!!

    ReplyDelete
    Replies
    1. రాజీగారూ, కవిత చిత్రం నచ్చినందుకు ధన్యవాదాలు.
      చదివిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  6. అద్భుతమైన పదజాలం తో సాగింది కవిత. కానీ నేపధ్యం అర్థం కాలేదండి.వివరించగలరు.మీకు స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. రవి శేకర్ గారూ, నేపద్యం అంటూ ఏమి లేదు మదిలో మెదిలే ఎన్నో భావాలకు అక్షర రూపం ఇవ్వాలనే తపన,
      అది తీవ్రమైన వేదనగా మారుతుంది .
      ప్రతి కవి ఒక్కసారైనా ఈ స్థితి అనుభవిస్తాడు,
      " అంతర్లాపి అంటేనే ఉత్తరములో అడగలేని అణిగి ఉన్నట్టి సమస్య " ఆ బావాన్నే పలికించాను.
      కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  7. ముందుగా నేస్తుల దినం సందర్భంగా శుభాకాంక్షలు.
    మీ కోపం అర్థమయింది. మీకు వెన్నెలరాజు చల్లదనాన్ని వెన్నెల బాలతో పంపి ఊరడించాలని మనసారా కోరుకుంటున్నాను.
    ఎందుకంటే బ్లాగు మిత్రులు కలవరపడుతున్నారు కవి కోకిలకు
    కోపమెందుకా అని.
    చూసారా, మీ కవితలు చదివి చదివి నాకు కూడా భాష కొంచెం
    పట్టుబడుతోంది.
    చిన్న సలహా: అశ్రువు అన్న చోట అశ్రు కణం ఎలా ఉంటుంది.
    శుభరాత్రి మీ కుటుంబ సభ్యులందరికీను.

    ReplyDelete
    Replies
    1. సర్, కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
      ఇక పోతే నా కవితలు చదివి మీకు భాష మీద పట్టు రావటం అనేది అతిశయోక్తి అనిపిస్తుంది.
      ఓ పాపులర్ రచయిత ప్రశంస ఈ విదంగా అందుకోవటం ఆనందదాయకమే.
      ఇకపోతే ఏదో భావావేశంలో రాసిన కవిత ఇది.
      నా బ్లాగ్ మిత్రుల ప్రోత్సాహం లేకుంటే నేను ఇలా రాయలేనేమో,

      Delete
  8. ఫాతీమాగారి కోపమా!!!
    లేక కవితా విలాపమా?
    శాంతించి చిరునవ్వుతో
    శుభాకాంక్షలు అందుకోమ్మా:-)

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, మీ లాంటి నెచ్చలి మీద కోపమా.. నెవ్వర్.
      కవితా ప్ర..కోపమే. కవిత చదివిన మీకు ధన్యవాదాలు.

      Delete
  9. ఏంటో Thank you అన్న బొమ్మ చూసి Friendship మీద ఏమో అనుకుని చదివితే...అమ్మో భయపెట్టేశారు కవితతో...

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారూ, మీకు తెలుసు కదా నా పోస్ట్స్ ఎప్పుడూ ఏదో మెలిక ఉంటుందని,(సరదాగా అన్నాను )
      చదివినందుకు ధన్యవాదాలు.

      Delete
  10. అంతర్లీనమైన వేదన లావాలా బైటికి చిమ్మిన క్షణం
    మీ కవితా విస్ఫోటనం...
    చాలా బాగుంది కవిత...
    అగ్నిశిఖ,జంబుకము..సరి చేసుకోండి ఫాతిమా గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, ఒక్కోసారి ఎన్నో భావాలు మిళితమై కవులను ఉక్కిరి,బిక్కిరి చేస్తాయి అలా చిమ్మిన లావా ఈ కవిత.
      మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీరు చెప్పిన సవరణలు చేసాను. మీకు కృతజ్ఞతలు.

      Delete
  11. ఎవరిమీదనో ఈ కోపావేశపు అణుబాంబు విస్పోటం ఫాతీమాగారు:)
    congrats for new rhythm of words.

    ReplyDelete
  12. సృజన గారూ, అణుబాంబువిస్పోటనం కనుక తప్పకుండా పేలుతుంది.
    మీ స్పందనకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  13. మిరాజ్,
    కవిత అదిరింది . నిజానికి "అంతర్లాపి"అన్నది నాకు కొత్త పదం. మీలోని వేదన ఎంత అందమైన పదజాలాన్ని వెలికి తీసిందో ! అమ్మాయి అమెరికా ప్రయాణం తో తీరిక చిక్కి మీ అంతర్లాపి కంట పడింది. ఈసారి నేనూ కవిత రాస్తే కొంచం ఆలోచించాలేమో..ఇంతటి పదజాలం గుర్తుకు చేసుకునేందుకు...మనఃపూర్వక అభినందనలు

    ReplyDelete
  14. లక్ష్మి గారూ, ఎలా ఉన్నారు?
    చాలా కాలం తర్వాత పలకరించారు.
    ఫోన్ చేస్తారని ఎదురుచూసాను. కవిత నచ్చినందుకు చాలా థాంక్స్.
    మీ ఆత్మీయ ప్రశంస నన్ను కదిలించింది. మీరూ చాలా బాగా రాస్తారు.

    ReplyDelete
  15. ఫాతిమా గారు చాలా బాగుంది.. ఏదో ఆవేశం కన్పిస్తుంది...

    ఎంతైనా టీచర్ గారిలా రాయడం ఎవరి వల్లా కాదు అండీ... హ్యాట్సాఫ్......

    ReplyDelete
  16. సాయిగారూ, విద్యార్ధిగా మీరు ఎంత బిజీగా ఉంటారో తెలుసు.
    కానీ నా ప్రతి కవితా క్రమం తప్పకుండా చదివి ఆత్మీయంగా ప్రశంసిస్తారు.
    ఓ తమ్మునిలా అనిపిస్తారు నాకు. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
    ఇప్పటి యువతరంలో సాహిత్యం మీద అభిలాష ఉన్న మీ వంటి వారిని ఎంతైనా అభినందించాలి.

    ReplyDelete