కొత్త బాటలో. ....,
మస్తిష్కాలు సైకత తీరాలు కాకముందే
మనసంతా ముళ్లజెముళ్ళు మొలవకముందే,
అదృశ్య బంధాలు ఆక్టోపస్లు కాక ముందే ,
గుండెల్లో విషాన్ని పిచికారీ చెయ్యకముందే,
వెన్నులేని వాగ్దానాలు వమ్ముకాకముందే ,
కన్నుగప్పి మనస్సును కమ్ముకోక ముందే,
మనో ఆకశాన స్వేఛా విహారానికై
మానసిక రెక్కలు విప్పే విహంగమై .....,సాగిపో ...(ఇదే స్వయ ఆవిష్కరణ)