రంగులడబ్బా సరిజేసుకో బిడ్డా .....
ఒకటే ఒర్లుడు , పోరగాల్లు తినేటివేన్దో పాడయి జచ్చినాయంట ,
అస్సలు గీళ్ళకి తెల్సా.. ..,
అస్సలు గీళ్ళకి తెల్సా.. ..,
మా ఇంట్ల పోరగాల్లకి బువ్వ దొరుకుడే కష్టం ,
గాయమ్మ ఎవ్వరో సిన్మాపోరినట ఎవ్వనినో ప్రేమించినదనీ... ,
పెళ్ళిలో కెల్లి పారిపోయినాదనీ .... ఒకటే సూపెట్టుడే ,
కులపోల్ల అదిలింపుల్లో ... ..పురుగుల మందు దాగి,
ఊరిపొలిమేరల్లో పోయిన మన ఊరి పోరి కనిపించలేదారా...?
అరె బస్టాపలకెల్లి బద్మ్మాష్ గాళ్ళు ,
ఆడపోరిలను ఆగమ్జేస్తుండ్రు గదా... గది కన్పడదా.... ?
గాయనెవరో పైదేశానికెల్లి పైసలుబోసి పొట్ట మెలికలు దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ కడుపుతోనున్న ఆడకూతురు ఆసుపత్రిబైటనే పురుడుబోసుకొని పీనిగయ్యింది,
గాయనెవరో పైదేశానికెల్లి పైసలుబోసి పొట్ట మెలికలు దిప్పుచ్చుకున్నాడంట ,
ఇక్కడ కడుపుతోనున్న ఆడకూతురు ఆసుపత్రిబైటనే పురుడుబోసుకొని పీనిగయ్యింది,
గది కానొస్తలేదారా మీకు ,
సూటూ బూటూ ఏసుకున్నోల్లనో,
సినిమా హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సూటూ బూటూ ఏసుకున్నోల్లనో,
సినిమా హీరోలనో,
కాలేజీ పోరగాళ్ళనో,
సైబరు కేటుగాళ్లనో ,
షాపింగ్ బేరగాళ్లనో ,
దొంగనోట్ల దొరగాల్లనో ,
కబ్జాల గజ్జిగాల్లనో,
దొంగ బాబాగాల్లనో ,
రంగుటుంగరాల్లోల్లనో , కాదురా మీ ఇంటర్యూలతో ఊదరగొట్టుడు....,
ఇల్లులేనోళ్లనీ, కళ్ళులేనోళ్లనీ, రోగాలు ముసురుకున్నోల్లనీ, మురికి కాలువల్లో కాపురమున్నోల్లనీ, దోమలతో దోస్తీజేసేటోల్లనీ, ముస్టోల్లనీ, కుస్టోల్లనీ, అనాథలనీ, అన్నార్తులనీ ...ఇంటర్యూ జేయండి ...., గాళ్ళ లొల్లి ఏందో ఎల్లబెట్టుండ్రి .
రంగుల డబ్బాకు హంగులే కాదు ఆకలి జూపించుడు ఎప్పటికీ తెల్వదా ???