Pages

Friday, 14 August 2015

నువ్వేనా...?నువ్వేనా...?

సుదీర్గ    నిశ్శబ్దం   ఆవల ,
అనంత  ఒంటరితనం  వెనుక  నక్కిన ,
అలుపెరుగని  నా  మనో కలల
అన్వేషితవు  నీవేనా...?


నా భుజం  పై  నేనే  తలవాల్చుకొని ,
ఒకింత  ఓదార్పుని  ఆశించిన  క్షణాన,
వెన్నంటి   ఉన్న  మనో చాయని ,
ఏమార్చిన   విభావరి   నీవేనా..?


కల్లోలిత    నదీమ  జలాన్ని  ఈదలేని ,
నా  అనాశక్తనో,  రేరాజుకై  తపించే,
నా  అర్ద ఊపిరినీ ...ఆపాలని  చూసిన,
అమావాస్య  నిశాచరి  నీవేనా..?


వేల మొక్కుల  అనంతరం ,
నేలకు  దిగిన  రేరాజు  రేయంచులో,
నను  పలకరించు  వేళ ,
శబ్దించిన  ఆ  అపశృతి   నీవేనా  ......?


ఇంతకీ ...,

నువ్వు   నీడవా... ?  జాడవా ...? మనో  దారివా ...?1 comment: