

శిల వంటి మమ్ము శిష్యులు చేసుకొని మాకో రూపమిచ్చిన "అక్షర శిల్పివి"
బలపం పట్టలేని మాచిట్టి వేళ్ళకు అక్షరాలు దిద్దటం నేర్పిన "అయ్యవారివి"
బడికి వచ్చిన మాకు భవిత బంగరు భాటవేసిన "బోధకుడివి".
బడికి వచ్చిన మాకు భవిత బంగరు భాటవేసిన "బోధకుడివి".
చదువునీ, సంస్కారాన్నీ ఒకేసారి నేర్పగల "సవ్యసాచివి".
తప్పుచేసిన మమ్ము సరైనదారిలో పెట్టే "దయామయుడివి"
విద్యతో పాటు వివేకాన్ని ప్రసాదించిన "విజ్ఞాతుడివి"
దైవం కన్నా ముందు శ్రేణిలో ఉన్న "గురుదైవానివి"
ఎల్లలు ఎంచక మమ్ము ఒక్క తాటిపై నడిపే "సూత్రదారివి"
అక్షరాలూ దిద్దే వేళ ఒడిని చేర్చుకొనే "అమ్మ పాత్రదారివి".
గుప్పెడు అక్షరాలను మా దోసిట పోసిన "అక్షర దాతవి"
స్వార్ధం లేని సంస్కారివి, మా రాతలను నిత్యం సరిచేసే అభినవ బ్రహ్మా....
మీకు అక్షరాలతో అంజలి ఘటిస్తున్నా.
happy teachers day fathima garu.
ReplyDeleteThank you bhaaskar garu.
Deleteఏయుగమందు గాని , ఎపుడేనియు అన్నిట విద్య గౌరవా
ReplyDeleteధ్యాయము గల్గి పెంపెసగు - దానికి బోధకులౌటచే ఉపా
ధ్యాయులు గౌరవాస్పదులు - తామును ఆ మహనీయ గౌరవా
ధ్యాయము గల్గు నొజ్జలు గదా ! విను తింతును మిమ్ము ఫాతిమా !
----- సుజన-సృజన
సర్, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteగురువర్యులైన మీకు నా వందనాలు.
ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు.
ReplyDeleteప్రేరణ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteశ్రీ గురుభ్యోనమః
ReplyDeleteసర్, మీకు నా వందనాలు.
Deleteమీ స్పందనకు నా కృతజ్ఞతలు...మెరాజ్.
అక్షరాంజలి ఘటించిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ReplyDeleteపద్మ గారూ, మీకు నా ధన్యవాదాలు.
Deleteఉపాధ్యాయులగురించి చక్కటి కవితామాలిక అల్లారు. ఆ దండ మీ మెడలో కూడా వేయాలి. మీకు కూడా ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు!
ReplyDeleteసర్, నేను కూడా మీ అభినందనల మాల వేసుకున్నాను.
Deleteమీ సమయం వెచ్చించి నన్ను అబినందిన్చినందుకు మరీ,మరీ, కృతజ్ఞతలు....మెరాజ్
మెరాజ్ గారూ!
ReplyDeleteచదువునీ సంస్కారాన్నీ నేర్పే సవ్యసాచి...
చక్కని భావం...
ఉపాద్యాయ వృత్తిలో ఉండి ,రచనా వ్యాసంగంలో కూడా
ఉన్నత స్థానాన్ని పొందిన మీకు
గురుపూజోత్సవ శుభాభినందనలు...
@శ్రీ
శ్రీ గారూ, కవితాభావన నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteనా వృత్తిని రచనలను ప్రశంసించిన మీకు నా కృతజ్ఞతలు..... మెరాజ్
ఓ అద్యాపకుడిగా మీతోనే నేనూను....మీ అక్షరాంజలిలీ నన్నూ గొంతుకలపనివ్వండీ
ReplyDeleteవాసుదేవ్ గారూ, తప్పకుండా కలపండి.
Deleteకవిత చదివిన మీకు ధన్యవాదాలు.
గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలండీ మీకు.
ReplyDeleteసుభామేడం గారూ,మేఎ అభిమానానికి ధన్యవాదాలు.
Deleteనా బ్లాగ్ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,...మెరాజ్.
teachers day shubhakankshalu ..teachergaru
ReplyDeleteMadam, dhanyavaadaalu. garu teesiveste santhoshistaanu...meraj.
Delete"అక్షరాలూ దిద్దే వేళ ఒడిని చేర్చుకొనే "అమ్మ పాత్రదారివి".
ReplyDeleteపూజ్యులైన గురువులకు మీరందించిన "అక్షరాంజలి" చాలా బాగుందండీ..
మీకు గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు!!
రాజీ గారూ, చాలా సంతోషంగా ఉంది.
Deleteమీరు శుభాకాంక్షలు అందుకున్నాను.
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...మెరాజ్
మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు ఫాతిమా మేడం :)
ReplyDeleteటపా బాగుంది అక్కా !
ధన్యవాదాలు హర్ష గారూ :)
Delete(తమ్ముడూ సంతోషం ) అక్క .
విధి నిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించే డా. సర్వేపల్లి రాథాకృష్టన్ గారి
ReplyDeleteజయంతి సందర్భంగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
నాగేంద్ర గారూ, ధన్యవాదాలు. ఎందుకో నా బ్లాగ్ మీద సీతకన్ను వేసారు.
Deleteఅలశ్యం గా చెపుతున్నాను. ఏమీ అనుకోకండి.
ReplyDeleteఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! కవిత ఎప్పటిలాగా చక్కగా ఉంది
వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితిగా ఉండేది. ఎందుకో ఈ సోదరి మీద అలుక పోయారు.
ReplyDeleteఎప్పుడైనా నా వ్యాఖ్యల ద్వారా నొప్పించానా?? మీ అభినందనలకు ధన్యవాదాలు.....మెరాజ్
వెన్నెల గారూ, మీ కామెంట్ లేకపోతె నా కవిత వెలితిగా ఉండేది. ఎందుకో ఈ సోదరి మీద అలుక పోయారు.
ReplyDeleteఎప్పుడైనా నా వ్యాఖ్యల ద్వారా నొప్పించానా?? మీ అభినందనలకు ధన్యవాదాలు.....మెరాజ్
అయ్యో! ఎంత మాటండి. అసలు అలాంటిదేమీ లేదు. నేను ఇండియా వచ్చాను కొన్ని వారాలు. అప్పుడు బ్లాగ్స్ చూడలేదు. తరువాత, కొంచెం మళ్ళి రొటీన్ లో పడటానికి టైం పట్టింది. కొద్దిగా హడావిడి సద్దుమునిగాక, ఇప్పుడే మళ్ళి రాస్తున్నా, బ్బ్లాగ్స్ చూస్తున్నా, కామెంట్స్ పెడుతున్నా...మీరు మరోలా భావించవద్దు మెరాజ్ గారు.
Deleteఎన్ని పదాలతో గురువును గౌరవించారండి గొప్పగా !చాలా ఆనందం కలిగించిన కవిత.
ReplyDeleteసర్, ఓ ఉపాధ్యాయులుగా మీకు తెలుసు గురువు స్థానం ఎటువంటిదో.
ReplyDeleteకవిత చదివి మెచ్చిన మీకు ధన్యవాదాలు.