అంతర్వేదన
నిరీక్షణా సాంధ్య నిశీధిలో ..నీకోసం నిత్యం వెతికే నిస్సహాయినై ...
చిద్రమైన స్వప్నసౌధాన పునాదితో సహా కూలిపోయిన కుడ్యమునై ..
ఏకాంత వనాంతర విహార వీక్షణలో ఎగిరే అలుపెరుగని విహంగమునై ..
గుండె అమ్ముకున్న నిను దయకోసం కోసం దేవురిస్తూ దేహీ అనే బిక్షువునై...
ఏ నగిషీ ఎరుగని నవ్వును ఎండిన పెదవులపై తేవాలనుకొనే వృదాప్రయాసినై...
కఠినశిలను కన్నీటితో కరిగించి ఇష్టరీతిలో మలచుకోవాలనుకొనే ఆశల వులినై...
ఎద చీకటి గదులలో జ్ఞాపిక దివ్వెతో తలపులను తడమాలనుకొనే అత్యాశి నై...
గాయమైన గేయం నుండి రక్తమోడుతున్న రాగాన్ని పలికించే వీణియనై....
ద్రవించే భావానికి స్రవించే అక్షరమోసగి నిగూడ అర్దాన్నిచ్చిన నిఘంటువునై..
ముక్కలైన గుండె శకలాలను శోక సంద్రాన గాలిస్తూ మునకలు వేస్తున్న నిరాదరినై ...
పెదవి దాటని మాటలు గొంతులో విచ్చుకత్తులై గుచ్చుతుంటే మూగభావపు మౌనినై...
పారిపోతున్న నీడవెంట నడుస్తూ నీ సహచరిని అనుకొనే తెరువరినై ...
జీవన పయోనిధిలో అంతరంగ తరంగ ఆటుపోట్లను ఎదుర్కొనే ఓటు పడవనై ...
నిరంతర నీ ద్యాసలో అలమటిస్తూ ఆఖరి శ్వాసవరకూ నీకై నిరీక్షించే అభిసారికనై...
సమస్యలూ .సందిగ్దాలూ ,అనుమానాలూ,అలసటలూ ,బాధలూ, బాధ్యతలూ,కష్టాలూ ,కలతలూ వెతలూ,వేదనలూ,
వృదాప్రయాసినై,ఆశల వులినై... ఇలా కొత్త కొత్త పోలికలతో దోసిట అక్షరలాతో మోకరిల్లారండి. చక్కగా వుంది.
ReplyDeleteభాస్కర్ గారూ, నా శైలి నచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteమీ అన్వేషణ...
ReplyDeleteచదువుతుంటే...
అభిసారిక అంతరంగం లోనే
ఈ వెదుకులాట సాగుతున్నట్లనిపించింది...
మీదైన బాణీలో
కవిత మొదటినుంచి చివరిదాకా
అక్షర ఖడ్గాలతో
స్వైర విహారం చేసారు.
చాలా బాగా వ్రాసారు...
అందుకోండి అభినందనలు మేరాజ్ గారూ!
@శ్రీ
శ్రీ గారు, మీ వ్యాఖ కు సంతోషం వేసింది.
Deleteనా కవిత అభిసారిక అంతరంగాన్ని తలపిస్తుంది అన్నారు,
నేను రాయాలి అనుకున్నది చెప్పగలిగాను అనే తృప్తి కలిగింది.
మీకు ధన్యవాదాలు నచ్చినందుకు....మెరాజ్
అక్షరాలతో శిక్షలే కాదు
ReplyDeleteనవరసాలను పలికించగలరు మీరు.
మీ భావుకతకు మోకరిల్లుతున్నాం.
అద్భుతమైన కవిత.
అనితర సాధ్యమైన కవితావేశం.
హేట్సాఫ్
సర్, మీ ప్రశంస కళ్ళలో నీరు తెప్పించింది . నా భావుకతకు మోకరిల్లిన మీ నిరాడంబరత గొప్పది.
Deleteప్రముఖ మాస,వార పత్రికలలో మీ కదానికలు, ధారావాహికలు వస్తున్నా, ఏనాడు మిమ్ము ప్రశంసించలేక పోయాను.
నా కవితలకు సమయం వెచ్చించి,చదివే మీకు రుణపడి ఉంటాను.
పారిపోతున్న నీడవెంట నడుస్తూ నీ సహచరిని అనుకొనే తెరువరినై ...
ReplyDeleteజీవన పయోనిదిలో అంతరంగ తరంగ ఆటుపోట్లను ఎదుర్కొనే ఓటు పడవనై ...
నిరంతర నీ ద్యాసలో అలమటిస్తూ ఆఖరి శ్వాసవరకూ నీకై నిరీక్షించే అభిసారికనై...
అంతర్వేదనను ఆవిష్కరించిన శైలి అద్భుతంగా వుంది ఫాతిమాజీ..మీ భావ ఝరికి అక్షర నీరాజనాలు..
వర్మ గారూ, నా కవితని మీరు విశ్లేషించిన తీరు నాకు నచ్చుతుంది.
Deleteసాటి కవిగా నా భావుకతను మెచ్చుకున్న మీ సహృదయతకు కృతజ్ఞతలు.
ఈ కవితను విశ్లేషించాలంటే మాటలు చాలటం లేదు.ప్రతి వాక్యం ఎంతో పదునైన పదాలతో శక్తివంతంగా సాగింది.
ReplyDeleteచిద్రమైన స్వప్నసౌధాన పునాదితో సహా కూలిపోయిన కుడ్యమునై ..
ద్రవించే భావానికి స్రవించే అక్షరమోసగి నిగూడ అర్దాన్నిచ్చిన నిఘంటువునై..
ఇలా ప్రతి వాక్యాన్ని ఎక్కుపెట్టిన బాణంలా గురి చూసి వదిలారు.ఇంత అద్భుత మైన కవిత వ్రాసిన మీకు అభినందనలు.
రవి శేఖర్ గారూ, ఓ కవయిత్రి కి ఇంతకంటే ఏమి కావాలి.
Deleteమాటలు చాలటం లేదు అనే మీ వ్యాఖ చాలు, నేను బాగానే రాసాను అనుకొనేందుకు.
నా ప్రతి కవితకి మీ ప్రోత్సాహం ఉండటం సంతోషదాయకం......మెరాజ్
నిరంతర నీ ద్యాసలో అలమటిస్తూ ఆఖరి శ్వాస వరకూ నీకై నిరీక్షించే అభిసారికనై...'
ReplyDeleteఅద్భుతంగా వ్రాసారు మెరాజ్ గారు!
Deleteనాగేంద్ర గారూ, చాలా సంతోషం నా కవిత నచ్చినందుకు.
మీ స్పందనకు కృతజ్ఞతలు ......మెరాజ్
ఫాతిమగారూ,
ReplyDeleteఅద్భుతమైన పదజాలంతో స్పష్టమైన భావంతో కవితను అత్యద్భుతంగా మలిచారు.
ప్రతి లైనూ అద్భుతంగా ఉంది. ఈ లైన్ మరీ మరీ నచ్చేసింది...
"కఠినశిలను కన్నీటితో కరిగించి ఇష్టరీతిలో మలచుకోవాలనుకొనే ఆశల వులినై..."
అభినందనలు!
చిన్ని ఆశ గారూ, నా కవితలోని భావం నచ్చినందుకు సంతోషం.
Deleteఅద్భుతమైన పదజాలం అన్నారు అదే నా కవితకి కిరీటం. మీ వ్యాఖ్య లేక చాలా కాలమైంది.....మెరాజ్
మీ భావుకత్వంకు తగ్గట్లు చక్కటి పదాల చేర్పు, కూర్పు, నేర్పు ... అద్బుతం మేరాజ్ గారు! చాలాబాగా వ్రాశారు.
ReplyDeleteభారతి గారూ, నా భావుకత్వం నచ్చటం నా అదృష్టం.
Deleteకవిత కూర్పు బాగుంది అన్నారు సంతోషం, అయితే ఓ కండిషన్ మీరు నా ప్రతి కవితా చదువుతానని మాటివ్వండి.:-) :-)
ధన్యవాదాలు మరోసారి...మెరాజ్
ఫాతిమా గారు మీ కవిత, ఎంచుకున్న చిత్రం రెండూ అద్భుతంగా ఉన్నాయి
ReplyDeleteమీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.రమేష్ గారు.
Deleteచిత్రం నచ్చింది అన్నారు. సంతోషం. నా ప్రతి కవిత చదువుతున్న మీకు నా కృతజ్ఞతలు...మెరాజ్
ఎలా చెప్పటానికి రావట్లదు
ReplyDeleteగాయమైన గేయం నుండి రక్తమోడుతున్న రాగాన్ని పలికించే వీణియనై....
ఎంత భావుకత
అక్షరగారూ, నా కవిత చదివిన మీకు ధన్యవాదాలు.
Deleteనా కవితలో భావుకత్వం నచ్చినందుకు సంతోషం....మెరాజ్
మీ అంతర్వేదనలోని ప్రతి లైన్ కాదు కాదు ప్రతి పదం చదివి పరవశమొందాను, చిత్రం కూడా చక్కగా ఉందండి.
ReplyDeleteపద్మగారూ, నా అంతర్వేదన నచ్చిన మీకు ధన్యవాదాలు.
Deleteచక్కటి కవితకు మీకు అభినందనలు.
ReplyDeleteవిజయమోహన్ గారూ, కవిత చదివి మెచ్చిన మీకు ధన్యవాదాలు.
Deleteబ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.
meekavitha superb!! bomma kudaa chala bagundi
ReplyDeleteLakshmi gaaru, kavitha chadivi mechhina meeku naa kruthagnathalu.
Deleteవేదనని కూడా అందంగా చెప్పారు ఫాతీమాగారు.
ReplyDeleteప్రేరణ గారూ, "బాదే సౌఖ్యమనే భావనరానీవోయ్" అన్నారు ఓ గొప్ప కవిగారు, అలాంటిదే ఈ ప్రయత్నం :-))
ReplyDeleteవినాయక చవితి శుభాకాంక్షలు!
ReplyDeleteelaani vignaalu lekundaa mee jeevitha sajaavugaa saagaaalani korukuntunnaanu bhaaskargaaru.
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteలాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం
లాస్య గారూ, మీకు కూడా చవతి శుభాకాంక్షలు.
ReplyDeleteబాగుందండీ.మంచి భావావేశం దానికి తగ్గ భాషా ఉన్నాయి మీలో.మామూలు పోస్టులలో అయితే ఫరవా లేదు కాని ఇటువంటి మంచి కవితలలో అక్షర దోషాలు పంటిక్రింద రాళ్లలాగే తగులు తాయి.ఎన్నో చోట్ల వత్తులు లేక పోవడం
ReplyDelete(చిద్రమైన,బిక్షువు,నిగూడ, అర్దాన్నిచ్చిన,పయోనిది, ద్యాస, సందిగ్దాలూ వంటివి.)శ కు బదులు గా స వాడడం( అత్యాసి)వంటివి పరిహరిస్తే కవిత పరిమళిస్తుంది.నిరాదరి అనే ప్రయోగం కొత్తగా ఉంది.అసలిలా ప్రయోగించ వచ్చునో లేదో పండితులే చెప్పాలి.ఒకప్పుడు ఇటువంటి పదం ఉందనుకున్నా అది నిరాదరం పొందిన వ్యక్తిని కాకుండా నిరాదరం చూపించిన వ్యక్తిని సూచిస్తుందేమో? నాకైతే తెలియదు.సాంధ్య నిశీధి--ప్రయోగం బాగులేదు. సంధ్యా సమయం అర్థరాత్రీ ఒకే సారి రావు కదా? ఏదైనా మీ కవితలు ఇంకా గుబాళించాలనీ నలుగురి మెప్పూ పొందాలనే కోరిక తోనే ఈ రెండు ముక్కలూ రాసేను.తప్పుగా అర్థం చేసుకోరనే తలుస్తాను.
sir మీకు మొదట నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ReplyDeleteనా రాతలన్నీ ఓపిగ్గా చదివినందుకు. సర్, మీరన్నట్లు అక్షర దోషాలు చాలా దొర్లుతున్నాయి,
దానికి కొంత నా నిర్లక్ష్యం కూడా కారణం (సమయం వెచ్చించ లేక పోవటం) ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను. ఇకపోతే నిశాచరి పద ప్రయోగం సరైనది కాదు కనుక దానిని నిస్సహాయిగా సరిచేస్తాను. "నిరాదరి " అను పదం కొందరు కవులు వాడుతున్నదే బహుశా అది ప్రక్షిప్తం అయిఉండవచ్చు. మీకు మరో మారు నా ధన్యవాదాలు.