Pages

Sunday, 23 September 2012

నిరుక్త





నిరుక్త

కలలకి ఆకారమయిన చిరు మొలకవి.

కష్టాలకొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి.

నిరుపేద ముంగిట వెలసిన చలువ పందిరివి.

కలల పంటవైన నిను మోసిన అమ్మ,

కరవు కాటకాలతో వడలిపోయిన కొమ్మ.

అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..

నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,

కంటి దీపమైన నీవు ఇంట వేలిగే వరకూ పంటి బిగువున బాధ నాపుకోగలిగింది.

తొమ్మిది నెల్లల్లో నీ బతుకు పుస్తకం అచ్చువేసింది.

తొలి పలుకుల్లో నీ ఆకారానికి ఆకృతిని ఇచ్చింది.

ఆఖరి పేజీలో తన ఆయువునే అంకితమిచ్చింది.

తన గర్భం నుండి దించి నిను ధరణి వితర్ది పై నిలబెట్టింది

"కంగారు తల్లి "లా నిను తోలుసంచిలో మోయలేక పోయింది..

జోల పాటలతో నిన్ను నిదురపుచ్చలేదు.

కర్మ సిద్ధాంతాన్ని నీ కాళ్ళకు చుట్టింది.

ఆకలి గ్రంథాన్ని నీ అరచేతిలో పెట్టింది.నీకు అందనంత దూరం వెళ్ళింది

చిరుచేపవైన నీవు వెతల వైతరణిని ఎలా ఈదగలవో..

చిన్న కురంగివి నీవు వేటసివంగులను ఎలా ఎదుర్కొగలవో..

కాలదోషం పట్టని ఈ బీదతనాన్ని ఎలా పారద్రోలగలవో...

***

చిన్ని వామనా భారతమ్మనడుగు అడుగు ఎక్కడ పెట్టాలి అని.

చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.

ధర్మభూమినడుగు ఈ దారిద్యపు ఖర్మ ఏమిటి అని..

కాళరాత్రి నడుగు కాంతి పుంజం ఎపుడొస్తుందీ అని.

నీ ప్రతి పనినీ పదును చేసుకో ..నీ బ్రతుకు బాటను చదును చేసుకో.

23 comments:

  1. చిన్ని కన్నకు మను గడ గురించి
    చక్కటి సందేశాన్ని ఎంత గాఢంగా చెప్పారో!
    అందరూ తినాలి. ఈ నేల అన్నపూర్ణ!
    శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. సర్, కాలే కడుపుతో ఉన్న ఎంతో మంది చిన్నికన్నల కడుపు నింపగలదు ఈ అన్నపూర్ణమ్మ.
      కానీ వారి దౌర్భాగ్యం వారికి అందకపోవటం. వస్తుంది కాలే కడుపుల ఆకలి బాదలు తీరే రోజు.
      నా కవితలు మెచ్చే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      Delete
  2. చిట్టి కుచేలా అన్నపూర్ణమ్మని అడుగు నా అన్నం ఏది అని.

    ఫాతిమా గారు
    భారతమ్మ లోటులేదు, పంచి పెట్టేవాళ్ళది పేరాశ.దుర్మార్గులు, దొంగలు రాజ్యాలేలితే కూడెక్కడండి! బాధని చాలా బాగా వ్యక్తం చేసేరు, మనసు కదిలించి నాచే ఇంత పెద్ద వ్యాఖ్య రాయించేసేరు.

    ReplyDelete
    Replies
    1. సర్, మీరన్నది నిజమే, భారతమ్మ తన బిడ్డలను ఒకే విదంగా చూస్తుంది.
      వీరికి దక్కాల్సిన వాటా మద్యలో రాబందుల పాలవుతుంది.
      నా కవిత కి ఇంత పెద్దగా స్పందించిన మీ పెద్దమనస్సుకు కృతజ్ఞతలు.

      Delete
  3. మెరాజ్ గారూ!
    ఈ సారి మీరు వ్రాసినది మీ శైలికి కొంచెం భిన్నంగా ఉన్నా...
    చివరి వాక్యాల్లో మీరిచ్చిన సందేశం లో మాత్రం అదే పదును ఉంది...
    భావాలు చక్కగా వ్యక్తీకరించిన మీకు అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ, నా కవితలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రశంసించే మీరు భిన్నమైన శైలిని గుర్తించటం అభినందనీయం.
      నా భావ వ్యక్తీకరణ నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు...మెరాజ్

      Delete
  4. అణువణువూ ఆరిపోతున్నట్లూ, ఆఖరి శ్వాస ఆగిపోతున్నట్లూ..

    నిప్పుల కొలిమి తానై నొప్పులు పడింది,

    మంచి కవితా ప్రయోగం.అమ్మతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

    ReplyDelete
    Replies
    1. శేఖర్ గారూ, కవితని మీరు విశ్లేషించిన తీరు నాకు నచ్చింది.
      ప్రతికవితకీ మీ స్పందన ఓ స్పూర్తిదాయకం. కవిత నచ్చిన మీకు నా కృతజ్ఞతలు

      Delete
  5. Last lines are too good.
    "నిరుక్త" టైటిల్ ఎవరికైన పేరులా పెట్టుకోవడానికి బాగుందండి:-)

    ReplyDelete
    Replies
    1. కవిత మెచ్చిన మీకు ధన్యవాదాలు పద్మ గారు.
      "నిరుక్త" పేరుగా బాగుంటుందా అయితే మన బ్లాగర్ మిత్రులకి అమ్మాయి పుడితే పెట్టేద్దాం.:)

      Delete
  6. మళ్ళీ కవితా బాణం సమాజంపై ఎక్కుపెట్టారు...
    ఒకటికి రెండు సార్లు చదివాకే సారాంశం అర్ధం అయ్యింది.
    చక్కగా చెప్పారు కవితలో సందేశం...
    నిరుక్త అంటే అర్ధం ఏంటి మెరాజ్ గారూ?
    ఈసారి ఆలశ్యంగా రాలేదు కదూ ;)

    ReplyDelete
  7. sir,niruktha ante "defined". in telugu "ardha nirvachanamu"

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారూ, కవిత నచ్చినందుకు, వెంటనే స్పందించినందుకు డబుల్ ధన్యవాదాలు.
      సమాజంలో నన్ను కలచి వేసే సంఘటనలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ భావ సంఘర్షణ.

      Delete
  8. ఈ కవిత చదివాక ఒకటి చెప్పాలనుంది మెరాజ్ గారు. మీరు మీ కవితల్ని కేవలం ఇక్కడ బ్లాగులో పోస్టుతూ ఫేస్ బుక్ లో కూడా రాయొచ్చుకదా? మీరక్కడౌన్నారో లేదో నాకు తెలీదు..కానీ ఫేస్ బుక్ లో ఇంకా ఎక్కువమంది చూసే అవకాశం ఉంది. it is an interactive platform. Your poetry will be read by many and you will receive many constructive critiques from many more. There is one group called "kavi sangamam" which is famous now. Of course it is up to you to choose your group where to post. and it is not my group and Im not endorsing any. I felt that you deserve a place there. it is a gateway to see the world, to see whats happening in poetry and other literary forms.Just give a thought.

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారు, నా కవితకు స్పందించిన మీకు నా ధన్యవాదాలు.
      నాకు " పేస్ బుక్" లేదు. మీ అభిమానానికి, సలహాకీ కృతజ్ఞతలు.
      నా భావాలను ఇలా మిత్రులతో పంచుకోవటం, అప్పుడప్పుడూ వాటిని అచ్చులో చూసుకోవటం తప్ప ఇంకేది చేయలేదు.
      ప్రయత్నిస్తాను "కవి సంగమం " లో చేరటానికి...మెరాజ్

      Delete
  9. సూటిగా సమాజాన్ని ప్రశ్నించి నిరుక్త అంటే మేం నిరుత్తరమవుతాం కదా ఫాతిమాజీ...అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. వర్మాజీ, సమాజాన్ని ఎలా ప్రశ్నించినా సమాదానం శూన్యం కదా..
      జవాబుదోరకని ప్రశ్నలే అన్నీ.. కవిత నచ్చిన మీకు ధన్యవాదాలు.

      Delete
  10. కవితకు అనుగుణంగ ఉండే ఫొటొ ప్రచురిస్తే ఇంకా బాగుంటుంది. చక్కని కవిత.ఇలాగే మీ కవితలు కలకాలం మమ్మల్ని కదలించాలని ఆశిస్తూ .అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. నరసింహ గారూ , నా బ్లాగ్ కి స్వాగతం మీ స్పందనకు ధన్యవాదాలు.
      మీరు సూచించినట్లు చిత్రం విషయంలో శ్రర్ధ తీసుకుంటాను.

      Delete
  11. చాలా బాగుందండీ.మంచి కవితలు వ్రాస్తున్నారు.అభినందనలు.

    ReplyDelete
  12. సర్, ధన్యవాదాలు. మీ ప్రశంసకు.
    నా ప్రతి టపా చదివి నాకు ఇంకా రాయగలిగే స్పూర్తినిస్తున్న మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  13. ఎప్పటిలాగానే మీ కవిత్వం.. ఆలోచింపజేసేలా చాలా చాలా బాగుంది.
    "నిరుక్త " అంటే ఇవ్వలేనిది..లేదా. తిరిగి రాని అని అర్ధమా!?
    ఆ పేరు ఎవరికీ వద్దు.. అనిపిస్తుంది..
    మేరాజ్.. మీ ప్రతి కవిత .. ప్రశ్నించే కవిత్వమే! వ్యవస్థలో మనం ఎలా ఉన్నామో తెలియ పరుస్తుంది.
    ఇలాటి కవిత్వమే .. కావాలి....రావాలి.
    అభినందనలు.

    ReplyDelete
  14. వనజా, కవిత నచ్చిన మీకు ధన్యవాదాలు.
    నా ప్రతి కవితా ఓ ప్రశ్న అయి కూర్చుంటుంది,
    నిజమే జవాబు దొరకని ప్రశ్నలే సమాజం నిండా.
    నా భావుకతను అర్ధం చేసుకున్న మీకు మరో మారు ధన్యవాదాలు...మెరాజ్

    ReplyDelete