Pages

Thursday 19 December 2013

అమ్మ

     






    అమ్మ

      నక్కిన నరాలను రిక్కించి వింటుంది,
      నీ మాటల్లో అమ్మ అనే పదం కోసం..

      నవరంద్రాలను  శ్రవణాలుగా  చేసుకొని వింటుంది,
      నీవు పిలిచే 
" అమ్మా" అనే పిలుపు కోసం.

      మసకబారిన    చూపులను సారిస్తుంది,
      ఎదురుగా  రావటానికి  కూడా ఇష్టపడని నీ కోసం.

      శుష్కించిన   దేహంతో   ఎదురుచూస్తుంది.
      పట్టెడన్నం పెడతావని.

      సమాదుల పక్కనే చతికిల బడి ఉంది. 
      సాగనంపటానికి 
నీకు  కష్టం లేకుండా, 

      రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
      జోల పాటలు జాలిపాటలుగా మారుతున్నాయి.

      నెత్తుటి సాక్ష్యాలు కుత్తుకని కోస్తున్నాయి.
      పండుటాకులను ఎండుటాకులుగా చేస్తున్నాయి.

      కళ్ళు తెరిచి చూడు నువ్వు ఎక్కికూర్చున్న నెత్తే,
      కళ్ళ ముందు నువ్వు పెట్టె కొరివి కోసం చూస్తుంది.

      కళ్ళు తెరిచి చూడు ఆ జుట్టు నీవు ఆడుతూ లాగినదే.
      తైల సంస్కారం  లేక పీచులా వేలాడుతుంది.  
      
      కళ్ళు తెరిచి చూడు ఆ గుండె, 
      నీవు ఆకలితో పారాడినదే.

      కళ్ళు తెరిచి చూడు ఆ చీరకుచ్చిళ్ళు ,
      బూచిని చూసి దడుచుకొని నువ్వు దాగినవే.

      వెతుకు,వెతుకు, నీ దేహమంతా వెతుకు
      ప్రతి కణమూ, ప్రతినరమూ నీ తల్లి పెట్టిన బిక్షే.

      అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే క్షణకాలాన్ని
      నీకే బిక్ష వేసి వెళ్ళింది, బ్రతుకు,నీ ఆకరి బ్రతుకు,

      మళ్ళీ పుట్టుక లేకుండా బ్రతుకు.
      అమ్మ అవసరం లేని, జన్మ ఉందేమో..చూసి మరీ బ్రతుకు.



8 comments:

  1. " అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే "అనే పాట గుర్తుకు తెచ్చారు . అమ్మను మించిన దైవం లేదని ఎప్పటికి తెలుసుకుంటారు .అమ్మా అని ఇంపుగ పిలువని నోరు కుమ్మరి తవ్విన మన్ను గుంటతో సమానమని ఎన్నిసార్లు చెప్పాలి .
    ఏమయినా మీ కవిహలు వాస్తవాలకు అద్దాలు మీరజ్ .

    ReplyDelete
  2. నీవు పిలిచే " అమ్మా" అనే పిలుపు కోసం. ఎదురుగా రావటానికి ఇష్టపడని నీ కోసం. శుష్కించిన దేహంతో .... కళ్ళు తెరిచి చూడు, నువ్వు ఎక్కికూర్చున్న నెత్తే, కళ్ళ ముందు నువ్వు పెట్టె కొరివి కోసం చూస్తుంది. ఆనాడు నీవు ఆడుతూ లాగినదే. తైల సంస్కారం లేక పీచులా వేలాడుతుంది. ఆ చీరకుచ్చిళ్ళు, బూచిని చూసి దడుచుకొని నువ్వు దాగినవే.
    నిజం చెప్పనా! నీ దేహం ప్రతి కణమూ, ప్రతినరమూ ఆమె పెట్టిన బిక్షే. అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే క్షణకాలాన్ని నీకే బిక్ష వేసి వెళ్ళింది, బ్రతుకు, నీ ఆఖరి బ్రతుకు, మళ్ళీ పుట్టుక లేకుండా బ్రతుకు. అమ్మ అవసరం లేని, జన్మ ఉందేమో .... చూసి మరీ బ్రతుకు.

    అమ్మని ఆదరించని అమ్మ ఉనికికి దూరంగా పారిపోయే ఏ మనిషైనా మనశ్శాంతిగా బ్రతకలేడు. అమ్మ మనసులో స్థానం కోల్పోవడం అంటే జీవనార్హతను కోల్పోయినట్లే
    అమ్మే ప్రకృతి
    నమస్సులు మెరాజ్ ఫాతిమా గారు.

    ReplyDelete
  3. అమ్మ అనే మాట పరమ పవిత్రం. స్త్రీ జన్మకు పతాక శీర్షిక.
    ఆ పదవిని అధిరోహించాక వారి తప్పులు కనబడవు.
    అందులే మన శాస్త్రాలు కూడా చెడ్డ కొడుకు ఉండొచ్చు
    కాని చెడ్డ అమ్మ ఉండదు అంటారు.
    కుపుత్రో జాయేత - క్వచి దపి కుమాతా న భవతి.

    ReplyDelete
  4. "అమ్మని తలిస్తే వ్యర్దమనుకొనే క్షణకాలాన్ని
    నీకే బిక్ష వేసి వెళ్ళింది బ్రతుకు.. నీ ఆఖరి బ్రతుకు,"......... ఇలా రాసే గుణం మీ కలానిదే.. నమస్సులు అక్కా....

    ReplyDelete
  5. చంద్రశేఖర్ సర్, శ్రీ గంగ సర్,సొదరి శోభా, నేస్తం దేవీ మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు.
    శొభా డియర్ మీ ప్రశంసకు మరో దన్యవాదాలు

    ReplyDelete
  6. మీ పుస్తకంపై రేడియోలో సమీక్ష వచ్చింది విన్నారా?
    కంగ్రాట్స్!

    ReplyDelete
  7. " రక్త సంబంధాలు రంగు మార్చుకుంటున్నాయి.
    జోల పాటలు జాలిపాటలుగా మారుతున్నాయి."

    ................. ఎక్సలెంట్. మారుతున్న మానవ సంబంధాలు పట్ల మీ కవిత చాలా బాగుంది.

    ReplyDelete
  8. ధన్యవాదాలు సర్,మీ ప్రశంసకు సంతొషం కలిగింది.

    ReplyDelete