Pages

Saturday 23 November 2013

హితుడా....

      





      హితుడా.... 

       జీవితంలో కోతకు  గురవుతుంటే... 
       అరుదెంచిన స్నేహితుడా.. 

       రెక్కల  గుర్రాన్నెక్కి  గగనాన  ఊరేగుతుంటే..
       వాస్తవ కళ్ళాన్ని  అందించిన  మిత్రుడా.. .... 

       దు:ఖపు  సంద్రాన   దిక్కుతోచక  వెక్కుతుంటే.... 
       చుక్కానిలా  దారిచూపిన  నావికుడా..

       అహింసా వాదాన్ని   తలకెత్తుకుంటే.... 
       సరయినదే అని  సమర్ధించిన  అభినవ బుద్దుడా... 

       ఆత్మీయుల  కోసం  అలమటిస్తుంటే..,
       ఆత్మబంధువు  నేనే అని పలికిన శ్రీకరుడా.. 

       పరిత్యజించిన  అనుభవ జ్ఞాపకాలన్నీ  వెన్నాడుతుంటే.. 
       అమ్మలా  అక్కున చేర్చుకున్న ఆత్మీయుడా... 

       గువ్వగానో.., గులాబి పువ్వుగానో..,నవ్వుగానో..,నడిచే దివ్వెగానో..,
       నా అక్షరాన్ని మలచి  నీకు  అంకితమిస్తాను. 



10 comments:

  1. గువ్వగానో.., గులాబి పువ్వుగానో..,నవ్వుగానో..,నడిచే దివ్వెగానో..,
    కవిత బాగుంది.
    ఇంత అద్భుతంగా పదాలను అమర్చే నేర్పు
    ఆ భగవంతుడు మీకు ఇచ్చిన వరం
    శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. సర్, అందమైన పదాల పొందిక దేవుడిచ్చిన వరమే..
      కానీ నా అక్షరాన్ని గుర్తించి ప్రొత్సహించిన మీకు నా కృతజ్ఞతలు.

      Delete
  2. హితుడు చెప్పేదెపుడూ, హితమే !
    కోరుకునేది, స్నేహితమే !
    ఆశ్రు నయనాలలో ,
    ఆనందమే !
    ఎడబాటు లో, ధైర్యమే !
    తడ బాటు లో, స్థైర్యమే !
    అందరమూ ' ఈ స్నేహితుల'మైతే ,
    అతి మధురం, ఈ జగమే !

    ReplyDelete
    Replies
    1. సర్,
      కానీ హితుడు మాత్రమే సన్నిహితుల జీవనాన్ని పరిరక్షించగలడు.
      కనీసం కన్నీరయినా తుడవగలడు.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  3. జీవితంలో కోతకు, నరకయాతనకు గురయ్యినప్పుడు, దు:ఖ సంద్రాన దిక్కుతోచక వెక్కుతూ ఈదుతున్నప్పుడు, ఆత్మీయుల కోసం అలమటిస్తున్నప్పుడు, పరిత్యజించిన అనుభవాల జ్ఞాపకాలు వెన్నాడుతుంటే నేనున్నానని చెయ్యందించిన నీకు .... ఒక గువ్వగానో, గులాబి పువ్వుగానో, నవ్వుగానో, నడిచే దివ్వెగానో, నా అక్షర పుష్పాలు, ఖడ్గాల్ని .... మనసు కాగితం పై పరిచి అంకితమివ్వాలనుంది .... ఓ హితుడా!
    అంటూ రాసిన కవిత లో ఒక మనిషి కి మరో మనిషికి మధ్య ఉండాల్సిన స్వచ్చ స్నేహ భావన ఆవశ్యకత కనిపిస్తుంది. ఆ హితుడికి, మీ కవితకు అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

    ReplyDelete
  4. నిజమే.. ఎక్కడ మంచిమనస్సు ఉంటుందో, ఎక్కడ దయా గుణం ఉంటుదో అక్కడ మానవత్వం ఉంటుంది.
    మనుషుల మద్య ఉండాల్సిన స్వచ్చ స్నేహ భావానికి నా అక్షరాన్ని అంకితమివ్వాలనే ఆశ నాది.
    అందరి మంచీ ఆశించే హితునికి నా అక్షరాంజలి.

    ReplyDelete
  5. అద్భుతంగా రాసారు. అటువంటి హితులు స్నేహితులైతే ఎంత అదృష్టం.

    ReplyDelete
    Replies
    1. నిజమే అనూ, అలాంటివారినే ఎన్నుకోవాలి స్నేహితులుగా.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  6. కవిత మొత్తంగా చాలా బాగుంది. చివరి ఈ లైన్ `గువ్వగానో.., గులాబి పువ్వుగానో..,నవ్వుగానో..,నడిచే దివ్వెగానో..,` ఇంకా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా కవితను నచ్చి మెచ్చిన మీకు ధన్యవాదాలు వర్మగారు.

      Delete