Pages

Wednesday, 13 June 2012

ఆ రాత్రి


ఆ రాత్రి 


అర్దరాత్రి  అయినట్లుంది,  "ఆమె ఎవరు" సినిమాలో లాగా దగ్గరగా ఊరకుక్కల అరుపులు, దూరంగా నక్కలు ఊళలు వినిపిస్తున్నాయి.  తమ  కడుపులు కాల్చిన  ఈ కాలనీవాసులు ఎలా   నిద్రపోతారో చూద్దాం  అనుకున్నాయి  కాబోలు.

చీకటి  చాలా భయంకరంగా ఉంది. చెట్లన్నీ   మత్తుగా  ఊగే  ఆడ  దయ్యాల్లా కనిపిస్తున్నాయి.  అభిలాష్  "శ్యాంగోపాల్  శర్మ"   భూతాల  సినిమా సెకండ్  షో చూసి  కాలనీలోకి  అడ్డదారిలో శ్మశానం మీదుగా వస్తున్నాడు.  ఉన్నట్లుండి  ఎదురుగా ఓ ఆకారం  కదిలినట్లూ,  తనను  దాటుకుంటూ  వెళ్ళి నట్లూ  అనిపించి, ఒక్కసారిగా  ఒళ్ళు  జల్లుమన్నది.  భయంపోగోట్టుకోనేందుకు  లేటెస్ట్  పాట ఒకటి  "కొలవరి, కొలవరి ..డీ ..,"   అందుకున్నాడు, అంతే ముందు వెళ్తున్న ఆకారం  ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి  చూసింది. 


తన   పాట  అంతగా నచ్చేసిందా, అనుకుని   హి, హి, అని నవ్వుకుంటూ  కొంచం దగ్గరికి  వెళ్ళాడు  మన  అభిలాష్ .  చెంద్రుడి  గుడ్డి వెన్నెల్లో కనిపించిన  ఆ  ఆకారం వో  అమ్మాయిది అని పోల్చుకోగలిగాడు. తెల్లటి బట్టల్లో  సన్నగా పొడుగ్గా  ఉంది. "హలో"   అన్నాడు  ఏదో పలకరించాలి  కనుక.  ఆమె గిరుక్కున   ముఖం  తిప్పుకుని  వడివడిగా  వెళ్ళసాగింది.  ఇంతకీ  ఈమె  ఎవరై  ఉంటుందీ? సినిమా చూసి  వెళ్తుందా?  అదీ  ఒక్కర్తి, వయసులో  ఉన్న అమ్మాయి. బహుశా గాంధీ  గారి  కలలు  నిజమయ్యాయా?  అస్సలు  మన కాలనీలో ఇలాంటి అమ్మాయిలే  లేరు, ఇలాంటి ఏంటి!  అస్సలు  అమ్మాయిలే  లేరు,  రోజూ సాయంకాలం  అలా షికారు  వెళ్తానా,  ప్రతిగుమ్మం  ముందూ ముగ్గుబుట్టలాంటి తలతో  ఓ ముసలమ్మ  ప్రత్యక్షం. తనని  చూస్తూనే  అబ్బీ  ... బైటకి  వెళ్తున్నావా?  తలనొప్పి  మాత్ర  తెచ్చిపెట్టు బాబూ,  మోకాళ్ళ నొప్పిమందు  తెచ్చిపెట్టు  నాయనా, ఇలా   లిస్టు  ఇస్తూ చిరాకు పెడతారు.

*   *   *
అరెరే...   ఆలోచనల్లో  ఆ అమ్మాయి   ఎటువెళ్లిందో  చూడలేదే,  కొంపదీసిగానీ తియ్యకుండాగానీ  ఆత్మహత్య  చేసుకునే  బాపతు  కాదుకదా? ఆ  ఆలోచన రావడం ఆలస్యం, ఒక్కసారిగా   పక్కనున్న పిల్ల కాలువవైపు పరుగెత్తాడు అభిలాష్. సందేహం లేదు ఆమె  అటుగానే  వెళ్ళింది.   అదిగో  ఆ కనిపించే వంతెనమీదికి  వెళ్తూ ఉంది  అనుకుంటూ  "హలో ..  మేడం" అంటూ అరిచాడు  అభిలాష్ .  "హాలో  మిమ్మల్నే"   ఈసారి  రెట్టించాడు. జవాబు ఇవ్వలేదు  ఆమె.  సరికదా  గబగబా  సగం కూలిపోయిన  వంతెన ఎక్కింది.  అభిలాష్ పరుగులాంటి నడకతో ఆమెను సమీపించాడు. ఆమె కాలువలో  దూకబోయింది  వెంటనే చేయి  పట్టుకుని ఆపబోయాడు.  ఆమె దూకటానికి ముందుకు వంగింది, తను  వెనక్కి లాగటానికి  ప్రయత్నిస్తున్నాడు,  ఆమె చాలా బలంగా   ఉంది,  అభిలాష్ తన శక్తినంతా  ఉపయోగించి  లాగుతున్నాడు.  ఈసారి రెండు   చేతులతో  లాగాడు,  ఆ ఫోర్సుకి   ఇద్దరూ  వెనక్కి పడిపోయారు.  కొంపదీసి వంతెన  కూడా కూలిందా అనుకున్నాడు అభిలాష్.

అయ్యో  ఆమె నా మీద పడింది  కదా... లేపుదామంటే  ఇంత బరువుగా ఉందేమిటి చెప్మా? .. పైగా  నా పేరే  పిలుస్తుంది  ఎలా తెలుసూ   అనుకున్నాడు అభిలాష్.  కానీ అంత చనువుగా  "ఒరే  అప్పిగా" అని పిలుస్తుంది అచ్చు  బామ్మ పిలిచినట్టుగా,  అయ్యో,  పిలిచినట్టుగా  ఏమిటి  బామ్మే.   అయితే  నా మీద ఉలవల బస్తాలా పడింది   బామ్మా??  ఆయితే   నేను లాగేసింది బామ్మ   పడుకున్న  మంచంకోడునా?.. ఇలా అనుకోగానే చచ్చే  సిగ్గేసింది అభిలాష్ కి.  ఇదంతా కలా ??   మొదలే  సిగ్గుతో చితికి  పోతుంటే  ఇక బామ్మగారి దండకం వినండి.  "ఆ  దిక్కుమాలిన దయ్యం  సినిమాలు   చూదోడ్డురా  అబ్బీ అంటే వింటావా, పగలంతా ఆ కుర్రకుంక  ఫోటాను తో కలిసి ఈతలపోటీలు, గేదె రేసింగులూ, రాత్రుళ్ళు పక్క తడపడాలూ"  నా నడుం విరిగి పొయిందిరో ..  దేవుడో, వెధవా వదులు  మంచం కోడు అంటూ తిట్లు లంకించుకుంది బామ్మ.

ఏమండీ  స్నేహితులూ...  మీరు  ఈ విషయం  ఎక్కడా  చెప్పకండీ  పాపం అబిలాష్, పెళ్లి కావాల్సిన  కుర్రాడు కదా  బాగుండదు.  ప్లీజ్ .., ప్లీజ్.




41 comments:

  1. అయ్యబాబోయ్ తెగ బయపెట్టారు అసలే ఇవాళ ఒక్కడిని ఉన్నా.. ఇగా నాకు నిదురవస్తుందో రాదో ఇవాలా...

    ReplyDelete
    Replies
    1. ప్రిన్స్ గారూ మీరు భయపడరు లెండి , మంచి మంచి పాటలు ఉన్నాయి మీ బ్లాగ్ లో, వింటూ ఉంటె భయం తెలీదు , కథ బాగుంది అన్నారు సంతోషం.

      Delete
  2. ఏంటి అక్క ఈరోజు అందరినీ భయపెట్టేలా రాసారు అనుకున్నా రెండో పారా చదువుతున్నప్పుడు, నిజం గా భయపెట్టారు..
    ఆఖరు పారా చదువుతున్నపుడు పిచ్చ నవ్వు వచ్చింది... :)
    మీ కలానికి నవరసాలు తెలుసు అక్కా... :))

    పెళ్లి అయితే, రోజూ దెయ్యాన్ని ఎలా భరించాలో అని, ఇప్పటి నుంచి ఇలాంటి దెయ్యాల సినిమాలు చూడమని, ఇదొక ట్రైనింగ్ అని అభిలాష్ కి ఫోటాన్ సలహా ఇచ్చాడేమో... :)))

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, నా కథ నచ్చినందుకు థ్యాంక్స్ , ఇకపోతే పెళ్లి అయితే దెయ్యాన్ని భరించాలా ? చెప్తా తమరి శ్రీమతిని రానివ్వండి, అప్పుడు తెలుస్తుంది దెయ్యమో? దేవతో?

      Delete
  3. మొదటి రెండు లైనులు చదివిన తర్వాత 'క్రైం' కథ అనుకున్నాను. పది లైనులు చదివిన తర్వాత భయానకమైన కథ అనుకున్నాను. తర్వాత సరదాగా సాగుతూ ... పన్నీగా కథ ముగిసింది. కథకు ముగింపు ప్రాణం. బాగుందండీ పాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. నాగేంద్ర గారూ, చూసారా నా కథ ఎన్నివిదాలుగా అనిపించిందో , కథ నచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రతి టపా చదివి నన్ను ప్రోత్సాహపరుస్తున్న మీకు కృతజ్ఞతలు.

      Delete
  4. :-))....:-))
    ఫాతిమా గారూ!
    బాగుంది మీరు ఒలికించిన హాస్య రసం.
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ ఒలికిన హాస్యరసం బాగుంది అన్న మీకు ధన్యవాదాలు.

      Delete
  5. సార్ ధన్యవాదాలు.

    ReplyDelete
  6. దడుచుకున్నాను ఫాతిమ గారు. horror thriller లా అనిపించ్చింది. :))

    ReplyDelete
  7. వెన్నెల గారూ, మరీ సున్నితంగా ఉండకూడదు. ఇంతకీ కథ నచ్చినట్లా ? నచ్చనట్లా ?

    ReplyDelete
    Replies
    1. భలే ప్రశ్న వేసారే? సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న అలోచన!
      ఎలాగు మీరు కథ ఫ్రీ గా ఇచ్చేసారు, direction కూడా ఫ్రీ గా చేసెయ్యండి!

      Delete
    2. వెన్నలగారూ , మనలో మన మాట ఈ స్కూళ్ళు అచ్చిరావటం లేదు ఇద్దరం అదే బాటలో పయనిస్తున్నాం కదా , పోనీ సినిమా తీసేద్దాం. పగటి షూటింగ్ మీరు రాత్రి దయ్యాల షూటింగ్ నేను, ఏమంటారు ?

      Delete
  8. ఇంతకీ బొమ్మలో ఉన్న ఆ అమ్మాయి దయ్యమా!?
    బాగుంది!
    చాలా బాగుంది!!
    సర్ప్రైజ్ చేసారు. కానీ బాగుంది!

    ReplyDelete
  9. శ్రీ సర్ , బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు, ఇంతకీ బాగుంది అన్నది అమ్మాయినా ? కథనా?

    ReplyDelete
  10. అమ్మాయి గురించే నేను చెప్పింది. కానీ అంత అందమైన అమ్మాయిని దయ్యం అని చెప్పారు కదా!
    ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి.
    కానీ కథలో చమత్కారం బాగుంది.
    మీలో మంచి హాస్య రస స్పందన ఉంది!
    ఇంకా ఇంకా రాయండి.

    ReplyDelete
  11. కలకన్నది అబ్బాయికదా అందుకే దెయ్యం కూడా అందమైన అమ్మాయిలా కనిపించి ఉంటుంది. సర్ కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు మీరు వడ్డించబోయేది ఏ రసం అని ఎదురు చూస్తున్నాను!

      Delete
    2. sir,neerasam thappa maredainaa vaddincha vachhukadaa,

      Delete
  12. అయ్య బాబోయ్.. ఒక్క కధలోనే భయానకం, హాస్యం ఇన్ని రసాలు ఒలకబోయడం మీకు మాత్రమే సాధ్యం ఏమోనండీ... సూపర్........
    (ఈ మధ్య నెట్ లేక రాసిన రోజే చదవలేక పొయ్యాను)

    ReplyDelete
    Replies
    1. సాయి గారూ, ఆలస్యంగా అయినా మీ నుండి స్పందన లబించిననదుకు ధన్యవాదాలు. కథ నచ్చినందుకు కృతజ్ఞతలు , ఇకముందు కూడా మీ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్న.

      Delete
  13. Replies
    1. వర్మాజీ , కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  14. ఫాతిమా గారూ...
    చాలా బాగుందండి .......!!!అన్నీ కలిపి కొట్టారు గా.....
    కరిగిపోకుండా ఎలా ఉంటాం ......!!!
    --సీత

    ReplyDelete
    Replies
    1. సీత గారూ, కలిపికొట్టిన( కట్టిన ) కదంబం నచ్చినందుకు ధన్యవాదాలు. ఇకపోతే నాకు ఓ మాటిచ్చారు గుర్తుందా ? అయ్యో అదేనమ్మా సీతమ్మతల్లీ .. మీ కల లో రామయ్య గూర్చి చెప్తాను అన్నారు కదా .. హ .హహ.

      Delete
  15. ఓహో! దెయ్యం ప్రియురాలా? అయితే హారర్:)

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ , దయ్యం ప్రియురాలంటే మాటలా ?.. అలాగే ఉంటుంది మరి, మా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

      Delete
  16. ఫాతిమాగారూ, యధావిధిగా మీదైనశైలిలో హాస్యాన్ని పండించారు. పెళ్ళికాబోయే కుర్రాడు పక్క తడపడం వెనుక బోలెడన్ని అ(పా)ర్ధాలు కావల్సినంత హ్యూమర్ పండించాయి...అభినందనలు

    ReplyDelete
  17. వాసుదేవ్ గారూ, మీ కామెంట్ కోసం చూసాను. ధన్యవాదాలు మీ ప్రశంసకు. పక్కతడిపెతేనేకదండీ బామ్మ అలా తిట్టిందీ, సర్ నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  18. ఒకప్పుడు బ్లాగుల్లో దెయ్యాల కథలు వ్రాసుకున్నాం. అలాంటిదేమో అని భయభయంగా చదివాను. సస్పెన్స్ బాగా పండించారు..

    ReplyDelete
  19. జ్యోతి గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు. దయ్యాలలో అందమైనవి ఉంటాయికదా భయంలేదు. చదివిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  20. హమ్మో అచ్చం SGV సినిమాలో లాగా భయపెట్టారు మొదట్లో....చివరికి బామ్మ దండకంతో ఆ అబ్బాయికి కలలో పట్టిన దయ్యం వదిలింది ;)
    ఇంతకీ పెరేమన్నారు, అభిలాషేనా? ఎప్పుడైనా కనిపిస్తే బామ్మ...కలా...దయ్యం మాకూ తెలుసులే అని ఆటపట్టిస్తాంలే...పెళ్లయ్యే దాకా ఎవ్వరికీ చెప్పంలెండి, పాపం అసలే పెళ్ళి కావలసిన కుర్రాడు.
    పెళ్లయ్యాక వాళ్ళావిడకి చెప్తాం...ఇక రోజూ కలలో వాళ్ళావిడే ఆట పట్టిస్తుంది ;)

    ReplyDelete
  21. చిన్ని ఆశ గారూ , కథ నచ్చినందుకు ధన్యవాదాలు. కథను ఇంతగా ఎంజాయి చేసిన మీకు, మీ పరిశీలనకు మరోమారు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ కామెంట్ రాలేదని చూసాను.

    ReplyDelete
  22. Fatimaji,
    Your post is lost. not visible. pl see

    ReplyDelete
  23. హ హా...భలే బాగా రాశారు.
    ఇదివరకు "ఆ రాత్రి" లో హడలగొట్టి చివరిలో నవ్వించారు
    ఇప్పుడు నవ్విస్తూ చివరిలో హైదరాబాద్ అంటేనే హడలు పుట్టించారు.
    ప్రతి పోస్ట్ లోనూ వైవిధ్యం చూపిస్తూనే ఉన్నారు, మంచి మెసేజ్ లు ఇస్తూనే ఉన్నారు.
    Congratulations!

    ReplyDelete
  24. చిన్నిఆశ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. chala baavundi
    fathima garu

    ReplyDelete