నాణేనికి ఆవలి జీవితం
బ్రతుకు చట్రంలో ఇరుక్కున్న జీవితం.
రంగుటద్దాలలో అందంగా అగుపించే జీవితం.
గుండెసెగలకే మండిపోతున్న జీవితం.
కంటిపాపపై నెత్తురు గడ్డలా ఉన్న జీవితం.
మృత్యుఘోషలో రహస్య రోదన లాంటి జీవితం.
అమాయకత్వాన్ని అణగదొక్కే జీవితం.
ఆత్మగౌరవాన్ని అమ్మకానికి పెట్టిన జీవితం.
వ్యామోహాన్ని వ్యాపారంగా చేస్తున్న జీవితం.
అన్వేషణలలో అంతమవుతున్న జీవితం.
అసహనాలతో విసుగెత్తుతున్న జీవితం.
అపనమ్మకాలతో అలకపాన్పునెక్కిన జీవితం.
ఆయువులో సగం అమ్ముకున్న జీవితం.
ఆదర్శాలకోసం సగం అర్పించుకున్న జీవితం.
ఎంగిలి కూటికోసం అంగలార్చే జీవితం.
అభద్రతా భావనతో అలసిపోయిన జీవితం.
నూరేళ్ళు నిండక ముందే ముగుస్తున్న జీవితం
వెలుగు నీడల హెచ్చు ,తగ్గుల గానుగెద్దు జీవితం.
అక్కరకురాని వెక్కిరించే దిక్కుమాలిన జీవితం.
నిజమే, అయినా తప్పదు కదా ఈ జీవిత పయణం.
ReplyDeleteజీవనాన్ని ప్రేమించాలి, జీవితాన్ని ప్రేమించాలి
వెన్నెల గారూ, మీరన్నట్లు జీవితాన్ని ప్రేమించాలి కాని జీవితం మోయలేనంత భారమైపోతున్నప్పుడు , వెంటనే ఉంటూ వెక్కిరిస్తున్నప్పుడు ఓ విదమైన విరక్తి కలుగుతుంది. అందుకే అంటారు జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు అని
Deleteమీరు చెప్పినవన్నీ నిజాలే కాని జీవితం అన్నపదం అన్నిసార్లు రిపీట్ కాకుండా మళ్ళీ ఎడిట్ చేసి చూడండీ ఒ అద్భుతకావ్యం ఆవిష్కరిస్తారు.మీ నుండి మరిన్ని మంచి కవితలు ఆశించే దిశగా.....అభినందనలు
ReplyDeleteవాసుదేవ్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు, మీరు చెప్పినట్లు ప్రయత్నించి రాస్తాను. జీవితం మీద కొత్త నిర్వచనంతో మరో మారు మీ ముందుకొస్తాను . నా బ్లాగ్ చూసి మంచి సలహాలు ఇస్తున్న మీకు నా కృతజ్ఞతలు
Deleteనిజమే...నాణేనికి అవతలి వైపున్నది సత్యం. కానీ ఆ సత్యాన్ని చూస్తూ ఇవతలివిపు అసత్యం మాటునే సాగిపోతుంది జీవితం అంతా...బహుశా అదే జీవితమంటేనేమో...కానీ పుట్టిన ప్రతి జీవీ జీవితాన్ని ప్రేమించక తప్పదు, లేదంటే మనుగడే లేదు...
ReplyDeleteకవిత చాలా ఆలోచింపజేసేలా ఉంది, బావుంది.
పండుగారూ, నిజమే పుట్టాను కనుక బ్రతకాలి అనే బ్రతికేస్తున్నాం. అయితే ఆ బ్రతకటం లోనే ఎన్ని అవరోదాలో. సార్ మీ ప్రశంసకు ధన్యవాదాలు
Deleteఇరు వైపుల నాణేనికి
ReplyDeleteపరమార్థమ్మొకటె - మనిషి పరహిత మతియై
వర జీవన యాత్ర గడిపి
మరణము తర్వాత కూడ మరి బ్రతుకుటయే .
----- సుజన-సృజన
సార్, మీ ప్రసంశకు ధన్యవాదాలు, రాజాసాబ్ నేను నా స్కూల్ వదిలేసి ఈ రోజు నుండీ మీ స్టూడెంట్ గా చేరిపోతున్నాను. అలా ఆశు కవిత్వం చెప్పగలగాలి
ReplyDeletenenu cheppalanukunnadi, vasudev garu cheppesaru.
ReplyDeletekeep writing. and thank you for follwing my blog.
బాస్కర్ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు.
ReplyDeleteపాతిమా గారు! జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteకవిత ఆలోచింపచేసేదిగా వుంది.
నాగేంద్రగారూ , కవిత నచ్చినదుకు కృతజ్ఞతలు
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteస్వాగతం , ఫాతిమా జీ ,
ReplyDeleteఉపాధ్యాయు లెప్పుడూ విద్యార్థులే గదా !
సార్, అడ్మిషన్ దొరికింది. సంతోషం
Deleteoriginality,satisfaction లేకుండా artificiality తో బ్రతికేయడం అలవాటయిపోయింది.....ఏం చెస్తాం.....ఈ సారికిలా కానీ అనుకోవడం తప్ప...!!
ReplyDeleteచాలా బాగా రాసారు ఫాతిమా గారు.
సీతగారూ , మీ కామెంట్ కోసం ఎదురు చూసాను. సరే ఏమిచేద్దాం ఈసారికిలా కానీ అనుకున్నాను
ReplyDeleteజీవితం అందమైనది
ReplyDeleteఅది భగవత్ప్రసాదం...
మన జీవితాన్ని అందంగా మలుచుకుంటూ
అందంగా లేని జీవితాలని అందంగా మార్చేందుకు తోడ్పడటమే
మనం జీవించాల్సిన జీవితం
మీ కవిత వేదననా భరితంగా ఉంది...
ఎందుకంటే చాలా వాస్తవాలున్నాయి అందులో...
@శ్రీ
శ్రీగారూ, అర్ధవంతమైన మీ సమర్ధన బాగుంది. మీ స్పందనకు ధన్యవాదాలు
ReplyDeleteఎప్పటిలాగే బాగుంది అక్కా..
ReplyDeleteఆత్మగౌరవం, ఆదర్శాలు, విలువలు మాత్రమే రోజు చివరన సంతృప్తిని ఇస్తాయి.. వీలైనంతవరకు వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తే జీవితం చివరన మరింత సంతృప్తి ఉంటుందేమో..
తమ్ముడూ, కవిత నచ్చినందుకు సంతోషం. ఇక పోతే మీరు చెప్పింది నిజం నైతిక విలువలు కాపాడుకుంటూ పోవటమే మనం చేయవలసింది.
Deleteచాలా బాగుంది కవిత. మన జీవితంలో ఇన్ని అఘాయిత్యాలా? అని ఆశ్చర్యం వేస్తోంది.
ReplyDeleteవాస్తవాన్ని ప్రతిఫలించారు.
సార్, నమస్తే మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు ఉంటే ఇంకా బాగా రాయగలనని అనుకుంటున్నాను. బ్లాగ్ సందర్శించిన మీకు నా కృతజ్ఞతలు .
DeleteIT's...Jeeevitam...........
ReplyDelete