స్వప్న కెరటం
పాతజ్ఞాపకాలు నను తట్టి లేపుతున్నాయి. మసకబారిన మస్తిష్కంలో నీ రూపురేఖలు వత్తిగిల్లుతున్నాయి.
పాతజ్ఞాపకాలు నను తట్టి లేపుతున్నాయి. మసకబారిన మస్తిష్కంలో నీ రూపురేఖలు వత్తిగిల్లుతున్నాయి.
కలల దస్తావేజులు తిరగేస్తే ఇంకో స్వప్నం బాకీ ఉంది.
ఎప్పుడో నిద్రలో ఉలిక్కి పడితే, నిస్థబ్దత నుండి ఓ నిట్టుర్పుబైటకొస్తే, నా నిదురరాని కళ్ళకు ఎదురుగా ఓ ఆకారం.
మెదడునరాలను చిట్లగోడుతూ, గుండెగోడలను కూల్చేస్తూ.., అదే ఆకారం ... అదే అస్పష్టత.
జ్ఞాపకం విషాదంగా పరచుకుంటుంది, వలపు స్మృతి పలవరింతల్లో దాక్కుంటుంది.
నీ తలపు అపశ్రుతా? లేక జాగ్రుతా? తెలియటం లేదే? వాడిపోదూ, వీడిపోదూ, ఉండిపోదు.
ఉండి, ఉండీ ఉరుములా ఉలిక్కిపడే మెరుపులా నను కదిలిస్తూ ఉంటుంది.
ఒక్కోసారి లోకమంతా అబద్దమనీ, నా నీవే నిజమనీ మురుస్తాను.
మరోసారి నీవసలే లేవనీ ... నీ తలపే అప్రమేయమనీ వెరుస్తాను.
నాగుండె కవాటాలు తెరుచుకుని రుధిరం ప్రేమని నింపుకుని గమ్యం తెలీక శరీరమంతా ఉప్పెనలా ఉరుకుతుంటే,
నీ స్మృతులు దాన్ని అడ్డగించి, మత్తెక్కించి, ముఖం మీదికి సిగ్గుసింగారంలా అతికిస్తాయి.
ఆర్ద్రతతో నేను దరికిచేరబోతే అందకుండా దూరంగా, బింకంగా ఉండిపోతావ్.
ప్రియా, అపురూపమైన నిన్నెలా అందుకోనూ ... కానరాని నిన్నెలా చేరుకోనూ.
ఏ లతాంగిలాలనలో ఉన్నావనుకోనా ఏ సమాజపాలనలో ఉన్నావనుకోనా.
మెల్లగా ఏదో స్వప్నకెరటం నను తాకుతుంది. నిను జ్ఞాపకంగానే నా దరి చేరుస్తుంది. అందుకే ఈ వ్యదలేవీ నీకు అంటకుండా నా ఎదలోపలే దాచుకుంటా.
ఎన్నిజన్మలైనా నిన్నే తలచుకుంటూ ఉంటా, నీకై వేచిఉంటా ప్రారబ్ధపు పందిరి కింద ఆశలతీగనై నిను అల్లుకుంటా.
కెరటం లా జ్ఞాపకాలు స్వప్నమై దరిచేరి మురిపించి నిద్ర సముద్రంలో ఉలికిపాటు అలలై లేపి ప్రేమ సాగరంలో దాగిపోయే వేళ...ఆ అలలు తాకిన మది భావాలు మరో స్వప్న కెరటంకై ఎదురు చూస్తూ ...కెరటాలాగవు, బాకీ తీరదు...
ReplyDeleteచక్కని భావం కవిత లో సాగర కెరటంలా కదిలించారు.
సార్, మీ పరిశీలనా , వివరణా చాలా బాగుంది, నా కవితాభావాన్ని అర్ధం చేసుకుని నన్ను ఇంకా రాయగలిగేలా చేస్తున్న మీకు ధన్యవాదాలు'
Deleteమీ స్వప్నకెరటాలు తీరం చేరాలని ఆశిస్తూ:-)...బాగుందండి మీ కెరటాల ఒరవడి!
ReplyDeleteపద్మగారూ, కవిత చదివిన మీకు ధన్యవాదాలు, నా ఊహకి చిత్రం పెడుతున్నపుడు మీరే గుర్తుకొచ్చారు. కవితకి తగ్గట్ట్టుగా చిత్రాన్ని ఎన్నుకొనే నేర్పు అతి తక్కువమందిలో మీరు ఒకరు, ఎప్పుడో అవన్నీ తెచ్చేసుకుంటాను.
Deleteమీ స్వప్నం, మీ అంతర్మధనం అన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. బాగుందండి!
ReplyDeleteవెన్నెల గారూ, భావాన్ని అక్షరూపంలో చూపించడంలో నేను ఉత్తీర్నురాలిని అయ్యాను. అందుకు మీ ప్రశంసే కారణం. కృతజ్ఞతలు మరోమారు.
Deleteనీ తలపు అపశ్రుతా ..? లేక జాగ్రుతా ..? తెలియటం లేదే , వాడిపోదూ , వీడిపోదూ ,ఉండిపోదు .
ReplyDeletevery nice!!
వనజ గారూ, మీకు నచ్చిన వాఖ్యాలు ఏమై ఉంటాయా అని చూస్తాను నా ప్రతికవితలో, చాలా చాలా, సంతోషంగా ఉంది మీ ప్రశంసకు. మీకు నా కృతజ్ఞతలు.
Delete"రుధిర రక్తం", "ప్రారబ్దపు పందిరి" లాంటివి ప్రాణంపోసాయి మీ కవితకి...అభినందనలు ఫాతిమాజీ
ReplyDeleteవాసుదేవ్ జీ , మీ ప్రశంసకు ధన్యవాదాలు, నా బ్లాగ్ నిత్యం దర్శించే మీకు నా కృతజ్ఞతలు.
Deleteబాగుంది
ReplyDeleteసార్, మీ ప్రశంసకు ధన్యవాదాలు, నా కవిత చదివినందుకు కృతజ్ఞతలు.
Deletenice, chaala chakkaga raasaarandi.
ReplyDeleteభాస్కర్ గారూ, కవిత నచ్చినందుకు చాలా థ్యాంక్స్. బ్లాగ్ దర్శించినందుకు మరో థాంక్స్.
Deleteఎన్ని జన్మలైనా నిన్నే తలచుకుంటూ ఉంటా, నీకై వేచి ఉంటా ప్రారబ్ధపు పందిరి కింద ఆశలతీగనై నిను అల్లుకుంటా'
ReplyDeleteచాలా బాగా రాసారండీ! "స్వప్న కెరటం" టైటిల్ తగ్గట్టు చిత్రం కూడా బాగుంది.
నాగేంద్ర గారూ, మీ పరిశీలనకు, ప్రశంసకు ధన్యవాదాలు, నా ప్రతి పోస్ట్ చదివి నన్ను ప్రోత్స్తహించే మీకు కృతజ్ఞతలు.
ReplyDeleteస్వప్నంలో ఇంత కథ ఉందా? చాలా బాగా రాసారు.
ReplyDeleteఇంత గాఢమైన భావాలు ఎద లోపల భరించలేకనే కదా
ఇలాంటి కవిత్వం వెలువడేది !
తెలుగు భాష మీ చేతిలో మరింత అందంగా తయారవుతోంది!
అభినందనలు!!
సార్, స్వప్నమే.. ఓ అందమైన ఓదార్పు. వాస్తవికతకు దూరంగా ఉంటూ విరుద్దబావాల సంఘర్షణతో జరిగే మౌన యుద్దమే కవిత్వానికి నాంది. ప్రతి హ్రిదయం పలికే భావాన్ని పలక గలగటమే కవి గొప్పతనం. తెలుగు భాషకు నేను న్యాయం చేసాను అన్నారు. ధన్యవాదాలు. మీ అభిప్రాయాన్ని తెలుపుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మీకు నా కృతజ్ఞతలు.
DeleteSir,mee rachanallo "kavi samayam " ani o chota chadivaanu ante emiti vivarincha galaru please.
Deleteచాలా బాగుంది ఫాతిమా గారు.........చక్కగా రాసారు....
ReplyDeleteపిక్ సూపర్..
-- సీత.....
సీతగారూ, మీకు కవిత మరియు చిత్రం నచ్చినందుకు చాలా సంతోషం. నా బ్లాగ్ దర్శించినందుకు ఇంకా ఆనందం.
Deleteస్వప్నం బాకీ ఉంది,లోకమంతా అబద్దమనీ, నా నీవే నిజమనీ మురుస్తాను,కానరాని నిన్నెలా చేరుకోనూ... వరకు బాగానే వచ్చారు. ఏ లతాంగిలాలనలో ఉన్నావనుకోనా ఏ సమాజపాలనలో ఉన్నావనుకోనా.. ఇక్కడ అసలు మెలిక పెట్టారు.ఆడ వారికి అనుమానాన్ని ఆవగింజ నుంచి రాత్రి స్వప్నమంత చేశారు. దీనికి భిన్నమైనది ఈ అంశం - వ్యధలేవీ నీకు అంటకుండా నా ఎదలోపలే దాచుకుంటా..అనడం. ఇది సాధ్యమేనంటారా? ప్రారబ్ధపు పందిరి కింద ఆశలతీగ మంచి సమయం. వెరసి మీ లోని స్వప్నం హృదయపు లోతుల్ని కొలిచే ప్రయత్నం చేస్తూనే, ఇంకో స్వప్నం బాకీని గుర్తుచేస్తున్నాయి. అదేనేమో రమ్యత, ఎత్తుగడలోని లౌక్యం.
ReplyDeleteసార్, మీ విశ్లేషణ బాగుంది, మీరన్నట్లు ఆడమనసులో అనుమానమే కీడు అభద్రతా భావన ఎక్కువ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎదుటివారిని వ్యదలేవి అంటకుండా చూసుకుంటుంది. కవిత ఎలా ఉందొ చెప్పలేదు.
Deleteఫాతిమా గారూ!
ReplyDeleteస్వాప్నిక లోకం లోని స్వప్నాన్ని
కనుల ముందర సాక్షాత్కరించారు....
చక్కని భావన...
ఎదురుచూపుల వేదన...
చాలా బాగుందండీ!
@శ్రీ
శ్రీ గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా ప్రతి కవిత చదివి నన్ను ప్రోత్శాహించిన మీకు కృతజ్ఞతలు.
Deleteఫాతిమా గారూ..నేనే ఎప్పుడూ లేటే...
ReplyDeleteచాలా బాగుంది మీ కవిత.. సూపర్
ప్రారబ్ధపు పందిరి కింద ఆశలతీగనై నిను అల్లుకుంటా. ఎందుకో నాకా లైన్ బాగా నచ్చింది...
సాయిగారూ, లేటు అంటే పరవాలేదు, చూస్తారు కదా , కవిత నచ్చినందుకు చాలా థాంక్స్.
ReplyDeleteకలల దస్తావేజులు తిరగేస్తే ఇంకో స్వప్నం బాకీ ఉంది....beautiful line Fathimaji...congrats..
ReplyDeleteవర్మాజీ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
ReplyDelete