అమ్మమ్మగారి ఊరు వెళ్ళాలంటే మా పిల్లలకి చాలా సరదా, ముఖ్యంగా మా ఆవిడకి మరీ ఇష్టం. నాకెమో మహా చిరాకు. కానీ తప్పదుకదా. నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరు మా అత్తగారిది. మేమెక్కిన బస్సు మిట్టమధ్యాన్నం మండుటెండలో ఓ అడవిలాంటి ప్రదెశంలొ మమ్మల్ని దింపి, మీ చావు మీరు చావండి అన్నట్లు వెళ్ళింది. ఓ నలభై యాభై లగేజీ బ్యాగుల్తొ రోడ్డు పక్కనే కూర్చున్నాం. ఎర్రటెండలో ఎర్ర చీమల్లా మాడిపొతున్నరు పిల్లలిద్దరూ. ఇక్కడికి ఓ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మేం వెళ్ళాల్సిన ఊరు. అక్కడికి బస్వెళ్ళదు. ఈ మధ్య కొత్తగా ఓ జట్కా బండి ఉందని తెలిసి దానికొసం ఎదురు చూస్తున్నాం. ఇంతలొ మా చిన్నాడు దాహం వేస్తుందని నానా గొల చేస్తూ సామాన్ల మధ్య కుప్పిగంతులు వేస్తున్నాడు.
* * *
హమ్మయ్య, మమ్మల్ని రక్షించటానికా అన్నట్లు దూరంగా జట్కా బండి వస్తూ కనిపించింది. దగ్గరయ్యేకొద్దీ అది కదులుతున్న పూల రథంలా ఉంది.రంగు రంగు పూలతొ అలంకరించి దాని మీద రెండు పెట్రొమాక్సు లైట్లు పెట్టి ఉన్నాయి. గుర్రానికి ముఖమ్మీద ఓ కుచ్చు అందంగా వేలాడుతూ ఉంది. బండి లోపల మెత్తటి పరుపులూ వగైరా రాచమర్యాదలని తలపిస్తున్నాయి. మేము పిల్లలూ ఎక్కికూర్చున్నాము, బండి బయలు దేరింది. మా పిల్లలు అడిగే ప్రశ్నలకు బండి సాయిబు వచ్చీ రాని తెలుగులో సమాదానాలు ఇస్తున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళామో లేదో బండి ఆగిపోయింది. గుర్రం ఓ అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చల్,,చల్ అన్నాడు బండి సాయిబు, అస్సలు కదలనని మొండికేసింది గుర్రం. సాయిబు గారు గుర్రం ముందుకెళ్ళి చేతులూ, కాళ్ళూ కదిలిస్తూ hip hop, salsaa లాంటి డాన్సు ఫార్మ్స్ అన్నీ కలిపి డాన్స్ చేసాడు, అప్పుడు కదిలిందా అశ్వరాజం. చెప్పొద్దూ నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇక మా పిల్లలు సరే సరి,, ఒకటే కేరింతలూ, కుప్పిగంతులూ, కబుర్లూ. ఇలా ఓ ఫర్లాంగ్ వెళ్ళామో లేదో మళ్లీ మొండికేసింది గుర్రం ఈసారి సాయిబుగారు ఎన్ని కుప్పిగంతులేసినా చెల్లలేదు, ముసలి హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడనట్లుగా సాయిబు డాన్సు బోరు కొట్టిందేమో మరి, మూతి బిగించుకుని నా ముఖం నా యిష్టం అన్నట్లుగా పెట్టింది గుర్రం. సాయిబు గారికి ఐడియా బల్బు వెలిగినట్లుంది బుర్రలో అంతే .. రంగం లోకి కుర్ర హీరోలను దించాడు, ఇంకేవరనుకున్నారూ,, మా పుత్ర రత్నాలు. ఇక చూడండీ స్టెప్పులతో ఇరగదీసారు నాకు నవ్వు ఆగలేదు. వాళ్ళని చూస్తుంటే ఎండలో ఎగిరెగిరి పడే కప్పపిల్లల్లా ఉన్నారు నా కళ్ళకు. అప్పుడు గుర్రం కదిలింది "హమ్మయ్య" అనుకున్నాం. అలసిపోయిన పిల్లలు నిద్రకు ఒదిగారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..... సాయిబుది, గుర్రానిదీ హైదరాబాదు. ఆ గుర్రం పెళ్లి బారాతుల్లో (పెళ్లి ఊరేగింపు) పెళ్ళికొడుకును ఊరేగించేందుకు ఉపయోగించేది. అలా బాజా భజంత్రీలకీ స్టెప్పులకీ అలవాటు పడిందట.... అందుకే ..... అలా మధ్యలో ఆగిపోతుందట ఎలాంటి కార్యక్రమం లేనప్పుడు. ఇదంతా మా మరదలు చెప్పినప్పుడు కొంత సిగ్గనిపించింది. అయినా హాయిగా నవ్వేసుకున్నాం.
హ హ హ హ హ హ... :))
ReplyDeleteసూపర్ అక్కా...
తమ్ముడూ , పర్వాలేదు నేనూ హాస్య కథలు రాయగలను. మీరు నవ్వారు కదా బాగున్నట్లే. ఈ కథ "ఆశ " మాస పత్రికలో జూన్ లో అచ్చయింది
ReplyDeleteపశుర్వేత్తి ..గాన రసః ..అన్నమాట. :)
ReplyDeleteహాస్యం తొణికిసలాడింది. కంగ్రాట్స్!!! .
వనజగారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు. కథ చదివినందుకు కృతజ్ఞతలు
Deleteహ హా...బాగుందండీ...బండి సాయిబు గారి పాత స్టెప్పులకి మొరాయించి..పిల్లల డిస్కో స్టెప్పులకు ఊపందుకుని హుషారుగా పరుగులందుకున్న గుర్రమూ...బహుశా తర్వాతి రోజు ఆ సాయిబు గారి స్టెప్పుల తంటాలు తల్చుకుంటే నవ్వొస్తుంది, వచ్చీ రాని డిస్కో లో, కుర్రకారు దొరక్క పడ్డ అవస్థలు.
ReplyDeleteబండి సాయిబు - ఈ మాట నెల్లూరు పరిసరాల్లో బాగా ప్రసిద్ధమేమో కదూ!
బాగుంది.
చిన్ని ఆశ గారూ, కథ చదివినందుకు ధన్యవాదాలు.మీకు నచ్చినందుకు సంతోషం .అవును నెల్లూరు వైపు బండి సాయిబు అనే అంటారు. నాకుకూడా చిత్రాలు వేయటం వచ్చి ఉంటే నా కథకి ఇంకా న్యాయం చేకూరేది. నా బ్లాగ్ చూసి నన్ను ప్రోత్సాహిస్తున్న మీకు కృతజ్ఞతలు
Deleteఫాతిమ గారూ, ప్రయత్నించి చూడండి, బొమ్మలు వెయ్యగలరేమో మీరు కూడా...ప్రతి ఒక్కరిలోనూ ఆర్టిస్ట్ దాగి ఉంటాడు ;)
Deleteమీరు చెప్పిన దానిలో నిజముందేమో అనుకుని బొమ్మలు వెయ్యటం మొదలు పెట్టాను, అవి ఎలాంటి కళా కండాలో చెప్పలేను. ఎప్పుడైనా ఓ బొమ్మ వేసివ్వమంటానని భయమా ?
Deleteభలే బాగుందండి!
ReplyDeleteవెన్నెల గారూ, మీ ప్రశంస లేకుంటే నా బ్లాగ్ వెలితిగా ఉంటుంది కథ నచ్చినందుకు ధన్యవాదాలు
Deleteఫాతిమా గారూ! చాలా బాగుందండీ!...
ReplyDeleteకథనం బాగుంది...
ఇంకా నయం ....ఇక్కడ ఉత్తరాదిలో అయితే...
పూర్తి dj team ఉంటే గాని మీ అశ్వరాజం కదిలేది కాదండోయ్...
ముందు పటాసులు పేలాలి...జువ్వలు వదలాలి...
ఈసారి ఆ సరంజామా కూడా ఓ నాలుగైదు లగేజీలుగా తీసుకొని బయల్దేరండి...
హహహః.....
@శ్రీ
శ్రీగారూ, కథ నచ్చినందుకు థాంక్స్ . అయ్య బాబో మేము బొపాల్ రాములెండి, మందు గుండు సామాగ్రితో ఎక్కడ రాగాలము చెప్పండీ .
Deleteచాలా రిఫ్రెషింగ్ గా ఉంది మీటపా థాంక్స్.
ReplyDeleteరాజేందర్ గారూ, నా బ్లాగ్ సందర్శించిన మీకు ధన్యవాదాలు .కథ నచ్చినందుకు కృతజ్ఞతలు
Deletehahaa........super fathimaa gaaru..
ReplyDeleteసీత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలండీ .
Deletebhagundandi, mee chinna katha.
ReplyDeleteభాస్కర్ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు .
Deleteథాంక్స్.
ReplyDeleteఒక సారి భయపెట్టినా వెంటనే నవ్వించినందుకు.
బాగుంది, నచ్చింది.
సార్, కథ నచ్చినందుకు ధన్యవాదాలు . సార్ ఈ వారం నవ్య వార పత్రిక దొరక లేదు " మెయిన్ టీన్ " చదవలేక పోయాను. క్రమం తప్పకుండా నా బ్లాగ్ సందర్శించే మీకు కృతజ్ఞతలు.
ReplyDeleteandhra e-books ki sign in ayi download chesukovacchu Medam. try cheyandi.
Deletevanaja garoo, thanks.alaage chestaanu
Deleteకథ,కథలోని భాష చదివించాయి,అభినందనలు
ReplyDeleteవాసు దేవ్ గారూ, మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ సందర్శించిన మీకు నా కృతజ్ఞతలు .
Deleteఫాతిమా గారూ!
ReplyDeleteకథనం చాలా బాగుందండీ!...
keep pen cap open for such nice & simple stories..
సార్, మీ స్పందనకు ధన్యవాదాలు. నా బ్లాగ్ సందర్శించిన మీకు కృతజ్ఞతలు
ReplyDelete