వేకువనే వలపు తలుపు తెరిస్తే వెచ్చటి కిరణంలా అరుదెంచావు.
అతిధివి అనుకుంటే ఆత్మీయుడివి అయిపొయ్యావు.
రేతిరి చుక్కలపక్క వేస్తే చందమామలా చేరువయ్యావు.
వేకువనే వెళ్తావనుకుంటే వెన్నంటే ఉండి పొయ్యవు.
సాయం సంధ్యలొ చల్లగాలికి కూర్చుంటే, పిల్ల తెమ్మెరవై ప్రవేశించావు.
అంధకారానికి అద్రుశ్యమౌతావనుకుంటే అల్లరిగా అల్లుకుపోయావు.
పగటివెలుగులో పాడియార్ది నై ఉంటే మిత్రునిలా పక్కనచేరావు.
సాయంకాలం సాగనంపుదామంటే సందు చూసుకుని సహచరుడివైపోయావు.
జామురాతిరి జ్ఞాపకాలపుటలు తిరగేస్తుంటే కళ్ళుమూసి కలలోకోచ్చావు.
వెలుగు వస్తూనే వెళ్ళిపోతావు అనుకుంటే వెక్కిరించి నావెనుక నక్కావు.
ఒంటరితనం వెన్నంటేఉంటే పొన్నచెట్టు నీడలో సేదతీరుతుంటే,
కనులుమూసి అధరాలపై ముద్ర వేసావు.
ఉలిక్కిపడిన నాతో కలతపడకు కలకాలం తోడుంటాను అన్నావు.
ఉలిక్కిపడిన నాతో కలతపడకు కలకాలం తోడుంటాను అన్నావు.
నిన్నేమని అనుకోను మరుభూమిలో మల్లితీగవు అనుకోనా?
ఎడారిలో నీటి తేటవి అనుకోనా, అంతరాన ఉన్న అతిదివి అనుకోనా?
chaalaa chaalaa baagundi.
ReplyDeleteI like it!!!
వనజగారూ, నెచ్చలికి నచ్చటం కన్నా నాకింకేమి కావాలి. ధన్యవాదాలు
ReplyDeleteనిన్నేమని అనుకోను మరుభూమిలో మల్లితీగవు అనుకోనా?
ReplyDeleteఎడారిలో నీటి తేటవి అనుకోనా, అంతరాన ఉన్న అతిదివి అనుకోనా"
super fathimaa jii......!!
:) :) :)
సీతగారూ, మిమ్ము ఏమనుకోనూ.. ఆత్మీయ స్పందన అనుకోనా .. ధన్యవాదాలు కవిత నచ్చినందుకు,
ReplyDeleteAs usual Super Akkaa.. :)
ReplyDeleteతమ్ముడూ, సంతోషం కవిత నచ్చినందుకు.
Delete:)
ReplyDeletethank you sir.
Deleteచాలా చాలా బాగుంది ఫాతిమా గారు.. మీ వర్ణన సూపర్....
ReplyDeleteసాయిగారూ, వర్ణన నచ్చినందుకు ధన్యవాదాలు, బ్లాగ్ దర్శించినందుకు కృతజ్ఞతలు.
Deletechaalaa chakkaga raasarandi.
ReplyDeleteఅంతరాన ఉన్న అతిదివి, bhagundandi.
భాస్కర్ గారూ, కవిత బాగుంది అన్నారు ధన్యవాదాలు. బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.
ReplyDelete'అనుకోని అతిధి' కవిత చాలా బాగా రాసారండీ. హృదయానికి హత్తుకునేలా ...మదిలో నిలిచిపోయేలా...!
ReplyDeleteనాగేంద్ర గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ ఫాలో అయిన మీకు నా కృతజ్ఞతలు.
ReplyDeleteఫాతిమా గారూ!
ReplyDeleteకవిత చాలా బాగుందండీ!
మీ బ్లాగ్ లోని మొదట వ్రాసిన కవితలకి చేరువగా ఉందండీ!
"రేతిరి చుక్కల పక్క వేస్తే చందమామలా చేరువయ్యావు...
వేకువనే వేల్తావనుకుంటే వెన్నంటి ఉండిపోయావు...."
చక్కటి భావన...
@శ్రీ
శ్రీ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు. ఇప్పటి ఈ కవిత నా మొదటి కవితకీ మీ ఆకరి కవితలకీ చేరువువగా ఉంది, మీరు ఈ మద్య కాలంలో కొత్త భాణీలో రాస్తున్నారు, కవిత నచ్చినందుకు కృతజ్ఞతలు.
ReplyDeleteఎంత బాగుందో!
ReplyDeleteచిన్ని గారూ, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించిన మీకు కృతజ్ఞతలు.
Deleteఎంత చక్కని ఉపమానాలు. ఎంత అందమైన భాష,
ReplyDeleteమీకెలా వస్తాయో కదా ఇంత అందమైన ఊహలు.
బహుశా గంధర్వలోకం నుంచి నేరుగా ఆంధ్రాకి వచ్చారేమో!
ఇంకా ఏమేం విశేషాలు ఉంటాయో చెప్పండి!!
శ్రీ సర్, మీ ప్రశంసకు ఎంత పొంగిపోయానో, ఓ సందర్బంలో ఒకే రకమైన కవిత్వం కాక అన్ని సమస్యలనూ ప్రతిబింబింప చేయగలగాలి అలా మీరు రాయ గలరు ప్రయత్నిచండి అన్నారు. మీరిచ్చిన ప్రోత్సాహం నేను మరింత మెరుగ్గా రాయగలిగేలా చేయగలదని ఆశిస్తున్నాను.
ReplyDeleteSimply superb andi faathimaa gaaru!
ReplyDeletechaala chaalaa baagundi.
Vennelagaaroo, thanks andee mee prashamsaku.
Deleteఅందమైన వర్ణనతో అతిథి సత్కారం బాగుందండీ..అభినందనలు...
ReplyDeleteవర్మ గారికి, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు, అంతరాన ఉన్న అతిధి కదండీ అలాంటి సత్కారమే ఉండాలి.
ReplyDeleteChala bagunnadandi mee kavita.
ReplyDelete