విత్తు ఏదైనా గానీ చెత్త కుప్పలో చిరుమొలక అయ్యింది.
ఆకలి మేక తరుముతుంటె ఆర్తనాదం చేసింది.
రవి కిరణాలతొ, ధూళి కణాలతొ పెరిగింది.
ఎంగిలి ఆకుల మధ్యనే ఏపుగా పెరిగింది.
గాలినీ, ధూళినీ తప్పుకుంటూ దారి పక్కనే నక్కింది.
ఉమ్మునూ, దుమ్మునూ తుడిచేసుకుంటూ ఎదిగింది.
పచ్చదనపు పలవరింతలు, వెచ్చదనపు కలవరింతలు,
మొగ్గతొడిగిన సిగ్గు దొంతర్లు, మోముపై సింగారించుకుంది.
మొహపు మొగ్గ నుండి మేలిమి కుసుమం అయ్యింది,
మౌనపు ముగ్ధ నుండి ముత్యపు మాట అయ్యింది.
కొత్త కొమ్మల పట్టుపావడాతొ మత్తు మత్తుగా ఊగింది.
పగలు కాగితం పువ్వు, రాత్రి కలువ పువ్వు అయ్యింది.
కంచె లెని తననుతాను రక్షించుకొలేకపొయ్యింది.
కామ మృగాల వంచనకు భక్షణగా మారింది.
అంతవరకు దాచుకున్నది దొచుకోబడింది.
అనాధ మొలకైన తాను అందరికీ చులకనైంది.
నిశి రాత్రి నిశ్శబ్దంగా రొదించింది,
రేఖలు కొల్పోయిన పూబాల శొక దేవత అయ్యింది.
తలదాచుకునేందుకు తల్లి వేరూ లేదుకదా,
తలచుకునేందుకు వలపు కాదుకదా.
చరిత్ర పునరావృతం అయ్యింది. మరో చిరుమొలక చెత్త కుప్పలొ మొలిచింది.
nice andi
ReplyDeleteThank you prince gaaru.
Deleteకంచే చేనును మేస్తున్న ఈ లోకంలో ఆ కొమ్మ రోదన అరణ్యరోదనే...
ReplyDeleteజ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు.
ReplyDeleteఆలశ్యం గా స్పందిస్తున్నాను. చూడలేదు మిస్స్ అయ్యాను.
ReplyDeleteచాలా బాగుంది ఫాతిమ గారు!
మీ స్పందన కోసమే ఎదురు చూస్తున్నాను Madam. ధన్యవాదాలు.
ReplyDeleteగుండెలను పిండేసి నట్లుంది. కాగితం పువ్వు, కలువ పువ్వు లాంటి ఉపమానాలు అలవోకగా ఎలా వస్తాయో కదా! చాలా బాగుంది. ఇస్మాయిల్ గారు ఇచ్చిన ప్రవక్త కొటేషన్ కూడా బాగుంది.
ReplyDeleteSir,నా కవితలు చదివి నన్ను మరింత రాయగాలిగేల ప్రోత్సహ మిస్తున్న మీకు ధన్యవాదాలు
DeleteMay God bless you.
DeleteThank you Sir,
DeleteThank you Sir,
Deleteతలదాచుకునేందుకు తల్లి వేరూ లేదుకదా,
ReplyDeleteతలచుకునేందుకు వలపు కాదుకదా.
చరిత్ర పునరావృతం అయ్యింది. మరో చిరుమొలక చెత్త కుప్పలొ మొలిచింది.:))))
చిక్కని గాడత కల్గిన కవిత. చివరి వరకు..ఒకే టెంపో కనిపించింది.అభివ్యక్తీకరణ చాలా బాగుంది.
వనజ గారూ, మీ ప్రసంశకు ధన్యవాదాలు.
ReplyDeletetouching poem...thanks for sharing with us...
ReplyDeletesir,thankyou
ReplyDeleteకొత్త కొమ్మల పట్టుపావడాతొ మత్తు మత్తుగా ఊగింది.
ReplyDeleteపగలు కాగితం పువ్వు, రాత్రి కలువ పువ్వు అయ్యింది.
కంచె లెని తననుతాను రక్షించుకొలేకపొయ్యింది.
కామ మృగాల వంచనకు భక్షణగా మారింది.
అంతవరకు దాచుకున్నది దొచుకోబడింది.
అనాధ మొలకైన తాను అందరికే చులకనైంది.
బ్యూటిఫుల్ లైన్స్ అండి;సింప్లీ సూపర్బ్!
ప్లీస్ కీపిటప్
హరి గారూ, మీ సునిశిత పరిశీలనకు ధన్యవాదాలు.
Deleteచరిత్ర పునరావృతం అయ్యింది. మరో చిరుమొలక చెత్త కుప్పలొ మొలిచింది...
ReplyDeleteఎక్కడో చదివిన జ్ఞాపకం....
కవిత గానీ కథ గానీ ముగించడం కష్టం అని...
ఆ ముగింపు మీకు వెన్నతో పెట్టిన విద్య...
చాలా బాగుంది
@శ్రీ
శ్రీ గారూ, హిందీ లో ఓ నానుడి ఉంది."आगाज़ अछा हो तो अंजाम भी अछा होगा". మంచి ప్రారంభం మంచి ముగింపుకు దారి చూపిస్తుంది. మీ పరిశీలనకు ధన్యవాదాలు.
ReplyDeleteBagundandi
ReplyDeletethank you
ReplyDeleteఒక జీవితకధను.. మనసుకు హత్తుకునేలా... చెప్పారు...
ReplyDeleteఆ చెత్తకుప్పలోని.. చిరుమొలకల.. జీవితాలు ఇక అంతేనా!!!! :(
Madam, మానవతా విలువలు మంటగలసి మనిషిలో స్వార్ధం పెరిగి సమాజంలో విలువలు తరిగి ఈ చిరుమోలకలు మొలుస్తున్నాయి , సామాజిక మార్పు రావాలి అందుకు సాహిత్యం కుడా తోడ్పడాలి ,ఆర్దిక పరిస్థితి మెరుగు పడాలి .
ReplyDeleteఫాతిమ గారూ!
ReplyDeleteచాలా అద్భుతంగా రాశారు, ఆలోచింపజేసే కవత, మన చుట్టూ కనిపించే ఎన్నో జీవితాలను చిరుమొలకలతో పోలుస్తూ ఆ ముగ్ధత్వం, దయనీయ స్థితీ కలిపి రాసిన తీరు అద్భుతం.
SIR, మీరు నా బ్లాగ్ చూసినందుకు కృతజ్ఞతలు , సార్ ఆడపిల్లలకు జరిగే అన్యాయాలను నేను భరించలేను నేను ఓ చిన్న స్కూల్ నడుపుతూ బీద ఆడపిల్లలకు ఫీజు తీసి వేసాను , హలానికి , కలానికి మంచి శేక్తి ఉందని నమ్ముతాను నేను , మీరు గొప్ప చిత్ర కారులు అని తెలుసు సంతోషం మీరు నన్ను అబినందించినందుకు .
ReplyDeleteఫాతిమ గారూ!
ReplyDeleteSIR అనటం ఎందుకో ఇబ్బంది గా ఉంది. టీచర్ గా మీరు అందరినీ అలా పిలుస్తుండొచ్చు!
స్కూల్ ప్రిన్సిపల్ గా చేశారని మీ ప్రొఫైల్ లో చూశాము. బీద ఆడ పిల్లలలకు ఫీజు లేకుండా విద్య అందిస్తున్న మీ సేవలు మీ భావాల ఆచరణకి నిదర్శనం. తెలుగు భాషలో ఇంత చక్కగా మంచి భావాలతో రాస్తున్న మీరు నిజంగా అభినందనీయులు!
కలానికీ హలానికీ మంచి శక్తి ఉందన్న మీ నమ్మకం సత్యం!
మరో మారు అభినందనలు!
సార్, చిత్రకారులు అంటే అబినవ బ్రహ్మ అని అంటారు , అంత మంచి కళ మీకు అబ్బటం ఓ వరం, మీ అబిమానానికి కృతజ్ఞతలు , నేను వ్రాసిన కొత్త కవిత చూసి మీ అభిప్రాయం తెలియజేయండి .
ReplyDelete