Pages

Wednesday 2 May 2012

ఆజాదీ

తెల్ల వారితే స్వాతంత్ర దినోత్సవం. కానీ మా ఇంట్లో ఇంకా రాలేదు.  నేను రైల్వే అధికారిని, కానీ నా పిల్లల్ని నా రైల్వే స్కూల్ లో చదివించే స్వాతంత్ర్యం నాకు లేదు. నేను అంతో ఇంతో పేరున్న కవిని, స్వచ్చమైన తెలుగు మాట్లాడాలని ప్రయత్నిస్తాను, కానీ ఇంట్లో తెలుగు మాట్లాడితే పిల్లలకు ఇంగ్లీషు ప్రాక్టీస్ కాదని మా ఆవిడ మాట్లాడనివ్వదు. ఇక ఇంగ్లీషు తనతో మాట్లాడదామంటే ఏదో క్లాసు ఏడు సార్లు ఫెయిల్ అయ్యి ఇక చదవలేనని ఏడిస్తే ఏడేళ్ళ క్రితం నా ఎదాన పడేసాడు మా మామ గారు. 
పొద్దున్నే ఐదు గంటలకి కళ్ళు తెరిచినా నేను ముఖం దగ్గరగా తెల్లటి ఆకారం నా మొఖం లో మొఖం పెట్టి గట్టిగా అరవటం చూసి కెవ్వున కేకేసి మంచం మీద నుండి కింద పది నడ్డి విరిగినట్లయ్యి భయం తో ద. ద. దయ్యం అన్నాను. అబ్బా ఎప్పుడూ ఏదో పరధ్యాసేనండీ మీకు. నేనండీ.. లిల్లీని (తనను అల్లగే పిలవమంటుంది) నాకేమో అలా  పిలిస్తే  పిల్లి  అన్నట్టు ఉంటుంది.  అయినా వినదు.  ఇంతకీ నేను తన మేకప్ చూసి  భయపడ్డానన్నమాట. 

మర్చిపోయారా, మన బాబిగాడి స్కూల్లో  ఫంక్షన్ ఉంది.  మేడం గారు  రమ్మన్నారు,  లేచి తయారవ్వండి అంటూ పురమాయించింది. 

అది కాదే... మా రైల్వే వాళ్ళు నన్ను.... మాట పూర్తి కాలేదు, కాఫీ కప్పు టఫీమని నా నెత్తి మీద కొట్టింది. ఆ దెబ్బకి రెండు కనుగుడ్లూ ఓ జానెడు ముందుకొచ్చి మళ్ళా యదా స్థానానికి వచ్చాయి.  నెత్తిమీద జుట్టులేని కారణంగా కాఫీ త్వరగా నా నోట్లోకి జారింది, అదే తాగాను, ఎంచేస్తాను  మరి.
                                                             * * *
మేం వెళ్ళే సరికి జండా ఎగుర వేసేసారు. "కాంటా" మేడం (ప్రిన్సిపాల్ కాంతమ్మ) గారి ఉపన్యాసం సాగుతుండగా మేం మాకు కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నాం.  కాకి గూడు లాంటి కత్తిరించిన జుట్టు,  జబ్బల జాకెట్టు,ఎర్రటి మూతి (లిప్స్టిక్ తో) చేతులు  కళ్ళూ తిప్పుతూ  భయంకరమైన వ్యాకరణ  తప్పులతో  "అంగ్రేజీ"  లో ఉపన్యాసం దంచుతూ ఉంది.  నేను లేచి  నుంచున్నాను.  వెంటనే  మా  లిల్లీ  ఓ గుంజు గుంజి, నన్ను  కూచోబెట్టింది.  మీరు  కూచోండీ, ఆమెమీ  తప్పులు మాట్లాడ్డం లేదు, అది ఫారిన్ ఇంగ్లీషు అన్నది ఖచ్చితంగా అంతే అన్నట్టుగా. 

కాసేపటికి టీచర్లు స్వీట్లు పంచుతున్నారు. నేను మళ్ళీ లేచి నుంచున్నాను. ఈ సారి కండ ఊడివచ్చేలా నా తొడ మళ్ళీ గిల్లింది. ఛీ... ఛీ... అలా ఎగబడకండీ... మనింట్లో పక్కింటివాళ్ళిచ్చిన  స్వీటు అలాగే ఉంది. టామీని కూడా తిననీయకుండా మీకోసం ఉంచాను అంటూ నన్ను కుర్చీలో కూలేసింది. ఈ సారి, పిల్లలు నెహ్రూ, గాంధీజీ వేషాల్లో స్టేజి మీదకు వెళ్తున్నారు. నేను మళ్ళీ లేచి నుంచున్నాను. "అబ్బా వినరు కదా"... అంటూ నా పాంటు పట్టుకుని కిందికి లాగేసింది  మా ఆవిడ.  అయినా సరే నేను కూర్చోలేదు. ఈసారి నేను చెప్పదలచుకున్నది గట్టిగా అరిచి చెప్పాను.


"మేడం మీరు జాతీయ జెండా తిరగేసి కట్టి ఎగరేసారు". అంతే అందరూ అవాక్కయ్యారు, జెండా వంక చూసి కాదు, వలువలులేకున్నా, విలువలకోసం పోరాడుతున్న నన్ను చూసి. ఫరవాలేదు నేనూ స్వతంత్రుడినే.



(ఆశ మాస పత్రిక May నెల సంచికలో ప్రచురితం)














11 comments:

  1. ఫాతిమా గారు, బాగుంది!
    ఇంతకు ముందు మీరు రాసిన టపా లకి దీనికి ఎంత వ్యత్యాసమో..
    "వలువలులేకున్నా, విలువలకోసం పోరాడుతున్న నన్ను చూసి" నాకు బాగ నచ్చిన లైన్! ఇలాంటివి ఇంకా రాయండి,

    ReplyDelete
    Replies
    1. Thank you Mam, మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు.

      Delete
  2. Iteevala kaalam lo nenu choosina blog la lo.. manchi Content unna blog meedi. keep blogging ..

    ReplyDelete
    Replies
    1. Thank you Mam, కృతఙ్ఞతలు.

      Delete
  3. ఫాతిమా గారు
    చాలా బాగా రాసారు
    తెలుగుమీద,తెలుగు సంస్కృతిమీద,దేశభక్తిమీద
    అన్నీ చిన్న కథలో ప్రస్పుటింపచేసారు
    బాగుంది

    ReplyDelete
  4. బాగుంది ఫాతిమా గారూ!
    @శ్రీ

    ReplyDelete
  5. Madam me blog chala bagaundi.

    ReplyDelete
  6. madam kavitalu meru somthanga rasthara.

    ReplyDelete
  7. Sir,mee prasna ardam kaledu, nene raastanu blog nachinanduku dhanyavaadalu

    ReplyDelete