చిన్ని ఆస్తి
నాకున్న చిన్ని ఆస్తి నా చొక్కా జేబులో ఇమిడి పోతుంది, అదేంటో తెలుసా? ఒకటి "చారణా" బిళ్ళ ఇంకోటి 'ఐస్ క్రీం" పుల్ల. ఇవి రెండూ నాకు ప్రాణం.
నాకున్న చిన్ని ఆస్తి నా చొక్కా జేబులో ఇమిడి పోతుంది, అదేంటో తెలుసా? ఒకటి "చారణా" బిళ్ళ ఇంకోటి 'ఐస్ క్రీం" పుల్ల. ఇవి రెండూ నాకు ప్రాణం.
అవునూ, నా గురించి మీకు చెప్పలేదు కదా, నాకు మూడేళ్ళు, మీరు నన్ను చాలా సార్లు చూసే వుంటారు. ఎక్కడా అనుకుంటున్నారా? ఫుట్ పాత్ మీద.
ఎర్ర సిగ్నల్ పడినప్పుడు ఒక్క నిమిషం నా వంక చూస్తారు. నేనక్కడే ఆడుకుంటూ ఉంటా. మీతో వుండేది మీ పాపనుకోండి, నేను కరెంటు స్థంభం చాటుకేల్తా. ఎందుకంటారా, నాకు సిగ్గు బాబూ, నా చెడ్డి చిరిగి పోయింది కదా.
మా అమ్మకీ ఆస్థి వుంది, అదంతా రెండు సంచుల్లోకి వస్తుంది. రెండు బొచ్చెలు, రెండు ప్లాస్టిక్ గ్లాసులు, రెండు చీరెలు. పూసలూ, బొమ్మలూ అమ్ముతుంది. మేముండే స్థలం కూడా రెండు బారలే. అసలీ "రెండు" అనే పదం మా బ్రతుకులో అచ్చు పది పోయింది. మేమూ ఇద్దరమే.
నేను అనుకుంటూ ఉంటా, ఎన్ని కార్లో, ఎన్ని మోటారు సైకిల్లో, అసలీ జనాలంతా అటూ ఇటూ ఎందుకు తిరుగుతుంటారు. షాపుల నిండా వీళ్ళే, హోటళ్ళ నిండా వీళ్ళే. ఏమి కావాలంటే అవి కొనుక్కుంటారు. ఎక్కడివి ఇన్ని డబ్బులు. సదువుకుంటే వస్తాయా. ఎట్లా సదువుకోవాలి. ఎవర్ని అడగాలి. నేను సదువుకోవాలంటే ఏం చేయాలి. అడగదామంటే ఒక్కరూ ఆగరుకదా.
మీకు తెలుసా మా అమ్మ చెప్తాది చానా మందికి రెండు జన్మలకి సరిపడా డబ్బులు ఉంటాయట.
నాకూ సదువుకోవాలని ఉంది. సదువుకుని డబ్బులు సంపాదించి అమ్మకూ నాకూ ఓ దుప్పటి కొనాలి. కానీ సదువుకోవడం ఎట్లా.
ఎవరైనా ఒక్క క్షణం ఆగి చెప్పండి.
ఎవరైనా ఒక్క క్షణం ఆగి చెప్పండి.
!?.. :(
ReplyDeleteMadam, expression అర్థం కాలేదు. తెలియచేయగలరు.
Deleteఇలాంటి పేద పిల్లలకోసం... అనాధ పిల్లలకోసం... హైదరాబాద్ లో 48 హాస్టల్స్ ఉన్నాయి.. ఒక సారి ఈ లింక్ చూడండి--->>> http://mysmileonyourlips.blogspot.in/2012/04/blog-post_29.html
ReplyDeletePrince garu, Thank you for valuable information.
DeleteSo touching!
ReplyDeleteThank you Mam.
ReplyDeletefatima గారు,
ReplyDeleteఇంతమంది బ్లాగార్సున్నారు కదా !మరి మనమందరం కలిస్తే వీరికి మనమేమీ చేయలేమా?!ఒకవేళ చేయలేకపోయిన-
మన ప్రిన్స్ గారు చూపించిన హాస్టల్లో ఒక్కొక్క బ్లాగర్ ఒక్కొక్క అనాధను చేర్పించగలమేమో ఆలోచించండి!
హరి గారూ, మీ స్పందనకి ధన్యవాదాలు. మీ ఆలోచన చాలా గొప్పది, మనం ఆలోచింప చేయగలం, కానీ ఎవర్నీ నిర్భంధించ లేము కదా. అలాగని వారు ఏమీ చేయడం లేదని అనలేం. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా నా స్కూల్లో పేద పిల్లలకి ప్రవేశ రుసుము తీసుకొను. ఇకనుండి బీద బాలికలకు నెలసరి ఫీజు కూడా తీసేస్తున్నాను. మనం వేసే అడుగు ప్రగతి పధం వైపే ఐతే ఇతరులను ఆలోచింపచేస్తుందని నా అభిప్రాయం.
ReplyDeleteమీ బడి ద్వారా ప్రజాసేవ చేస్తున్నందులకు జోహార్లు.
ReplyDeleteమీ సేవలు మరెందరికో అభివృద్ధిని చేకూరుస్తాయని ఆకాంక్షిస్తూ
మరొకసారి జోహార్లతో
sir, మీ ప్రశంస కు ధన్యవాదాలు
ReplyDelete