లేమితనం కమ్ముకున్న లేతప్రాయం నాది,
తెలివి మీరిన నాగరికత ముందు తెగిన బాల్యం నాది,
ఉదయపు వెలుగు మీకు ఆనందాన్నీ, నాకు ఆకలిని చూపిస్తుంది,
అమ్మా నాన్నలకు ఆధారమై .... జీవిత గాలిపటానికి నేనూ దారమై,
అక్కనైనా అమ్మ స్థానంలోకొచ్చి, తమ్ముడికి నా చిన్ని వడిని ఆశ్రయం ఇచ్చి,
చిదుగులు ఏరి, చిట్టి చేతులతో అన్నం వంపి, అన్నపూర్ణలా తమ్ముడి బొజ్జ నింపి,
పావురాల్ళలా, పాలరాతి బొమ్మల్లా, బడికెళ్లే పిల్లలను... పట్టు లంగాల్లో గుడికెళ్లే పాపలను, టికెట్ లేని వినొదంలా చూస్తూ ఉంటాము నేనూ, తమ్ముడూ.
చింపిరి జుట్టు, చిరుగు పాతల్లో ఉన్న మాకు అందమైన వలువలు తొడిగితే అలాగే ఉంటాము,
చట్టాలూ హక్కులూ అన్నీ కాగితాలమీదేనా, మా జీవితాలమీద ప్రభావం చూపవా.
అంతర్జాతీయ బాలల దినోత్సవం కోసం బెస్ట్ ఫోటోకి సెలేక్టైన ఫస్ట్ బాలనే నేను.
బాల కార్మికులు ఉండరాదన్నారు, మరి బాల్యమే లేని నేను ఏ కోవలోకి వస్తాను.
నాకు బడికేల్లాలనే ఆశయం, మరి తమ్ముడికో, నా వడియె ఆశ్రయం.
చెయ్యగలవా .......
ఆకలి కేకల, ఆశల చూపుల నిర్భాగ్యం నుండి విముక్తి,
చిరుగుపాతల, చింపిరి తలల దౌర్భాగ్యంనుండి ముక్తి,
వ్యథలు నిండిన మనస్సూ, ఎదిగే వయస్సూ, ఎన్నాళ్ళు ఈ తపస్సూ.
వస్తుందా నేనాసించిన ఉషస్సు.
కవిత చాలా చాలా బాగుంది. హౄదయాన్ని తడిమి ఆర్ద్రత కలిగించేలా ఉంది. ఈంకా ఇటువంటివి మరిన్ని మీ కలం ఆశిస్తున్నాను. శ్రీగంగ
ReplyDeletethamk you sir
Delete