Pages

Saturday, 31 March 2012

ఎంత బావుంటుంది

ఎంతబావుంటుందీ .....

వెన్నెలను  తెచ్చి  నీ  కన్నుల   నింపగలిగితే,  

పారిజాతాలతో  పందిరి  వేయగలిగితే,

నక్షత్రాలను   నీ  ఇంట   దింపగలిగితే, 

పాలకడలిలో  నీ  పాదాలు  కడగగలిగితే, 

మల్లె  మకరందాలు  నీ  వాకిట  చల్లితే, 

పొగడ  పూలను  నీ  పక్కగా  పరచగలిగితే, 

నెమలి  పించముతో   నిను  నిద్ర  లేపితే,

పున్నమి  పుప్పొడి నీ  పాదాలకు  పారాణి  అద్దితే, 

రామచిలుకతో  నీకు  రాయబారమంపితే, 

హరివిల్లు  తుంచి  నీ  సిగలో  నుంచితే ........ "ఎంతబావుంటుంది"


నీవు  అమృతమైతే ...... నేను  అక్షయపాత్రనైతే,

నీవు  పెన్నిదివైతే ...... నేను  సన్నిధినైతే...... "ఎంతబావుంటుంది"

No comments:

Post a Comment