Pages

Friday, 30 March 2012

పూవనిలో ఆమని

మంచులో    ముంచిన     మల్లెవు     నీవు,
మంచితో   నిండిన   మమతవు   నీవు,

అరుణోదయంలో    విరిసిన    మందారం   నీవు,
చంద్రోదయంలో   విచ్చిన   కలువవు    నీవు,

తెలిమబ్బు పై    తేలియాడే    తరుణం   నీవు,
తోలిపొద్దు పై     తేటమైన    కిరణం    నీవు,

పగడపూలలో    విరజిమ్మే    సువాసన    నీవు,
జగతి    బాటలో    విహరించే   సుప్రజవు   నీవు,

అనురాగ    సరాగాల   ప్రవాహం    నీవు,
అందని    అపురూపాల   ప్రశంసవు   నీవు,

మంచు   బిందువులు   ముద్దాడిన   నందివర్ధనం    నీవు,
మలినమంటని    స్వచ్చమైన   చందమామ   నీవు,

తూరుపు    ఉషోదయ    తుషార    బిందువు    నీవు,
గాంధర్వలోకాన     పూవనిలో    అరుదెంచిన    ఆమనినీవు.  





5 comments:

  1. మీ కవితా శీర్షికలు భలే ఉంటాయండీ! పూవనిలో ఆమని.. చాలా బాగుంది.

    ఒక చిన్న సవరణ .పగడ పూలు కాదు అనుకుంటాను అండీ. పొగడ పూలలో .. అనాలనుకుంటున్నాను .

    ReplyDelete